హోమ్ /వార్తలు /క్రీడలు /

Tim Paine : ఆమెతో సెక్స్ చాటింగ్.. ఆస్ట్రేలియా కెప్టెన్సీకి టిమ్ పైన్ రాజీనామా ..

Tim Paine : ఆమెతో సెక్స్ చాటింగ్.. ఆస్ట్రేలియా కెప్టెన్సీకి టిమ్ పైన్ రాజీనామా ..

Tim Paine

Tim Paine

Tim Paine : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ (Australia Cricket) కు భారీ షాక్ తగిలింది. 'సెక్స్టింగ్' కుంభకోణంలో చిక్కుకున్న 36 ఏళ్ల టిమ్ పైన్ (Tim Paine) ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.

ఇంకా చదవండి ...

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ (Australia Cricket) కు భారీ షాక్ తగిలింది. 'సెక్స్టింగ్' కుంభకోణంలో చిక్కుకున్న 36 ఏళ్ల టిమ్ పైన్ (Tim Paine) ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. శుక్రవారం హోబర్ట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పైన్ తన పదవీవిరమణ నిర్ణయాన్ని ప్రకటించినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ తెలిపింది. అయితే, వికెట్ కీపర్ గా జట్టులో కొనసాగుతున్నట్లు పైన్ ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితం తన మహిళా సహోద్యోగికి అసభ్యకరమైన మెసేజ్ లు పంపడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ అసభ్యకర మెసేజ్ లు ఇప్పుడు బయటపడ్డాయ్. దీంతో టిమ్ పైన్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. "ఈరోజు, ఆస్ట్రేలియన్ పురుషుల టెస్టు జట్టు కెప్టెన్‌గా నేను వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ నాకు, నా కుటుంబానికి మరియు క్రికెట్‌కు సరైన నిర్ణయం" పైన్ తెలిపాడు.

" నాలుగేళ్ల క్రితం లేడి కోలిగ్ తో ప్రైవేట్ టెస్ట్ మెసేజ్ లు ఉన్నాయ్. అవి అభ్యతరకరంగా ఉన్నాయ్. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా విచారణ జరిపింది. నేను ఎటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల్ని అతిక్రమించలేదని తెలిపింది. నిర్దోషిగా ప్రకటించబడినప్పటికీ, నేను ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నేను భార్యతో ఈ విషయమై మట్లాడాను. అన్నీ ఆలోచించుకుని నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది " అని టిమ్ పైన్ చెప్పుకొచ్చాడు.

"అయితే, ఈ ప్రైవేట్ టెక్స్ట్ ఎక్స్ఛేంజ్ పబ్లిక్‌గా బయటపడింది. 2017లో నా చర్యలు ఆస్ట్రేలియన్ క్రికెట్ కి నష్టం కలిగించేలా ఉన్నాయ్. క్రికెట్ ప్రతిష్టకు భంగం కలిగించనందుకు క్షమాపణలు చెబుతున్నాను. నా భార్య, ఇతర కుటుంబ సభ్యులకు మనో వేదన కలిగించినందుకు బాధగా ఉంది. కెప్టెన్ గా తప్పుకోవడం సరియైన నిర్ణయంగానే భావిస్తున్నాను. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు ముందు ఇది ఎటువంటి నష్టం కలిగించదని భావిస్తున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఇలాంటి మేటి జట్టుకు నాయకత్వం వహించడం నా జీవితంలో మర్చిపోలేను. నా సహచరుల మద్దతుకు ధన్యావాదాలు తెలుపుతున్నాను "

" ఇక, నా ప్రవర్తనతో ఆస్ట్రేలియా అభిమానులకు, నా కుటుంబసభ్యలకు బాధ కలిగించనందుకు వారికి క్షమాపణలు చెబుతున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ గా వైదొలిగినా.. ఓ వికెట్ కీపర్ గా జట్టులో కొనసాగుతా.. ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాను " అని సుదీర్ఘంగా వ్యాఖ్యానించాడు టిమ్ పైన్.

2018 మార్చిలో ఆస్ట్రేలియా 46 వ కెప్టెన్ గా టిమ్ పైన్ సెలెక్ట్ అయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనలో స్మిత్, డేవిడ్ వార్నర్, కామోరున్ బాన్ క్రాఫ్ట్ ల బాల్ టాంపరింగ్ స్కాండిల్ తర్వాత టిమ్ పైన్ ను కెప్టెన్ గా నియమించింది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. ఇక, యాషెస్ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా ఇది పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. వైస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా జట్టుకు యాషెస్ సిరీస్ లో నాయకత్వం వహించనున్నాడు. దాదాపు 65 ఏళ్ల తర్వాత ఓ ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియా కు టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 2017 లో ఓ మహిళా ఉద్యోగికి అసభ్యకరమైన మెసేజ్ లు పంపినట్లు ఇటీవల ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు గుప్పుమన్నాయ్. దీంతో ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు టిమ్ పైన్.

ఇది కూడా చదవండి :  దీపక్ చాహర్ ఇచ్చిన లుక్కుకు.. రూ. 1 లక్ష! నిజమే.. ఎలాగో తెలుసుకోండి

సెక్స్టింగ్ అంటే ఏమిటి?

సెక్స్టింగ్ అంటే స్త్రీ, పురుషుడు వారికి సంబంధించిన నగ్న ఫొటోలు, వీడియోలు ఒకరికొకరు షేర్ చేసుకోవడం. శృంగారానికి సంబంధించిన సందేశాలు పంపుకోవడం కూడా సెక్స్టింగ్ కిందికి వస్తుంది.

First published:

Tags: Australia, Cricket, Pat cummins

ఉత్తమ కథలు