హోమ్ /వార్తలు /క్రీడలు /

Neeraj Chopra: " మీ వ్యక్తిగత ఎజెండా కోసం నా పేరు వాడుకోకండి!.. బురద జల్లే పనిని కట్టిపెట్టండి "

Neeraj Chopra: " మీ వ్యక్తిగత ఎజెండా కోసం నా పేరు వాడుకోకండి!.. బురద జల్లే పనిని కట్టిపెట్టండి "

Neeraj Chopra

Neeraj Chopra

Neeraj Chopra: పాకిస్తానీ క్రీడాకారుడు నదీమ్​.. నీరజ్​ జావెలిన్​ను ట్యాంపర్​ చేయాలని ప్రయత్నించాడని కొంతమంది ఆరోపించారు. ఈ వివాదం ముదురుతుండటంతో నీరజ్​ చోప్రా మరోసారి స్పష్టత ఇవ్వక తప్పలేదు.

టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) ​లో భారత్​కి స్వర్ణ పతకం అందించిన బల్లెం వీరుడు నీరజ్​ చోప్రా (Neeraj Chopra) రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు. జావెలిన్​ త్రో ఫైనల్​లో ఈటెని 87.58 మీటర్లు విసిరి అథ్లెటిక్స్​లో భారత్​ 100 ఏళ్ల స్వర్ణ పతాక నిరీక్షణకు తెరదించాడు. దీంతో, దేశమంతటా నీరజ్​ చోప్రా (Neeraj Chopra Latest Updates) పేరు మార్మోగిపోయింది. అయితే, కీలకమైన ఫైనల్​కు ముందు జరిగిన ఓ ఆసక్తికర ఘటనకు సంబంధంచిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. పాకిస్థాన్​కు చెందిన జావెలిన్​ క్రీడాకారుడు​ అర్షద్​ నదీమ్ (Arshad Nadeem)​ నీరజ్​ చోప్రా బల్లెం విసరాల్సిన బల్లెన్ని పట్టుకొని తిరగడం ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. దీనిపై నీరజ్​ చోప్రా ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘‘ఒలింపిక్స్​ ఫైనల్​కు ముందు నేను నా జావెలిన్​ కోసం వెతుకుతూనే ఉన్నాను, కానీ అది కనిపించలేదు. నా బల్లెన్ని అర్షద్​ నదీమ్​ పట్టుకొని అక్కడే అటూ ఇటూ తిరుగుతుండటాన్ని సడెన్​గా చూశాను. ఆయన దగ్గరకు వెళ్లి.. భాయ్​ ఇది నా జావెలిన్​.. ఇవ్వండని అడిగాను. దీంతో నదీమ్​ ఆ జావెలిన్​ను నాకు ఇచ్చేశాడు. అందుకే బహుశా మీరు నా మొదటి త్రోను గాబరాలో వేసినట్లు గమనించవచ్చు.”అని అన్నాడు. అయితే, ఈ వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. నదీమ్​ వ్యవహార శైలిపై మీ స్పందనేంటని నీరజ్​ చోప్రాపై కొంతమంది నెటిజన్లు ప్రశ్నించారు. పాకిస్తానీ క్రీడాకారుడు నదీమ్​.. నీరజ్​ జావెలిన్​ను ట్యాంపర్​ చేయాలని ప్రయత్నించాడని కొంతమంది ఆరోపించారు. ఈ వివాదం ముదురుతుండటంతో నీరజ్​ చోప్రా మరోసారి స్పష్టత ఇవ్వక తప్పలేదు.

అర్షద్ నదీమ్​ తప్పేమీ లేదు..

ఈ వివాదంపై నీరజ్ తన ట్విట్టర్​ అకౌంట్​లో వీడియో పెట్టాడు. ఆయన​ మాట్లాడుతూ ‘‘దయచేసి నన్ను, నా కామెంట్లను మీ వ్యక్తిగత ఎండాల కోసం వినియోగించుకోవద్దు. క్రీడాకారుల మధ్య ఎటువంటి వైరుధ్యాలు ఉండవు. దేశాలు, ప్రాంతాలకు అతీతంగా స్పోర్ట్స్​ మమ్మల్నందరినీ కలిసి ఉండాలని నేర్పుతుంది. ఇటీవలి నా వ్యాఖ్యలపై కొంత మంది నెటిజన్లను కావాలనే దుమారం రేపుతున్నారు. వారి కామెంట్లను నన్ను తీవ్రంగా కలిచివేశాయి.”అని అన్నారు.

అయితే, తన జావెలిన్​ను అర్షద్​ నదీమ్​ ఉపయోగించడంపై స్పందిస్తూ ‘‘మా అందరికీ వ్యక్తిగతంగా జావెలిన్‌లు ఉన్నాయి. అయితే, క్రీడాకారులందరూ తమ జావెలిన్లను ఒకే దగ్గర పెట్టాల్సి ఉంటుంది. అథ్లెట్లందరూ అందులో దేన్నైనా వినియోగించవచ్చు. ఇదొక రూల్​. నదీమ్ నా జావెలిన్ ఉపయోగించి ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాబట్టి, ఆయన జావెలిన్​ తీసుకోవడంలో తప్పేమీ లేదు.” అని పేర్కొన్నాడు. నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌ 2020లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్‌ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్‌ రెండో రౌండ్‌లో 87.58 మీటర్లు విసిరి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్‌ ముగింపు ఇచ్చాడు. పారిస్ ఒలింపిక్స్ లోనూ ఇదే ప్రదర్శనతో సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నాడు నీరజ్ చోప్రా.

First published:

Tags: Pakistan, Sports, Tokyo Olympics, Twitter

ఉత్తమ కథలు