TOKYO OLYMPICS 2020 INDIA WINS AGAINST GERMANY IN HOCKEY AND GET BRONZE MEDAL SK
Olympics 2020: భారత్‌కు మరో మెడల్.. చరిత్ర సృష్టించిన హాకీ టీమ్.. జర్మనీపై అద్భుత విజయం
హాకీ జట్టు
41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్ర సృష్టించింది హాకీ టీమ్. సెమీస్‌లో ఓడిన హాకీ జట్టు.. కాంస్య కోసం జరిగిన పోరులో మాత్రం అదరొట్టింది. జర్మనీపై 4-5 తేడాతో విజయం సాధించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్ర సృష్టించింది హాకీ టీమ్. సెమీస్‌లో ఓడిన హాకీ జట్టు.. కాంస్య కోసం జరిగిన పోరులో మాత్రం అదరొట్టింది. జర్మనీపై 4-5 తేడాతో విజయం సాధించింది. మొదట జర్మనీ జట్టు దూకుడు ప్రదర్శిస్తూ.. భారత్‌పై ఆధిపత్యం సాధిస్తున్నట్లు కనిపించింది. తొలి గోల్ జర్మనీయే సాధించింది. ఆ తర్వాత భారత ఆటగాడు సమర్ జిత్ గోల్ కొట్టి సమం చేశాడు. అనంతరం జర్మనీ జట్టు వరుసగా రెండు గోల్స్ సాధించడంతో 3-1 తేడాతో ఇండియన్ టీమ్ వెనకబడిపోయింది. ఐతే ఆ తర్వాత మనోళ్లు చెలరేగిపోయారు. వరుసగా నాలుగు గోల్స్ కొట్టారు. హార్ధిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, సమర్ జిత్ సింగ్ గోల్ కొట్టడంతో 3-5 లీడింగ్‌లోకి వెళ్లిపోయింది భారత్. అనంతరం జర్మనీ మరో గోల్ కొట్టినా.. 4-5 తేడాతో ఇండియా గెలిచింది.
మొదటి క్వార్టర్ ముగిసే సరికి జర్మనీ 1-0 లీడింగ్‌లో ఉంది. రెండో క్వార్టర్లో భారత్ అద్భుతంగా పుంజుకుంది. జర్మనీ మరో 2 గోల్స్, భారత్ మూడు గోల్స్ సాధించడంతో 3-3తో స్కోర్లు సమయం అయ్యాయి. మూడో క్వార్టర్లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండు గోల్స్ సాధించి 3-5 లీడింగ్‌లోకి వెళ్లిపోయింది. ఐతే నాలుగో క్వార్టర్లో జర్మనీ ఒక గోల్ సాధించడంతో భారత్ లీడింగ్ కాస్త తగ్గింది. ఐనా 4-5 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సమర్ జిత్ రెండు గోల్స్ సాధించి భాారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
హాకీలో కాంస్య పతకం గెలవడంతో ఇప్పటి వరకు మన దేశానికి మొత్తం నాలుగు పతకాలు వచ్చాయి. ఇందులో ఒక రజతం మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. మొదట మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. ఆ తర్వాత తెలుగు తేజం పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం గెలిచి సత్తా చాటింది. వరుస ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించింది. బుధవారం 69 కేజీల మహిళ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అసోంకు చెందిన లవ్లీనా కాంస్యం గెలిచింది. ఇక ఇవాళ్టి హాకీ మ్యాచ్‌లో జర్మనీపై విజయం సాధించి కాంస్యం గెలిచింది భారత జట్టు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.