Mirabai Chanu: నాకు సాయం చేసిన ట్రక్ డ్రైవర్లను కలవాలని ఉంది.. మనసులో మాట చెప్పిన మీరాబాయ్ చాను

తనకు లిఫ్ట్ ఇచ్చిన ట్రక్ డ్రైవర్ల కోసం వెతుకుతున్న మీరాబాయ్ చాను (Sai Media/ Olympics/Twitter)

చిన్నప్పుడు తాను ఇంఫాల్‌లోని ట్రైనింగ్ సెంటర్‌కు వెళ్లడానికి ఫ్రీగా తమ ట్రక్స్‌లో ఎక్కించుకొని లిఫ్ట్ ఇచ్చిన ట్రక్ డ్రైవర్లను కలవాలని మీరాబాయ్ చాను అనుకుంటుంది. వాళ్ల కోసం ఏదైనా చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది.

  • Share this:
    టోక్యో ఒలింపిక్స్‌లో (Tolyo Olympics) భారత్‌కు తొలి పతకాన్ని మణిపూర్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ (Weight Lifter) మీరాబాయ్ చాను (Mirabai Chanu) అందించింది. మహిళల 49 కేజీల విభాగంలో 202 కేజీలో ఎత్తి దేశానికి రజత పతకం అందించిన మీరాబాయ్ చానుపై అందరూ ప్రశంసలు కురిపించారు. చిన్నప్పటి నుంచి వెయిట్ లిఫ్టర్‌గా శిక్షణ తీసుకోవడానికి తాను ఎంత కష్టపడిందో చాను వివరించింది. తన ఇంటి దగ్గర నుంచి ఇంపాల్‌లోని శిక్షణ అకాడమీ దగ్గరకు ఎంతో కష్టపడి వెళ్లేది. నాంగ్‌పాక్ నుంచి ట్రైనింగ్ సెంటర్ వరకు ప్రతీ రోజు వెళ్లి రావడానికి ట్రక్ డ్రైవర్లను (Truck Drivers) లిఫ్ట్ అడిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. దయతలచి ఎవవరో ఒక ట్రక్ డ్రైవర్ తనకు లిఫ్ట్ ఇచ్చే వాడని చెప్పింది. అయితే ఆనాటి ట్రక్ డ్రైవర్ల సాయాన్ని మీరాబాయ్ చాను మరిచిపోలేదు. వాళ్లు కనడితే ఏదో ఒక సాయం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పింది. 'నాకు ప్రతీ నిత్యం లిఫ్ట్ ఇచ్చిన ట్రక్ డ్రైవర్లను కలవాలని ఉన్నది. వారి వద్ద ఆశీర్వాదాలు తీసుకోవాలని అనిపిస్తున్నది. ఎందుకంటే ఆనాడు వాళ్లే పెద్దమనసుతో లిఫ్ట్ ఇవ్వకపోతే ఎన్నో క్లాసులు డుమ్మా కొట్టాల్సి వచ్చేది. ఇసుకను తీసుకొని వెళ్లే ఆ డ్రైవర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ వాళ్లు కలిస్తే ఏదో ఒక సాయం చేయాలని ఉంది' అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

    చాను తల్లి షాయ్‌కోమ్ ఓంబికి వాళ్ల గ్రామంలో ఒక టీ స్టాల్ ఉండేది. ఈథమ్ మొరియంగ్‌పురేల్ ప్రాంతం నుంచి ట్రక్స్ నిత్యం తమ గ్రామం మీదుగా వెళ్తుండేవని.. ఆ సమయంలో తమ టీ స్టాల్ దగ్గర ఆగే వాళ్లని చాను చెప్పింది. ఆ సమయంలోనే వాళ్లను రిక్వెస్ట్ చేసి ఇంటి నుంచి ట్రైనింగ్ సెంటర్‌కు వెళ్లే దాన్ని అని చెప్పింది. ఆ ట్రక్ డ్రైవర్లు ఫ్రీగా తనను దింపడంతో రహదారి ఖర్చుల కోసం ఉంచుకున్న డబ్బులు సేవ్ అయ్యేవని.. వాటిని తాను మంచి డైట్ తీసుకోవడానికి ఉపయోగించుకున్నానని చాను చెప్పింది.

    చాను సోదరుడు సనతోంబ కూడా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 'మా తల్లి దండ్రులు మీరాబాయ్ చాను చార్జీల కోసం రూ. 10 నుంచి రూ. 20 వరకు ఇచ్చే వాళ్లు. మాది చాలా చిన్న గ్రామం కావడంతో అక్కడ ప్రతీ ఒక్కరికీ అందరూ తెలుసు. ఉదయాన్నే ట్రక్స్ మా గ్రామంలోని మార్కెట్ స్క్వేర్ నుంచి బయలుదేరేవి. అవి ట్రైనింగ్ సెంటర్ వైపే వెళ్తాయని మాకు తెలుసు కాబట్టి.. మేం చానును ఆ లారీల్లో పంపేవాళ్లం. ట్రక్ డ్రైవర్ల గురించి ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. అందరూ తమ బిడ్డలాగే ఆమెను అక్కడ దింపేసే వాళ్లు.' అని చెప్పుకొచ్చాడు.
    Published by:John Naveen Kora
    First published: