హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : అథ్లెట్లు ఓకే.. కానీ వాళ్లను మాత్రం టోక్యో పంపకండి.. కరోనా నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు

Tokyo Olympics : అథ్లెట్లు ఓకే.. కానీ వాళ్లను మాత్రం టోక్యో పంపకండి.. కరోనా నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు

మ్యాచ్ అఫీషియల్స్‌ను భారీగా కుదించిన టోక్యో ఒలింపిక్ కమిటీ

మ్యాచ్ అఫీషియల్స్‌ను భారీగా కుదించిన టోక్యో ఒలింపిక్ కమిటీ

పలు దేశాల నుంచి వచ్చే అథ్లెట్ల సంఖ్యను తగ్గించడం కుదరదు కాబట్టి.. మ్యాచ్ అఫీషియల్స్ సంఖ్యను తగ్గించడానికి టోక్యో ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దాదాపు 60 శాతం మేర అఫీషియల్స్‌ను కుదిస్తే ఎంత మంది తగ్గిపోతారో తెలుసా?

కరోనా మహమ్మారి (Corona Pandemic)  నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) నిర్వాహకులు పలు ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే ఏడాది పాటు వాయిదా పడిన ఈ మెగా క్రీడలను ఈ సారి సజావుగా జరిపేందుకు అందుబాటులో ఉన్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ రెండో వేవ్ వేగంగా వ్యాపిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకుంటున్ారు. జపాన్‌లో కూడా కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని టోక్యో సహా పలు నగరాల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇక ఇలాంటి క్లిష్ట సమయంలో ఒలింపిక్స్ నిర్వహించవద్దని పలు వైపుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. గత ఆదివారం టోక్యోలోని నేషనల్ స్టేడియంలో ట్రయల్ రన్ జరిగే సమయంలో బయట ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. దీంతో ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా తప్పకుండా మెగా క్రీడలను నిర్వహించి తీరుతామని టోక్యో ఒలింపిక్స్ కమిటీతోపాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలు స్పష్టం చేశాయి. పలు దేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించాలని నిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకున్నది.

టోక్యో ఒలింపిక్స్‌కు వివిధ దేశాల నుంచి 15 వేల మంది అథ్లెట్లు వస్తున్నారు. వీరి సంఖ్యను కుదించడం కుదరదు. కానీ వీరి వెంట వచ్చే మ్యాచ్ అఫీషియల్స్ సంఖ్యను 60 శాతం మేరకు తగ్గించాలని టోక్యో ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. పలు దేశాల నుంచి దాదాపు 1,80,000 మంది మ్యాచ్ అఫీషియల్స్ టోక్యో ఒలింపిక్స్‌కు రానున్నారు. కాగా వీరి సంఖ్యను 80 వేలకు కుదించడానికి ఒలింపిక్ కమిటీ సిద్దమైంది. ఇప్పటికే పలు దేశాల ఒలింపిక్ కమిటీలు, క్రీడా సమాఖ్యలకు ఐవోసీ ఈ మేరకు సమాచారం అందించింది. సాధ్యమైనంత తక్కువ మంది మ్యాచ్ అఫీషియల్స్, కోచ్, సహాయక సిబ్బందిని టోక్యో పంపాలని కోరింది. అథ్లెట్ల వెంట ఎక్కువ మందిని తోడు పంపొద్దని.. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని ఐవోసీ కోరింది.


ఇక టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటికే విదేశీ ప్రేక్షకులు రావడాన్ని నిషేధించారు. గత ఏడాది మార్చి నాటికే దాదాపు 2 లక్షల మంది విదేశీయులు ఒలింపిక్ క్రీడలను వీక్షించడానికి టికెట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ విదేశీ ప్రేక్షకులందరికీ టికెట్ డబ్బులు వాపస్ చేస్తామని నిర్వాహక కమిటీ చెప్పింది. మరోవైపు స్వదేశీ ప్రేక్షకులను కూడా 50 శాతానికి పరిమితం చేస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి మరింతగా వ్యాపించి పరిస్థితులు ప్రమాదకరంగా మారితే అసలు ప్రేక్షకులను అనుమతించే వీలుండదని కమిటీ చెబుతున్నది. అవసరమైతే ఖాళీ స్టేడియంలలో క్రీడలు నిర్వహించే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది.

First published:

Tags: IOC, Olympics, Tokyo Olympics

ఉత్తమ కథలు