హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : చంటి పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన ఒలింపిక్ ఛాంపియన్.. వైరల్ వీడియో..

Tokyo Olympics : చంటి పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన ఒలింపిక్ ఛాంపియన్.. వైరల్ వీడియో..

Tokyo Olympics : ఒలింపిక్స్ లో పతకం నెగ్గడం ప్రతి అథ్లెట్ కల. ఆ కల నెరవేరినప్పుడు ఆ అథ్లెట్ పడే ఆనందం అంతా ఇంతా కాదు. ఒక పతకం కొల్లగొడితేనే లోకాన్ని జయించినంత ఆనందపడతారు. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడు ప్రతి అథ్లెట్ ఆనందంకి లోనై.. కన్నీళ్లు కార్చడం మనం చూస్తూనే ఉంటాం.

ఇంకా చదవండి ...

  ఒలింపిక్స్ లో పతకం నెగ్గడం ప్రతి అథ్లెట్ కల. ఆ కల నెరవేరినప్పుడు ఆ అథ్లెట్ పడే ఆనందం అంతా ఇంతా కాదు. ఒక పతకం కొల్లగొడితేనే లోకాన్ని జయించినంత ఆనందపడతారు. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడు ప్రతి అథ్లెట్ ఆనందంకి లోనై.. కన్నీళ్లు కార్చడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి.. ఘటనే టోక్యో ఒలింపిక్స్ లో చోటు చేసుకుంది. కాలెబ్ డ్రెసెల్ ఒక ఛాంపియన్‌. స్విమ్మింగ్‌లో ఎన్నో రికార్డులు.. ఖాతాలో ఎన్నో పతకాలు. కానీ, ఒలింపిక్స్‌ మాత్రం అతనికి ఒక ఛాలెంజ్‌. అందుకే కసిగా ప్రాక్టీస్‌ చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ కొట్టాడు. ఆ ఆనందంలో కన్నీళ్లలో భావోద్వేగంగా ఈత కొట్టేశాడు. అమెరికన్‌ ఫ్రీ స్టైల్‌&బట్టర్‌ స్విమ్మర్‌ కాలెబ్ డ్రెసెల్. 24 ఏళ్ల ఈ ఛాంపియన్ ​ఈవెంట్స్‌లో స్పెషలిస్ట్‌. పురుషుల స్విమ్మింగ్‌లో సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికన్‌ కాలెబ్‌ డ్రెసెల్‌.. ఒలింపిక్స్ లో 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో గోల్డ్‌ కొట్టాడు. కేవలం 49.45 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలువడంతోపాటు.. కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో, 2019లో 49.50 సెకన్లతో ఇంతకు ముందు నెలకొల్పిన ప్రపంచ రికార్డును డ్రెసెల్‌ తిరగరాయడం విశేషం. అయితే ఇది కాలెబ్‌కు ఫస్ట్‌ స్వర్ణం(వ్యక్తిగత విభాగంలో) . అందుకే భావోద్వేగం తట్టుకోలేకపోయాడు. ఫ్లోరిడా నుంచి వీడియో ద్వారా తన కుటుంబం తన సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటుండగా చూసి ఆనందం పట్టలేక చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. వెక్కి వెక్కి ఏడ్చేసిన కాబెల్‌ వీడియో.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

  " గత ఏడాది చాలా కష్టంగా గడిచింది. చాలా సంతోషంగా ఉంది " అని మీడియాతో మాట్లాడాడు కూడా. ఇక రిలేలో అప్పటికే మూడు స్వర్ణాలు సాధించిన కాలెబ్‌.. బుధవారం ఈవెంట్‌ మెయిన్‌ కేటగిరీలో స్వర్ణం సాధించడం విశేషం. ఇక ఆదివారం నాటి ఈవెంట్స్‌తో కలిసి మొత్తం ఐదు స్వర్ణాలు సాధించి.. సింగిల్‌ ఒలింపిక్‌లో ఈ రికార్డు సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. 50 మీటర్ల ఫఫ్రీ స్టైల్‌లో 21.7 సెకన్ల రికార్డు టైంతో, అటుపై గంట తర్వాత జరిగిన 4x100 మెడ్లే రిలేలో లో నెగ్గి రెండు స్వర్ణాలు తన ఖాతాలో జమ చేసుకున్నాడు.

  ' isDesktop="true" id="977554" youtubeid="sXy_ooYJx6o" category="sports">

  మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ స్విమ్మింగ్ విభాగంలో ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఎమ్మా మెకియాన్ రికార్డు సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో ఏడు స్వర్ణ పతకాలు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్, మహిళల 4X100 ఫ్రీస్టైల్ రిలే, మహిళల 4X100 మెడ్లీ రిలే, మహిళల 50 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్‌లో ఎమ్మా మెకియాన్ స్వర్ణ పతకాలు సాధించింది. మిక్స్‌డ్ 4X100 మెడ్లీ రిలే, మహిళల 100 మీటర్ల బటర్ ఫ్లై, మహిళల 4X200 ఫ్రిస్టైల్ రిలేలో కాంస్య పతకాలు తన ఖాతాలో వేసుకుంది.

  First published:

  Tags: Sports, Tokyo Olympics

  ఉత్తమ కథలు