హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో ఈ రోజు షెడ్యూల్ ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో ఈ రోజు షెడ్యూల్ ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

టోక్యో ఒలింపిక్స్ 2020లో నేటి షెడ్యూల్ (Olympics)

టోక్యో ఒలింపిక్స్ 2020లో నేటి షెడ్యూల్ (Olympics)

టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా సాదాసీగా జరపనున్నట్లు నిర్వాహక కమిటీ తెలిపింది. సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. దీంతో పాటు ఈ రోజు ఏయే క్రీడా విభాగాల్లో పోటీలు జరుగుతాయంటే..

టోక్యో ఒలింపిక్స్ 2020 (Tokyo Olympics 2020) అధికారికంగా ఈ రోజు ప్రారంభం కానున్నాయి. టోక్యో లోని నేషనల్ స్టేడియంలో (National Stadium) అతి కొద్ది మంది అతిథులు, అథ్లెట్ల మధ్య ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్నది. అయితే శుక్రవారం ఉదయం నుంచే క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఉదయం రోయింగ్ పోటీలు (Rowing Qualifications) సీ ఫారెస్ట్ వాటర్ వే‌లో ప్రారంభమయ్యాయి. ఇందులో క్వాలిఫికేషన్ రౌండ్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. మరోవైపు ఆర్చరీలో (Archery) మహిళల వ్యక్తిగత రికర్వ్ క్వాలిఫికేషన్ రౌండ్లు కూడా జరుగుతున్నాయి. భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి (Deepika Kumari) సగం సెట్లు ముగిసే సరికి నాలుగవ స్థానంలో ఉన్నది. ఈ క్వాలిఫికేషన్స్ అనంతరం పురుషుల రికర్వ్ జరుగనున్నది. యుమెనొషిమా పార్క్‌లోని ఆర్చరీ ఫీల్డ్‌లో ఈ క్రీడా ఈవెంట్ జరుగుతున్నది. ఈ రోజు కేవలం ఆర్చరీ, రోయింగ్ క్వాలిఫకేషన్లు మాత్రమే జరుగనున్నాయి.

ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, మంగోలియన్​ ప్రధాని ఓయున్-ఎర్డెనే, అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్​ పాల్గొననున్నారు. ఇండియా తరపున పతాకధారులుగా మేరీ కోమ్, మన్‌ప్రీత్ సింగ్ వ్యవహరించనున్నారు. క్వారంటైన్‌లో ఉన్న ఐవోఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఓపెనింగ్ సెరెమనీకి దూరమయ్యారు. ఓపెనింగ్ సెరెమనీలో 26 మంది భారతీయులు పాల్గొనడానికి అనుమతి లభించింది. 20 మంది అథ్లెట్లు ఆరుగురు మ్యాచ్ అధికారులు పాల్గొననున్నట్లు తెలుస్తున్నది. పీవీ సింధు పరేడ్‌లో పాల్గొనబోవడం లేదని భారత బృందం తెలిపింది. జపాన్ అక్షరమాల ప్రకారం భారత జట్టు 21వ సీరియల్ నెంబర్‌లో మార్చ్ పాస్ట్ చేయనున్నది. ఇండియా తరపున మేరీ కోమ్, మన్‌ప్రీత్ సింగ్, సతీశ్ కుమార్, ఆశిశ్ కుమార్, మనీశ్ కౌశిక్, అమిత్ పంగల్, పూజా రాణి, లవ్లీనా, సిమ్రాన్ జిత్ కౌర్, సాజన్ ప్రకాశ్, ప్రణతి నాయక్, భవానీ దేవి, నేత్ర కుమనన్, విష్ణ శరవణన్, వరుణ్ అశోక్, కేసీ గణపతి, శరత్ కమల్, జి. సతియన్, మనికా బాత్రా, సుతీర్థ ముఖర్జీ పరేడ్‌లో పాల్గొననున్నారు.


కరోనా నేపథ్యంలో అథ్లెట్లు కేవలం క్రీడా ఈవెంట్లు ఉన్నప్పుడు మాత్రమే తమ వేదికల వద్దకు వెళ్లడానికి అనుమతి ఇస్తున్నారు. మిగిలిన సమయంలో శిక్షణ శిబిరంలో లేదా ఒలింపిక్ విలేజ్‌లోని తమ గదుల్లో మాత్రమే ఉండాలి. అథ్లెట్లు తమకు కేటాయించిన సమయంలో డైనింగ్ హాల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా అథ్లెట్ల, సహాయక సిబ్బంది, మ్యాచ్ అఫీషియల్ కరోనా నిబంధనలు పాటించకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది.

First published:

Tags: Olympics, Tokyo, Tokyo Olympics

ఉత్తమ కథలు