ఆ మ్యాచ్‌లో ఓటమికి కారణం బుమ్రా వేసిన నో బాలే


Updated: June 30, 2020, 11:13 AM IST
ఆ మ్యాచ్‌లో ఓటమికి కారణం బుమ్రా వేసిన నో బాలే
ఇంగ్లండ్ టూర్‌లో భువనేశ్వర్,బుమ్రాకు గాయాలు (Getty image)
  • Share this:
పాకిస్తాన్‌తో మూడేళ్ల క్రితం జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌‌కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు భువనేశ్వర్‌ కుమార్‌. జస్‌ప్రీత్‌ బుమ్రా వేసిన నో బాల్ కారణంగానే భారత్, పాక్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చిందన్నాడు. అతను చేసిన ఆ చిన్న పోరపాటు కారణంగా మ్యాచ్‌ స్వరూపమే మారిపోయిందన్నారు. ఆ నోబాల్ కారణంగా మ్యాచ్‌ మొత్తం వన్‌ సైడ్‌ వార్‌లా మారి పాక్‌కు అనుకూలంగా మారిందని వాఖ్యానించారు.

ఓ సారి ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. పాక్ బాట్స్ మెన్ ఫకార్‌ మ్యాచ్ ఆరంభంలో బుమ్రా బౌలింగ్‌‌లో ఇచ్చిన క్యాచ్‌ను ధోని అందుకున్నాడు. అయితే అది నో బాల్‌ కావడంతో ఎంఫైర్ నాట్ అవుట్‌గా ప్రకటించాడు. ఆ లైఫ్‌తో రెచ్చిపోయిన ఫకార్‌ 114 పరుగులు చేసి పాక్‌ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. ఈ మ్యాచ్‌లో పాక్ 338 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 158 పరుగులకే ఆలౌటై 180 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
First published: June 30, 2020, 11:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading