హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : ఒలింపిక్స్ రెండో రోజు భారత మహిళా అథ్లెట్లదే హవా..రెండో రౌండ్ కు మనికా బాత్రా..

Tokyo Olympics : ఒలింపిక్స్ రెండో రోజు భారత మహిళా అథ్లెట్లదే హవా..రెండో రౌండ్ కు మనికా బాత్రా..

మనికా బాత్రా

మనికా బాత్రా

Tokyo Olympics : జపాన్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయ్. ఇక, వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను సాధించిన అద్భుత విజయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మహిళా అథ్లెట్లు పతకం వేటలో ముందుకు సాగుతోన్నారు.

ఇంకా చదవండి ...

జపాన్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయ్. ఇక, వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను సాధించిన అద్భుత విజయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మహిళా అథ్లెట్లు పతకం వేటలో ముందుకు సాగుతోన్నారు. తాజాగా టేబుల్ టెన్నిస్‌లో మనికా బాత్రా, సుతీర్థ ముఖర్జీ ముందంజ వేశారు. తమ ప్రత్యర్థులను వారు చిత్తు చేశారు. రెండో రౌండ్‌లో అడుగు పెట్టారు. టోక్యో ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ లో భారత క్రీడాకారిణి మనికా బాత్రా సింగిల్స్ తొలి రౌండ్ లో విజయం సాధించింది. మనికా బాత్రా బ్రిటన్ క్రీడాకారిణి టిన్-టిన్ హో లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. చివరికి మనికా బాత్రా 11-7, 11-6, 12-10, 11-9 తేడాతో టిన్-టిన్ హో ను ఓడించి మహిళా సింగిల్స్ లో మరో అడుగు ముందుకు వేసి రెండో రౌండ్ కు చేరుకుంది. మణికా రేపు 11:15 AM IST సమయంలో రౌండ్ 2 లో ఉక్రెయిన్ మార్గరైటా యొక్క పెసోట్స్ తో తలపడనుంది. అంతకుముందే- మిక్స్ డ్ డబుల్స్‌ టేబుల్ టెన్నిస్ విభాగంలో తమిళనాడుకు చెందిన ఆచంట శరత్ కమల్‌తో కలిసి మనికా పాల్గొంది. అది అచ్చి రాలేదు.

ఆచంట శరత్ కమల్-మణికా బాత్రా జోడీ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో మలి రౌండ్‌లో చేరుకోవడంలో విఫలమైంది. ఆ తరువాత కొద్దిసేపటి జరిగిన విమెన్స్ సింగిల్స్‌లో మణికా బాత్రా తనదైన శైలిలో విజృంభించి ఆడారు. విజయాన్ని సొంతం చేసుకున్నారు. మలి రౌండ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

మరో విమెన్స్ సింగిల్స్‌లో సుతీర్థ ముఖర్జీ ముందడుగు వేశారు. స్వీడన్‌కు చెందిన లిండా బెర్గ్‌స్ట్రోయెమ్‌ను ఆమె ఓడించారు. తన ఓపెనింగ్ మ్యాచ్‌లో సుతీర్థ.. 5-11, 11-9, 11-13, 9-11, 11-3, 11-9, 11-5 సెట్ల సుదీర్ఘ పోరాటంలో విజయం సాధించారు. తన ప్రస్థానంలో సుతీర్థ రెండు సెట్లను కోల్పోయినప్పటికీ.. వెనక్కి తగ్గలేదు. అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించారు. నాలుగు, అయిదు సెట్లను అలవోకగా గెలిచారు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ రెండు సెట్లలోనూ లిండా 3, 5 అయిదు పాయింట్లను మాత్రమే సాధించగలిగింది.అయితే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు మొదటి పతకాన్ని వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అందించింది మీరాబాయి చాను. సిల్వర్ పతకంతో సత్తా చాటింది.

First published:

Tags: Mirabai chanu, Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు