ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. ఈ ఒలింపిక్స్ కోసం ఇప్పటికే అథ్లెట్లందరూ టోక్యో గడ్డపై అడుగుపెట్టారు. ఇక, టోక్యో ఒలింపిక్స్ లో 8 క్రీడాంశాల్లో 119 మంది భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఫామ్, గత ప్రదర్శనల ప్రకారం..ఈ సారి మనోళ్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయ్. ఇక, టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగే భారత మహాసేన, షెడ్యూల్ వివరాలపై స్పెషల్ ఫోకస్..
ట్రాక్ అండ్ ఫీల్డ్ మొత్తం 26 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.
జావెలిన్ త్రో: నీరజ్ చోప్రా, శివపాల్ సింగ్
20 కి.మీ. నడక: కేటీ ఇర్ఫాన్ థోడి, సందీప్ కుమార్, రాహుల్ రోహిల్లా
50 కి.మీ. నడక: గుర్ప్రీత్ సింగ్
3000 మీ. స్టీపుల్‌ఛేజ్: అవినాశ్ సాబ్లే
లాంగ్‌జంప్: శ్రీశంకర్
షాట్‌పుట్: తజీందర్ పాల్ సింగ్ తూర్
400 మీటర్ల హర్డిల్స్: జాబిర్
4X400 మీటర్ల రిలే: అమోల్ జేకబ్, రాజీవ్ అరోకియా, మొహమ్మద్ అనస్, నాగనాథన్ పాండి, నోవా నిర్మల్ టామ్.
మహిళల 20 కి.మీ. నడక: భావన జట్, ప్రియాంక గోస్వామి
డిస్కస్ త్రో: కమల్‌ప్రీత్, సీమా పూనియా
100, 200 మీటర్లు: ద్యుతీచంద్
జావెలిన్ త్రో: అన్ను రాణి
మిక్స్డ్ 4X400 మీటర్ల రిలే: సార్థక్ బాంబ్రీ, అలెక్స్ ఆంటోనీ, రేవతి వీరణమి, సుభా వెంకటేశన్, ధనలక్ష్మి శేఖర్
షెడ్యూల్: జూలై 30 నుంచి ఆగస్టు 7
ఆర్చరీ : 4 గురు ప్లేయర్లు
పురుషుల రికర్వ్ టీమ్, వ్యక్తిగత విభాగం: తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్;
మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం: దీపిక కుమారి
షెడ్యూల్: జూలై 23 నుంచి 31వరకు పోటీలు జరగనున్నాయి. సమ్మర్ గేమ్స్‌లో భారత్ పోటీపడుతున్న ఫస్ట్ ఈవెంట్ ఇదే.
బ్యాడ్మింటన్ : 4 గురు అథ్లెట్స్
మహిళల సింగిల్స్: పీవీ సింధు
పురుషుల సింగిల్స్: సాయిప్రణీత్
పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి
షెడ్యూల్: జూలై 24 నుంచి ఆగస్టు 2
ఈక్వెస్ట్రియన్ : ఈ విభాగం నుంచి ఒకరు పోటీపడుతున్నారు.
పురుషుల వ్యక్తిగత ఈవెంటింగ్: ఫౌద్ మీర్జా
షెడ్యూల్: జూలై 30
ఫెన్సింగ్ : ఈ విభాగం నుంచి ఒకరు పోటీపడుతున్నారు.
మహిళల సాబ్రే ఈవెంట్: భవాని దేవి
షెడ్యూల్: జూలై 26
హాకీ : 38 మంది ఆటగాళ్లు
పురుషుల జట్టు (19): శ్రీజేష్ (గోల్‌కీపర్), మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, సురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, బీరేంద్ర లాక్రా, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, సుమిత్, షంషేర్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్. స్టాండ్‌బై: వరుణ్ కుమార్, సిమ్రన్‌జిత్ సింగ్, కృషన్ పాఠక్ (గోల్‌కీపర్).
మహిళల జట్టు (19): సవితా పూనియా (గోల్‌కీపర్), రాణి రాంపాల్ (కెపె్టన్), షర్మిలా దేవి, దీప్ గ్రేస్ ఎక్కా, వందన కటారియా, గుర్జిత్ కౌర్, నవ్‌జ్యోత్ కౌర్, నవ్‌నీత్ కౌర్, లాల్రెమ్సియామి, మోనిక, నేహా, నిషా, నిక్కీ ప్రధాన్, సుశీలా చాను, సవితా పూనియా, సలీమా టెటె. స్టాండ్‌బై: రీనా, నమితా టొప్పో, రజని (గోల్‌కీపర్).
