హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : భారత అథ్లెట్ల కోసం చీర్ ఫర్ ఇండియా సాంగ్..వింటే గూస్ బంప్సే..

Tokyo Olympics : భారత అథ్లెట్ల కోసం చీర్ ఫర్ ఇండియా సాంగ్..వింటే గూస్ బంప్సే..

టోక్యో ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్

Tokyo Olympics : ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలను అందుకుంటూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పిలుపునిచ్చారు. మీ వెనక దేశం మొత్తం అండగా ఉందని, క్రీడా వేదికపై భారత పతాకం రెపరెపలాడించాలని కోరారు.

టోక్యోకు వెళ్లనున్న భారత ఒలింపిక్‌ బృందం కోసం "చీర్‌ ఫర్‌ ఇండియా" అంటూ సాగే అఫిషియల్ సాంగ్ ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విడుదల చేశారు. అథ్లెట్లను ప్రోత్సహించేలా ఉన్న ఈ పాటను ‘చీర్‌4ఇండియా: హిందుస్థానీ వే’ పేరిట ఆయన ఆవిష్కరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, గాయని అనన్య బిర్లా ఈ పాటను రూపొందించారు. దేశ ప్రజలంతా ఈ పాటను తప్పకుండా విని, భారత అథ్లెట్లను ప్రోత్సహించాలని మంత్రి ఠాకూర్‌ కోరారు. ఈ పాటను రూపొందించిన ఏఆర్ రెహమాన్, సింగర్ అనన్యకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కరోనా ఎఫెక్ట్ తో భారత క్రీడాకారుల సన్నాహాలకు ఎదురైన ఇబ్బందులు, అధిగమించిన తీరు ప్రతిబింబించే విధంగా ఈ పాట ఉందని భారత ఒలింపిక్‌ సంఘం (IOA) చీఫ్‌ నరీందర్‌ బాత్రా చెప్పారు.ఇక, టోక్యో ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి మొత్తం 228 మంది బృందం వెళుతుంది. అందులో 119 మంది అథ్లెట్లు 85 విభాగాల్లో పోటీపడనున్నారు. 119 మంది అథ్లెట్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే భారత అథ్లెట్లతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత మంగళవారం సమావేశమైన విషయం తెలిసిందే. అథ్లెట్లలో స్ఫూర్తి నింపడం కోసం మోదీ వారితో మాట్లాడారు.

ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలను అందుకుంటూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పిలుపునిచ్చారు. మీ వెనక దేశం మొత్తం అండగా ఉందని, క్రీడా వేదికపై భారత పతాకం రెపరెపలాడించాలని కోరారు. జులై 23 నుంచి మెగా క్రీడలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.

మరోవైపు, ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యో లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మరోసారి, జపాన్ లో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయ్. దీంతో ఈ ప్రతిష్టాత్మక గేమ్స్ పై నీలినీడలు కమ్ముకున్నాయ్. మరోవైపు, జపాన్ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే.. ఈ గేమ్స్ నిర్వహించాలని పట్టుదలతో ఉంది. దీంతో, టోక్యో లో ఇప్పటికే ఎమర్జెన్సీ విధించింది.

First published:

Tags: A.R.Rahman, Sports, Team India, Tokyo Olympics

ఉత్తమ కథలు