Home /News /sports /

TNPL 2022 SAI KISHORE STUNS THE CRICKET WORLD BY STUNNING FIGURES 4 3 2 4 IN TNPL 2022 SJN

TNPL 2022 : టి20ల్లో సూపర్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన గుజరాత్ టైటాన్స్ బౌలర్.. 4 ఓవర్లు వేసి ఏకంగా..

PC : TWITTER

PC : TWITTER

TNPL 2022 : ఇండియాలో టి20 లీగ్ ల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విజయంవంతం కావడంతో.. ఇప్పుడు రాష్ట్రానికి ఒక లీగ్ పుట్టుకొస్తుంది. గత కొన్నేళ్లుగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) జరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
TNPL 2022 : ఇండియాలో టి20 లీగ్ ల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విజయంవంతం కావడంతో.. ఇప్పుడు రాష్ట్రానికి ఒక లీగ్ పుట్టుకొస్తుంది. గత కొన్నేళ్లుగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) జరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా తమిళనాడు ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. యువ ప్లేయర్లు పలు ఫ్రాంచైజీల తరఫున ఆడుతూ సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ పి.సాయి కిషోర్ (Sai Kishore) మెరిశాడు. . లీగ్‌లో భాగంగా ఐ డ్రీమ్‌ తిర్నూర్‌ తమిళన్స్‌, చేపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. చెపాక్ సూపర్ గిల్లీస్ తరఫున బరిలోకి దిగిన సాయి కిశోర్ కళ్లు చెదిరే బౌలింగ్ ఫిగర్స్ ను నమోదు చేశాడు.

ఇది కూడా చదవండి  : హార్దిక్ పాండ్యా రిటైర్మెంట్.! సంచలన కామెంట్స్ చేసిన దిగ్గజ కామెంటేటర్ 

నాలుగు ఓవర్లు వేసిన సాయి కిషోర్ ఏకంగా మూడు మెయిడీన్లను వేశాడు. అంతేకాకుండా 2 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఈ మ్యాచ్ లో సాయి కిషోర్ 4-3-2-4 ఫిగర్స్ ను నమోదు చేశాడు. ఫలితంగా ఐడ్రీమ్‌ తిర్పూర్‌పై చేపాక్‌ సూపర్‌ గల్లీస్‌ ఏకంగా 60 పరుగులతో ఘన విజయం సాధించింది. సాయి కిషోర్‌ ప్రదర్శనను మెచ్చుకుంటూ అభిమానులు కామెంట్స్‌ చేశారు. ’వరల్డ్‌ క్లాస్‌ బౌలింగ్‌ నమోదు చేశాడు.. ఇలాంటి క్రికెటర్‌ జట్టులో కచ్చితంగా ఉండాలి.. వారెవ్వా సాయికిషోర్‌.. ప్రతీ బౌలర్‌ కలలు గనే స్పెల్‌ వేశావు.. నీ బౌలింగ్‌కు ఫిదా‘ అంటూ పేర్కొన్నారు. ఐపీఎల్ 2022లో సాయి కిషోర్ గుజరాత్ టైటాన్స్ తరఫున పలు మ్యాచ్ లు ఆడాడు.



ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. శశిదేవ్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. సాయికిషోర్ (19), హరీష్ కుమార్ (16), రాధా రాధా కృష్ణన్ (24) ఫర్వాలేదనిపించడంతో చెపాక్ చెప్పుకోదగ్గ స్కోరును అందుకుంది. అనంతరం 133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన తిర్పూర్ తమిళన్స్ జట్టు 73 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ శ్రీకాంత్ అనిరుధ 25 పరుగులతో టాప్‌ స్కోరర్ గా నిలిచాడు. అతడు తప్ప మిగిలిన ప్లేయర్లందరూ విఫలం అయ్యారు. ఇక సాయి కిషోర్ 4 వికెట్లతో ప్రత్యర్థి నడ్డివిరిచాడు. అతడికి సందీప్ వారియర్ 3 వికెట్లు, ఆర్ అలెగ్జాండర్ 2 వికెట్లు, సోను యాదవ్ 1 వికెట్లతో సహకారం అందించారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, Chennai, India Vs Westindies, IPL, IPL 2022, Tamilnadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు