భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. తన క్రికెట్ కెరీర్లో తన మూడు బెస్ట్ ఇన్నింగ్స్‌లు ఏంటో చెప్పాడు. మొదటిది 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసి జట్టును ఫైనల్ చేర్చడంతో మెుదటిది అయితే.. రెండొది అదే ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి కోకకోలా కప్‌ను టీమిండియాకు అందించడ మరుపురాని జ్ఞాపకం అన్నారు. 2003 ప్రపంచకప్‌లో శివరాత్రి రోజున పాకిస్తాన్‌పై 98 పరుగులు ఇన్నింగ్స్ ఎప్పటికి మరిచిపోలేని మూడో బెస్ట్ అని చెప్పారు . చిరకాల ప్రత్యర్థిపై శివరాత్రి రోజున ఆడిన ఆ ఇన్నింగ్స్ ఇప్పటికి నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుందన్నారు.
సచిన్ అంతర్జాతీయ కెరీర్లో వంద సెంచరీలు పాటు అన్ని ఫార్మాట్లు కలిపి 34వేలకు పైగా పరుగులు.. బ్యాటింగ్ విభాగంలో లెక్కలేనన్ని రికార్డులు.. ఈ దశాబ్దంలో అతను సాధించిన మైలురాళ్లను చేరుకోవడం ఇప్పటితరం ఆటగాళ్లకు కష్టమే.. ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి.. ఆ వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని. ఒకే ఆటగాడు లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించి వాటిలో మూడు బెస్ట్ ఇన్నింగ్స్‌లను ఎంపిక చేసుకోవాలంటే కొంచెం కష్టమే. కానీ సచిన్ మాత్రం ఏ మాత్రం సంకోచం లేకుండా తన మూడు బెస్ట్ ఇన్నింగ్స్‌లను ఎప్పటికి మరిచిపోనని.. వాటి హైలెట్స్‌ను ఇప్పుడు కూడా వీక్షిస్తానని తెలిపాడు. యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సచిన్ ఈ విషయాలను పంచుకున్నాడు.
Published by:Rekulapally Saichand
First published:December 11, 2020, 11:45 IST