T20 World Cup Final: ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2021 ఫైనల్ ఘట్టానికి సమయం దగ్గర పడింది. గ్రూపు దశలో అదరగొట్టి ఫేవరెట్లుగా మారిన పాకిస్థాన్, ఇంగ్లండ్ లు అనహ్యంగా టైటిల్ కు రెండు అడుగు ల దూరంలో నిలిచిపోయాయి. అస్సలు ఎవరూ ఊహించని విధంగా న్యూజీలాండ్ (New Zealand) - ఆస్ట్రేలియా (Australia) జట్లు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టైటిల్ కోసం తలపడనున్నాయి. హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన పాకిస్తాన్, ఇంగ్లాండ్ సెమీస్‌లో వెనుదిరిగాయి. ఇక టీమ్ ఇండియా అయితే సూపర్ 12 స్టేజి కూడా దాటలేదు. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ దారుణంగా విఫలమయ్యింది. దీంతో ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ సాధించని కివీస్ - ఆసీస్ తమ తొలి టైటిల్ కోసం బరిలోకి దిగుతున్నాయి. సూపర్ స్టేజ్ దశలో సాదా సీదాగా ఆడిన ఈ రెండు జట్లు సెమీఫైనల్లో మాత్రం ప్రతాపం చూపించాయి. గ్రూప్ దశలో న్యూజీలాండ్ పాకిస్తాన్ మీద.. ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ మీద ఓడిపోయాయి. అయితే అనూహ్యంగా సెమీస్‌లో పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ను ఆస్ట్రేలియా ఓకే రీతిలో ఓడించాయి. రెండు సెమీఫైనల్స్ ఛేజింగ్ 19 ఓవర్లలోనే ముగియడం గమనార్హం.
టైటిల్ వేట కోసం న్యూజిలాండ్ , ఆసీస్ రెడీ అ య్యాయి. ఇరు జట్ల బలాలు చేస్తే కప్ కొట్టేంది ఎవరో ఊహించడం కష్టమే. అయితే ఆసీస్ తో ఫైనల్ మ్యాచ్ కు సై అంటున్న కివీస్ కీలక ప్లేయర్ దూరం కానున్నాడు. నవంబర్10న ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు కాన్వే. తొలి సెమీఫైనల్లో 46 పరుగులు చేసిన కాన్వే.. కీలక సమయంలో లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు.
అదే సమయంలో కొంత అసహనానికి గురై.. చేతితో బ్యాట్‌ను బలంగా గుద్దడంతో కుడి చేతి ఎముక విరిగింది. అలా గాయం కారణంగా స్టార్ బ్యాట్స్‌మన్ డెవన్ కాన్వే ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో టిమ్ సీఫెర్ట్‌ను ఎంపిక చేసినట్లు కివీస్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇరు జట్ల బలాబలాలు చూస్తే ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమే. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కానీ కొంత మంది ఆటగాళ్లు మాత్రం కీలకం కానున్నారు. న్యూజీలాండ్ జట్టును పరిశీలిస్తే ఆ జట్టు టాపార్డర్ చాలా బలంగా కనిపిస్తున్నది. గప్తిల్ సెమీస్‌లో నిరాశ పరిచినా.. ఈ టోర్నీలో అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక డారిల్ మిచెల్ సెమీఫైనల్ హీరోగా నిలిచాడు. క్లిష్ట సమయాల్లో సమయోచితంగా ఆడే సామర్థ్యం ఉన్నది. కేన్ విలియమ్సన్ తనదైన రోజున చెలరేగిపోతాడు. అయితే గాయం కారణంగా డెవాన్ కాన్వే జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. అతడి స్థానంలో వచ్చిన సీఫెర్ట్ ఏం చేస్తాడో చూడాలి..
ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఆర్డర్ న్యూజీలాండ్ కంటే చాలా బలంగా కనిపిస్తున్నది. ఓపెనర్ల నుంచి లోయర్ మిడిల్ వరకు అందరూ బ్యాటుతో సత్తా చాటే వారే. డేవిడ్ వార్నర్, ఫించ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, వేడ్‌ల రూపంలో చాలా లోతుగా బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నది. వీరిని పటాపంచలు చేయాలంటే కివీస్ బౌలర్లు కష్టపడక తప్పదు. ఫించ్, స్మిత్, మ్యాక్సీలు సెమీస్‌లో విఫలమయ్యారు. అయితే వార్నర్ మంచి ఫామ్‌లో ఉండటం ఆసీస్‌కు బాగా కలసి వస్తున్నది. ఫైనల్ ఒత్తిడిని తట్టుకొని మరింత ధాటిగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్ అనంతరం టీమిండియాతో జరగనున్న సిరీస్‌కు కూడా సీఫెర్ట్ అందుబాటులో ఉంటాడని పేర్కొంది. న్యూజిలాండ్ తరపున 36 టీ20ల్లో 703 పరుగులు చేశాడు. న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాల మధ్య వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.