Home /News /sports /

THOMAS AND UBER CUP 2022 INDIA MENS BADMINTON TEAM DEFEAT INDONESIA IN THOMAS CUP FINALS AND CLINCHED TITLE FOR THE FIRST TIME IN 73 YEARS OF TOURNEY HISTORY SJN

Thomas Cup : అద్భుతాన్ని ఆవిష్కరించిన భారత బ్యాడ్మింటన్ జట్టు.. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారి..

థామస్ కప్ ను నెగ్గిన భారత పురుషుల జట్టు (PC : KIREN RIJIJU)

థామస్ కప్ ను నెగ్గిన భారత పురుషుల జట్టు (PC : KIREN RIJIJU)

Thomas Cup : థామస్ కప్ లో భారత (India) బ్యాడ్మింటన్ జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. ఈ టోర్నీ ఆరంభమై 73 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అందని ద్రాక్షలానే ఉన్నా టైటిల్ ను తొలిసారి భారత పురుషుల జట్టు సొంతం చేసుకుంది.

Thomas Cup : థామస్ కప్ లో భారత (India) బ్యాడ్మింటన్ జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. ఈ టోర్నీ ఆరంభమై 73 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అందని ద్రాక్షలానే ఉన్నా టైటిల్ ను తొలిసారి భారత పురుషుల జట్టు సొంతం చేసుకుంది. బ్యాంకాక్ (bangkok) వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు జయకేతం ఎగరవేసింది. పురుషుల టీం విభాగంలో జరిగే థామస్ కప్ (Thomas Cup) లో లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, హెచ్ ఎస్ ప్రణయ్, ధ్రువ్ కపిల, అర్జున్ లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో భారత జట్టు 3-0తో డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేసియాపై ఘనవిజయం సాధించి తొలిసారి థామస్ కప్ ను సొంతం చేసుకుంది.

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇదో గొప్ప రోజనే చెప్పాలి. ఇప్పటి వరకు థామస్ కప్ లో విజేతగా నిలువని భారత జట్టు ఆదివారం అద్భుతం చేసి చూపించింది. బెస్ట్ ఆఫ్ ఫైఫ్ మ్యాచెస్ పద్ధతిన జరిగిన ఫైనల్లో.. 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాను భారత్ వరుస మ్యాచ్ ల్లో మట్టికరిపించింది. తొలుత జరిగిన సింగిల్స్ లో బరిలోకి దిగిన లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16తో ఆంథోనిపై పోరాడి గెలిచాడు. తొలి గేమ్ లో ఓడిపోయిన లక్ష్యసేన్.. ఆ తర్వాత వరుసగా రెండు గేముల్లోనూ నెగ్గి మ్యాచ్ నెగ్గాడు. ఫలితంగా భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం జరిగిన డబుల్స్ లో బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (భారత్) జంట 18-21, 23-21, 21-19తో మొహమ్మద్-కెవిన్ సంజయ ద్వయంపై గెలిచింది. దాంతో భారత జట్టు ఆధిక్యం 2-0కు చేరుకుంది.

ఇక మూడో మ్యాచ్ లో బరిలోకి దిగిన కిడాంబి శ్రీకాంత్ 21-15, 23-21తో జొనాథన్ క్రిస్టీ పై వరుస గేముల్లో నెగ్గి భారత్ కు థామస్ కప్ ను అందించాడు. మహిళల విభాగంలో జరిగే ఉబెర్ కప్ లో భారత మహిళల జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరలేకపోయింది. అయితే పురుషుల జట్టు మాత్రం అద్భుత ఆటతీరుతో చాంపియన్ గా నిలిచింది. భారత్ సాధించిన  ఈ విజయంపై మాజీ కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. థామస్ కప్ ను గెలిచిన భారత పురుషుల జట్టును ట్విట్టర్ వేదికగా అభినందించాడు.

శుక్రవారం 2016 చాంపియన్ డెన్మార్క్ తో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 3–2తో విజయం సాధించింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Badminton, IPL, IPL 2022, Pv sindhu

తదుపరి వార్తలు