షెడ్యూల్: జూలై 24 నుంచి ఆగస్టు 6
గోల్ఫ్ : ఈ విభాగంలో ముగ్గురు భారత ఆటగాళ్లు పోటి పుడుతున్నారు.
అనిర్బన్, అదితి అశోక్, ఉదయన్ మానె
షెడ్యూల్: జూలై 29 నుంచి ఆగస్టు 7
జిమ్నాస్టిక్స్ : జిమ్నాస్టిక్స్ నుంచి ఒకరు
మహిళల ఆర్టిస్టిక్: ప్రణతి నాయక్
షెడ్యూల్: జూలై 25 నుంచి ఆగస్టు 3
జూడో రోయింగ్ - ఇద్దరు
పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్: అర్జున్ లాల్, అరవింద్ సింగ్
షెడ్యూల్: జూలై 24
సెయిలింగ్ : ఈ విభాగంలో నలుగురు పోటీపడుతున్నారు.
మహిళల లేజర్ రేడియల్: నేత్ర కుమనన్
పురుషుల లేజర్ స్టాండర్డ్: విష్ణు శరవణన్
పురుషుల స్కీఫ్ 49 ఈఆర్: గణపతి, వరుణ్
షెడ్యూల్: జూలై 25 నుంచి 27
షూటింగ్ : 15 మంది ప్లేయర్లు..
మహిళల విభాగం : అంజుమ్ మౌద్గిల్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్), తేజస్విని (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), ఇలవేనిల్ (10 మీటర్ల ఎయిర్‌రైఫిల్, మిక్స్డ్ ఈవెంట్), అపూర్వీ చండేలా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మనూ భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్), యశస్విని(10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ ఈవెంట్), రాహీ సర్నోబత్ (25 మీటర్ల ఎయిర్ పిస్టల్)
పురుషుల విభాగం : దివ్యాంశ్, దీపక్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, మిక్స్డ్ ఈవెంట్), సంజీవ్ రాజ్‌పుత్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), సౌరభ్ చౌదరీ, అభిõÙక్ వర్మ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ ఈవెంట్), మేరాజ్ అహ్మద్ ఖాన్, అంగద్ (స్కీట్ ఈవెంట్)
షెడ్యూల్: జూలై 24 నుంచి ఆగస్టు 2
స్విమ్మింగ్ : ముగ్గురు
పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్: సజన్
పురుషుల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్: శ్రీహరి
మహిళల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్: మానా పటేల్
షెడ్యూల్: జూలై 25 నుంచి 30
టేబుల్ టెన్నిస్ : నలుగురు
పురుషుల సింగిల్స్: శరత్ కమల్, సత్యన్
మహిళల సింగిల్స్: మనిక బత్రా, సుతీర్థ
మిక్స్డ్ డబుల్స్: శరత్ కమల్-మనిక బత్రా
షెడ్యూల్: జూలై 24 నుంచి 27
టెన్నిస్ : ముగ్గురు
మహిళల డబుల్స్: సానియా, అంకిత రైనా
పురుషుల సింగిల్స్: సుమిత్ నగాల్
షెడ్యూల్: జూలై 24 నుంచి ఆగస్టు 1 వరకు
రెజ్లింగ్ : 7 గురు
పురుషుల విభాగం: రవి (57 కేజీలు), బజరంగ్ (65 కేజీలు), దీపక్ (86 కేజీలు).
మహిళల విభాగం: సీమా (50 కేజీలు), వినేశ్ (53 కేజీలు), అన్షు (57 కేజీలు), సోనమ్ (62 కేజీలు)
షెడ్యూల్: ఆగస్టు 3 నుంచి 7
వెయిట్‌లిఫ్టింగ్ (1)
మహిళల 48 కేజీల విభాగం: మీరాబాయి
షెడ్యూల్: జూలై 24
బాక్సింగ్ : 9 మంది
పురుషుల విభాగం: సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు), మనీశ్ కౌశిక్ (63 కేజీలు), అమిత్ పంఘాల్ (52 కేజీలు)
మహిళల విభాగం: మేరీకోమ్ (51 కేజీలు), సిమ్రన్‌జిత్ (60 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు).
షెడ్యూల్: జూలై 24 నుంచి ఆగస్టు 8
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mary Kom, Pv sindhu, Sports, Tokyo Olympics