Home /News /sports /

TNPL 2022 CRICKET FANS SLAMS JAGADEESAN OBSCENE GESTURE AFTER BEING MANKADED IN TNPL CRICKET LEAGUE SJN

TNPLలో మన్కడింగ్.. అవుటయ్యాననే కోపంలో బ్యాటర్ అసభ్య ప్రవర్తన.. ఏం చేశాడంటే?

PC : TWITTER

PC : TWITTER

TNPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లా ప్రతి ఏటా జరుగుతూ వస్తోన్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2022 సీజన్ తో వచ్చేసింది. జూన్ 23న ఈ లీగ్ ఆరంభం కాగా.. తొలి మ్యాచ్ లో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌, నెలాయి రాయల్‌ కింగ్స్‌ జట్లు తలపడ్డాయి. ఇండియన్‌ సిమెంట్‌ కంపెనీ గ్రౌండ్‌లో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెపాక్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఇంకా చదవండి ...
TNPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లా ప్రతి ఏటా జరుగుతూ వస్తోన్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2022 సీజన్ తో వచ్చేసింది. జూన్ 23న ఈ లీగ్ ఆరంభం కాగా.. తొలి మ్యాచ్ లో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌, నెలాయి రాయల్‌ కింగ్స్‌ జట్లు తలపడ్డాయి. ఇండియన్‌ సిమెంట్‌ కంపెనీ గ్రౌండ్‌లో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెపాక్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్ కు వచ్చిన రాయల్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. అనంతరం చెపాక్ బ్యాటింగ్ కు దిగింది. చెపాక్ బ్యాటింగ్ చేసే సమయంలో వివాదం చోటు చేసుకుంది.

ఇది కూాడా చదవండి : క్యాచ్ లందు.. ఈ క్యాచ్ వేరయా.! విచిత్రంగా అవుటైన కివీస్ బ్యాటర్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

చెపాక్ తరఫున ఓపెనర్లుగా  జగదీశన్, కౌశిక్ గాంధీ బ్యాటింగ్ కు వచ్చారు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో.. చెపాక్ ఓవర్ కు పది పరుగుల చొప్పున రాబడుతూ లక్ష్యం వైపుకు సాగింది. ముఖ్యంగా జగదీశన్ 15 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. అయితే నాలుగో ఓవర్ వేయడానికి బాబా అప్రజిత్ బౌలింగ్ కు వచ్చాడు. మూడో బంతి వేయడానికంటే కూడా ముందే.. జగదీశన్ క్రీజును దాటి ముందుకు వెళ్లడంతో.. అప్రజిత్ మన్కడింగ్ విధానంలో జగదీశన్ ను అవుట్ చేశాడు. ఊహించని ఈ షాక్ కు తేరుకోలేకపోయిన జగదీశన్ ఆగ్రహానికి లోనయ్యాడు. పెవలియన్ కు చేరుకునే క్రమంలో.. ప్రత్యర్థి జట్టుకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ఇది కాస్తా.. కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే చెపాక్ టీం కూడా 20 ఓవర్లలో 7 వికెట్లకు సరిగ్గా 184 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్ లో రాయల్స్ జట్టు విజయం సాధించింది.



మన్కడింగ్ కరెక్ట్ పద్ధతేనా.?
క్రికెట్ చట్టాలను మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిర్ణయిస్తుందని మనందరికీ తెలిసిందే. 2022లో ఎంసీసీ క్రికెట్ లో కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. అందులో మన్కడింగ్ ఒకటి. క్రికెట్ లో మన్కడింగ్ ను చట్టబద్ధం చేస్తూ.. ఇకపై దీనిని రనౌట్ గా పరిగణిస్తున్నట్లు ఎంసీసీ నిర్ణయం తీసుకుంది. 2019 ఐపీఎల్ లో బట్లర్ ను అశ్విన్ మన్కడింగ్ చేయడంతో.. రచ్చ రచ్చ అయిన సంగతి తెలిసిందే. మన్కడింగ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధం అంటూ అప్పట్లో పలువురు క్రికెటర్లు తమ వాదనను వినిపించారు. అయితే 2022 నుంచి కూడా మన్కడింగ్ ను రనౌట్ గా ప్రకటిస్తూ అదేమీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదంటూ ఎంసీసీ తేల్చింది. బౌలర్ బంతిని వేయడాని కంటే కూడా ముందే నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ క్రీజును వదిలి ముందుకు వెళ్లడానికి అనుమతి లేదని ఎంసీసీ తేల్చింది. అలాంటి సమయంలో బౌలర్ కు రనౌట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా స్పష్టం చేసింది.


క్రికెట్‌ చట్టాలు చేసే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇది క్రికెట్‌లో రనౌట్‌! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్‌ కాదు. ఈ మేరకు ఎంసీసీ చేసిన పలు సవరణలను ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్‌ తర్వాతే అమల్లోకి రానున్నాయి.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cricket, Dinesh Karthik, Hardik Pandya, India vs england, Rishabh Pant, Rohit sharma, Tamil nadu, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు