టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో మెడల్ వచ్చింది. పురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో బజ్రంగ్ పునియా కాంస్య పతకం గెలిచాడు. కాంస్య పతకం కోసం జరిగిన కుస్తీ పోటీలో..కజక్‌స్థాన్ రెజ్లర్ దౌలత్ నియత్బెకోవ్ను 0-8 తేడాతో చిత్తుగా ఓడించాడు. ఈ బౌట్లో బజ్రంగ్ పునియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ప్రత్యర్థి ఏ మాత్రమూ అవకాశం ఇవ్వలేదు. మొదటి పీరియడ్‌లో 2 పాయింట్లు, రెండో పీరియడ్‌లో 6 పాయింట్లు సాధించాడు. కజక్‌స్థాన్ రెజ్లర్‌కు ఒక్క పాయింట్ కూడా రాకపోవడంతో వార్ వన్ సైడ్ అయింది. బజ్రంగ్ పునియా ఉడుం పట్టుతో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి మన దేశానికి మరో పతకాన్ని అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది ఆరవ పతకం. ఇప్పటి వరకు రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు వచ్చాయి. రెజ్లింగ్‌లో ఒక రజతం, ఒక కాంస్య పతకం వచ్చాయి.
బజ్‌రంగ్‌కు కాంస్య పతకం రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతంగా పోరాడావంటూ ప్రశంసలు కురిపించారు.
Delightful news from #Tokyo2020! Spectacularly fought Bajrang Punia. Congratulations to you for your accomplishment, which makes every Indian proud and happy: PM Narendra Modi pic.twitter.com/f0e4VmzI7i
— ANI (@ANI) August 7, 2021
వాస్తవానికి 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో బజ్రంగ్ స్వర్ణ పతకం గెలుస్తాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ విభాగంలో అతడే నెంబర్ వన్. కానీ
శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బజ్రంగ్ పునియా ఓడిపోయాడు. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న అజర్బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్ చేతిలో 5-12 తేడాతో ఓటమి పాలయ్యారు. ఐనప్పటికీ ప్లే ఆఫ్ బౌట్లో అద్భుతంగా రాణించి కాంస్య పతకాన్ని గెలిచాడు బజ్రంగ్ పునియా.
మహిళల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజతం గెలిచి టోక్యో ఒలింపిక్స్‌లో మొదటి పతకం అందించింది. రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా కూడా సిల్వర్ మెడల్ గెలిచాడు. ఇక బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో లవ్లీనా, పురుషుల హాకీ జట్టు, రెజ్లింగ్‌లో బజ్రంగ్ పునియా కాంస్య పతకాలను గెలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ భారత్ ఆరు పతకాలను సాధించడం విశేషం.
ఇవి కూడా చదవండి:
Tokyo Olympics : ప్చ్.. గోల్ఫ్ లో భారత్ కు నిరాశ.. తృటిలో పతకం కోల్పోయిన అదితి అశోక్..
Mirabai Chanu: మరోసారి భారతీయుల మనసు గెల్చిన మీరాబాయి.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo, Tokyo Olympics, Wrestling