PV Sindhu : " ఏడాదిన్నరగా ఇంటికి దూరమయ్యాను.. త్వరలోనే బరిలోకి దిగుతా ".. మీడియాతో సింధు..

PV Sindhu

PV Sindhu : టోక్యో-2020 ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీ చేరుకున్న పీవీ సింధు అక్కడి నుంచి బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.

  • Share this:
    టోక్యో-2020 ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు(PV Sindhu) కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీ చేరుకున్న పీవీ సింధు అక్కడి నుంచి బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సింధుకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్‌, సైబరాబాద్‌ సీపీలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సింధు రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సింధూ.. ఏడాదిన్నరగా కుటుంబానికి దూరంగా వున్నానని ఆమె తెలిపారు.

    ఇది కూడా చదవండి : టీ-20 ప్రపంచకప్ లో దాయాదుల పోరుకు ముహుర్తం ఖరారు.. ఎప్పుడంటే..

    తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, త్యాగం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పీవీ సింధు పేర్కొన్నారు. అమ్మానాన్న ఇద్దరూ కూడా క్రీడాకారులు కావడం వల్ల తాను అదృష్టవంతురాలినని.. చిన్నప్పటి నుంచి నాన్న ఎన్నో సలహాలు ఇచ్చేవారని ఆమె వెల్లడించారు. వాళ్ల క్రీడా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నారు కాబట్టే.. ఆ విషయాలు తనకు చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చారని సింధు అన్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది క్రీడాకారులకు చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. త్వరలో పారిస్‌లో జరగబోయే టోర్నీలో పాల్గొంటానని సింధు వెల్లడించారు.

    టోక్యో ఒలింపిక్స్‌ 2020 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించింది. స్వర్ణ పతకం సాధిస్తుందని అందరూ భావించినా.. సెమీస్‌లో తై జూ చేతిలో ఓడిపోయింది. కానీ ఓటమి బాధను దిగమింగి ఆ తర్వాత రోజే కాంస్య పతకం సాధించింది.
    Published by:Sridhar Reddy
    First published: