హోమ్ /వార్తలు /క్రీడలు /

Tilak Varma: ఫ్యూచర్ ఆఫ్ టీమిండియా... హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ...

Tilak Varma: ఫ్యూచర్ ఆఫ్ టీమిండియా... హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ...

X
తిలక్

తిలక్ వర్మ

Tilak Varma: సాధారణంగా ప్రతి క్రికెటర్ కు ఓ మేనరిజం ఉంటుంది. దానినే ఇప్పటి తరం యువత ఫాలో అవుతూ ఉంటారు. కానీ తిలక్ మాత్రం... అందరికంటే భిన్నంగా తనకంటూ ఓ మేనరిజం క్రియేట్ చేసుకున్నారు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రిపోర్టర్: బాలకృష్ణ

లొకేషన్: హైదరాబాద్

పేరుకే గల్లీ క్రికెటర్... కానీ స్టార్ క్రికెటర్ల ప్రశంసలు అందుకున్నాడు. రవీంద్ర జడేజా అంతటి ఆల్ రౌండర్ అయితే... ఏకంగా ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటూ కితాబిచ్చేశాడు. భారత క్రికెట్ భవిష్యత్తుతో సరదాగా కాసేపు అంటూ ఓ సెల్ఫీ కూడా దిగాడు. టాలెంట్ అనేది డబ్బుతోనో.. గొప్ప ఇంటి వారసుడు అయినా రాదు... అది ఏ రంగం అయినా సరే.. టాలెంట్ ఉంటే చాలు... స్టార్ డమ్ అదే వస్తుందని మరోసారి రుజువు చేశాడీ యువ క్రికెటర్.

తిలక్ వర్మ (Tilak Varma).... హైదరాబాదీ యంగ్ క్రికెటర్... ప్రస్తుతం ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్ అనే ట్యాగ్ లైన్ ను వర్మ సొంతం చేసుకున్నాడంటే... అతని ఆట తీరు ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఓ సాధారణ ఎలక్ట్రీషన్ కొడుకు... ఇప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకున్నాడంటే... ఆ ప్రయాణం ఎంత కఠినమైనదో తెలుసా... తిలక్ పడిన కష్టాలకు ప్రతిఫలమే... ఇప్పుడు అతనికి వచ్చిన గుర్తింపు అనే మాట సరిపోతుందేమో.

స్టార్ క్రికెటర్లను సైతం పక్కన పెట్టిన ఐపీఎల్ జట్లు (IPL 2023)... తిలక్ వర్మ కోసం కోట్లు వెచ్చించేందుకు కూడా రెడీ అయ్యాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. వర్మను ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా కోటీ 70 లక్షలకు సొంతం చేసుకుందంటే... అతని ఆట తీరుపై ముంబై మేనేజ్‌మెంట్‌కు ఎంత నమ్మకమో ఇట్టే అర్థం అవుతుంది. వాస్తవానికి ముంబై ఇండియన్స్ జట్టు గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. కానీ రోహిత్ శర్మ వంటి దిగ్గజ ప్లేయర్ ను సైతం పక్కన పెట్టిన తిలక్ వర్మ... ఏకంగా 131 స్ట్రయిక్ రేట్‌తో 397 రన్స్ చేసి ముంబై తరఫున సెకండ్ హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు.

ఆన్ లైన్ పేకాటలో రూ. 9 కోట్లు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్.. ఎవరంటే?

