హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli : ‘స్పోర్ట్స్ లో ఇదే బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ పిక్’ రోజర్, నడాల్ పై కోహ్లీ ట్వీట్

Virat Kohli : ‘స్పోర్ట్స్ లో ఇదే బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ పిక్’ రోజర్, నడాల్ పై కోహ్లీ ట్వీట్

PC : TWITTER

PC : TWITTER

Virat Kohli : రోజర్ ఫెడరర్ (Roger Federer), రాఫెల్ నడాల్ (Rafael Nadal) టెన్నిస్ చరిత్రలో వీరిద్దరూ లెజెండ్స్.. వీరి మధ్య జరిగిన ఫైనల్స్ టెన్నిస్ అభిమానులను కట్టి పడేశాయి. వీరు కోర్టులో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికి కూడా కోర్టు బయట మంచి మిత్రులు.. తాజాగా రోజర్ ఫెడరర్ తన కెరీర్ లో చివరి మ్యాచ్ ను ఆడేశాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Virat Kohli : రోజర్ ఫెడరర్ (Roger Federer), రాఫెల్ నడాల్ (Rafael Nadal) టెన్నిస్ చరిత్రలో వీరిద్దరూ లెజెండ్స్.. వీరి మధ్య జరిగిన ఫైనల్స్ టెన్నిస్ అభిమానులను కట్టి పడేశాయి. వీరు కోర్టులో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికి కూడా కోర్టు బయట మంచి మిత్రులు.. తాజాగా రోజర్ ఫెడరర్ తన కెరీర్ లో చివరి మ్యాచ్ ను ఆడేశాడు. రాడ్ లేవర్ కప్ (Rod Laver cup) 2022లో భాగంగా తన చిరకాల ప్రత్యర్థి, స్నేహితుడు నడాల్ తో కలిసి డబుల్స్ విభాగంలో తన చివరి మ్యాచ్ ను ఆడేశాడు. మ్యాచ్ అనంతరం ఫెడరర్ రిటైర్మెంట్ పై నడాల్ భావోద్వేగానికి గురయ్యాడు. తనలోని ఒక భాగం మిస్ అయినట్లు అనిపిస్తుందంటూ ఫెడరర్ కు ఘన వీడ్కోలు ఇచ్చాడు. వీరిద్దరూ ఒకే బల్లపై కూర్చొని ఏడుస్తూ ఉన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రత్యర్థులుగా ఉన్నా.. ఒకరు ఆట నుంచి రిటైర్ అవుతుంటే మరొకరు బాధపడటం క్రీడా చరిత్రలో ఇది వరకు చూడనిదని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తాజాగా విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. ‘  తన ప్రత్యర్థి రిటైర్ అవుతుంటే ఎవరైనా ఇలా ఉంటారని  (నడాల్ బాధపడటం) మనం కలలో కూడా ఊహించి ఉండం. స్పోర్ట్స్ లో నేను ఇప్పటి వరకు చూసిన అద్భుతమైన ఫోటో ఇది’ అంటూ కోహ్లీ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

1998 ఏళ్ల వయసులో ప్రొఫెషినల్ టెన్నిస్ కెరీర్ ను ఆరంభించిన ఫెడరర్.. తొలి గ్రాండ్ స్లామ్ ను 21 ఏళ్ల వయసులో 2003లో గెలుచుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన వింబుల్డన్ కోటాలో తన జెండా ఎగరవేశాడు. ఇక అక్కడి నుంచి ఫెడరర్ కెరీర్ దూసుకువెళ్లింది. అప్పటి వరకు నంబర్ వన్ గా ఉన్న పీట్ సంప్రాస్ ను వెనక్కి నెట్టి నయా నంబర్ వన్ గా అవతరించాడు. చూస్తుండగానే 14వ గ్రాండ్ స్లామ్ ను సాధించి.. పీట్ సంప్రాస్ అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేశాడు. కొంత విరామం తర్వాత 15వ టైటిల్ నెగ్గి పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన ప్లేయర్ గా అవతరించాడు. అంతేకాకుండా 2018 వింబుల్డన్ ను నెగ్గి 20వ టైటిల్ నెగ్గిన తొలి పురుషు ప్లేయర్ గా నిలిచాడు. ప్రస్తుతం పురుషుల విభాగంలో నాదల్ 22 టైటిల్స్ తో తొలి స్థానంలో ఉండగా.. నొవాక్ జొకోవిచ్ 21 టైటిల్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఫెడరర్ మూడో స్థానంలో ఉన్నాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: French open, India vs australia, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Serena Williams, Us open, Virat kohli, Wimbledon

ఉత్తమ కథలు