నిండా 20 ఏళ్లు కూడా లేని ఈ హైదరాబాదీ.. ఇప్పుడు సెన్షెషనల్ అయ్యారు. పువ్వు పుట్టగానే పరిమణిస్తుందనేలా చిన్నప్పుడే క్రికెటర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. లక్ష్యం చేరుకునేందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే తట్టుకుని నిలబడ్డాడు. వాస్తవానికి క్రికెట్ కిట్ కొనాలన్నా కూడా అప్పుచేయాల్సిన పరిస్థితి తిలక్ కుటుంబ ఆర్థిక పరిస్థితి. అక్కడ నుండి మొదలైన తిలక్ ప్రస్తానం... ఇప్పుడు స్టార్ క్రికెటర్లతో కలిసి క్రికెట్ ఆడే స్థాయికి ఎదిగాడు. హైదరాబాద్ గల్లీల్లో క్రికెట్ ప్రాక్టీస్ చేసిన తిలక్ పైన లెక్కలేనన్ని ఫిర్యాదులు. గల్లీలో ఏ ఇంటిలో చూసినా సరే... తిలక్ కొట్టిన బంతుల ఆనవాళ్లు లభిస్తాయి.

కొడుకు మాట కాదనలేని తిలక్ తండ్రి నాగరాజు... అప్పుచేసి మరీ క్రికెట్ అకాడమీలో చేర్చించాడు. చిన్న చిన్న కాంట్రాక్టుల ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా తిలక్ బంగారు భవిష్యత్తు కోసమే ఖర్చు చేశారు తల్లిదండ్రులు. చాలా వరకు తమ ఆర్థిక పరిస్థితిని తిలక్ కు తెలియకుండా జాగ్రత్త పడ్డారు కూడా. డబ్బు ఇబ్బందులు తిలక్ కు తెలిస్తే బాధపడతాడేమో అని భయపడ్డారు కూడా. తిలక్ వర్మలోని టాలెంట్ గుర్తించిన కోచ్ యాష్... తన ఇంట్లోనే ఆసరా కల్పించి ప్రత్యేక కోచింగ్ ఇప్పించారు. ఒకరకంగా తిలక్ వర్మ ఖర్చులన్నీ కూడా కోచ్ యాష్ భరించారు.

సాధారణంగా ప్రతి క్రికెటర్ కు ఓ మేనరిజం ఉంటుంది. దానినే ఇప్పటి తరం యువత ఫాలో అవుతూ ఉంటారు. కానీ తిలక్ మాత్రం... అందరికంటే భిన్నంగా తనకంటూ ఓ మేనరిజం క్రియేట్ చేసుకున్నారు. దాంతో... ఐపీఎల్ వేలంలో పెద్ద జట్టు తిలక్ వర్మ కోసం పోటీ పడ్డాయి. 2020 అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్ గా నిలిచింది. ఈ జట్టులో తిలక్ వర్మ కూడా ఉన్నాడు. ఇక విజయ్ హజారే రంజీ ట్రోఫీలో అయితే వర్మ పరుగుల వరద పాటించాడు. తొలి నుంచి సురేష్ రైనాను ఆరాధించిన తిలక్.. అతనిలా స్టార్ డమ్ తెచ్చుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నాడు.

 సీఎస్కేతో మ్యాచ్.. గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్.. ఆ ప్లేయర్ ఆడటం లేదు

తిలక్ కోసం పెద్ద జట్లు పోటీ పడ్డాయంటే... అందుకు ఏకైక కారణం అతని ఆటతీరు. చెన్నై, కోల్ కతా, ఢిల్లీ , హైదరాబాద్, ముంబై జట్లు తిలక్ కోసం వేలంలో పాల్గొన్నాయి. 20 లక్షల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన తిలక్ వర్మ... రికార్డు స్థాయిలో కోటీ 70 లక్షలు పలికాడంటే... దాని వెనుక అతని కృషి ఎంత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఓ సాధారణ ఎలక్ట్రీషన్ కొడుకుగా కెరీర్ ప్రారంభించిన తిలక్ వర్మ.. ఇప్పుడు స్టార్ క్రికెటర్ రేంజ్‌కు చేరుకున్నారు. ఏకంగా ఐపీఎల్ 2023 వేలంలో కోట్లు దక్కించుకున్న తిలక్ వర్మ రాబోయే రోజుల్లో టాప్ ప్లేస్ కు చేరుకోవాలని ఆశిద్దాం.

First published:

Tags: Hyderabad, IPL 2023, Local News, Tilak Varma

ఉత్తమ కథలు