హోమ్ /వార్తలు /క్రీడలు /

Olympics : విశ్వ క్రీడలు ఒలంపిక్స్‌లో చోటు దక్కని పాపులర్ స్పోర్ట్స్ ఏమిటో తెలుసా? క్రికెట్ చివరి సారిగా ఎప్పుడు ఆడారు?

Olympics : విశ్వ క్రీడలు ఒలంపిక్స్‌లో చోటు దక్కని పాపులర్ స్పోర్ట్స్ ఏమిటో తెలుసా? క్రికెట్ చివరి సారిగా ఎప్పుడు ఆడారు?

విశ్వ క్రీడలు అంటే ప్రతీ ఆటగాడికా సంబరమే. ఆ మహాక్రీడోత్సవంలో పాల్గొనడమే పతకం గెలిచినంత ఆనందాన్ని ఇస్తుంది. ప్రపంచలోని అన్ని క్రీడలకు సంబంధించి పోటీలకు ఒలంపిక్స్ వేదికగా నిలుస్తున్నది. కానీ కొన్ని పాపులర్ ఆటలకు మాత్రం ఒలంపిక్స్‌లో చోటు లేకుండా పోయింది. గతంలో ఆడిన క్రీడలను కూడా తప్పించేశారు. ఆయా ఆటలు సుదీర్ఘంగా జరగడమో లేదా వాటి కోసం ప్రత్యేకమైన స్టేడియంలు నిర్మించాల్సి రావడం వల్ల కొన్నింటిని అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ దూరంగా పెట్టింది. అలాంటి క్రీడలేవో ఒకసారి పరిశీలిద్దాం.

1. క్రికెట్


ప్రపంచంలో ఫుట్‌బాల్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన టీమ్ స్పోర్ట్స్ క్రికెట్. ఐసీసీ 12 పూర్తి స్థాయ సభ్య దేశాలు, 60కి పైగా అసోసియేట్ సభ్య దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల నుంచి ఇతర క్రీడలకు సంబంధిచిన క్రీడాకారులు, అథ్లెట్లు పాల్గొంటున్నా.. క్రికెటర్లు మాత్రం ఒలంపిక్స్ ఆడలేకపోతున్నారు. 1896 ఆధునిక ఒలంపిక్ క్రీడలు ప్రారంభమయ్యాక.. 1900 పారీస్ ఒలంపిక్స్‌లో క్రికెట్ కూడా ఒక ఈవెంట్‌గా నిర్వహించారు. అయితే సుదీర్ఘంగా మ్యాచ్‌లు నిర్వహించాల్సి రావడం, అప్పట్లో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఒలంపిక్స్ నుంచి తప్పించారు. 2032లో బ్రిస్బేన్ ఒలంపిక్స్ బిడ్ గెలుచుకుంటే క్రికెట్ తిరిగి టీ20 ఫార్మాట్ రూపంలో ఒలంపిక్స్‌లో చేర్చే అవకాశం ఉన్నది.

2. పోలో


ధనవంతుల క్రీడగా పేరున్న పోలో ఒకప్పుడు ఒలంపిక్స్‌లో ఈవెంట్‌గా ఉండేది. కానీ ఈ క్రీడపై పాశ్చత్య దేశాల్లో తప్ప మూడోప్రపంచ దేశాల్లో పెద్దగా ఆదరణ లేదు. అంతే కాకుండా ఆ క్రీడల కోసం గుర్రాలను వాడటంపై కూడా పెద్ద ఎద్దున ఆందోళనలు జరిగాయి. దీంతో 1936 నుంచి ఈ క్రీడలను ఒలంపిక్స్‌లో తప్పించారు. రాబోయే రోజుల్లో కూడా పోలోను ఒలంపిక్స్‌లో చేర్చే అవకాశాలు పెద్దగా లేవు.

3. డార్ట్స్


బార్లు, క్లబ్స్‌లో ఎక్కువగా ఈ డార్ట్స్ గేమ్ ఆడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా డార్ట్స్ గేమ్‌కు అసోసియేషన్లు, ఫెడరేషన్లు కూడా ఉన్నాయి. చాలా సార్లు ఆయా ఫెడరేషన్లు డార్ట్స్‌ను ఒలంపిక్స్‌లో చేర్చాలంటూ ఐవోసీపై ఒత్తిడి కూడా తెచ్చాయి. ఇటీవల ప్రొఫెషనల్‌గా డార్ట్స్ గేమ్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో 2024 ఒలంపిక్స్‌లో ఈ గేమ్‌ను చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒలంపిక్ కమిటీ ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది.

4. స్క్వాష్


ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది సరదాగా స్క్వాష్ ఆడుతున్నారు. వీరిలో వేలాది మంది ప్రొఫెషనల్ స్క్వాష్ ప్లేయర్లు ఉన్నారు. మన దేశంలో స్క్వాష్‌ను కెరీర్ గా మలుచుకున్న ప్రొఫెషనల్స్ ఎంతో మంది ఉన్నారు. దీపికా పల్లికల్, జ్యోత్స్న చిన్నప్ప, సౌరవ్ కౌషల్ వంటి పాపులర్ ప్లేయర్లు ఉన్నారు. కానీ ఇంత వరకు ఇది ఒక ఒలంపిక్ ఈవెంట్ కాలేకపోయింది. గతంలో స్క్వాష్‌ను ఒలంపిక్స్‌లో చేర్చడానికి బిడ్ వేసినా.. అది కాస్తా రెజ్లింగ్‌కు వెళ్లిపోయింది. 2024లో ఈ క్రీడను చేర్చడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

5. బౌలింగ్


షాపింగ్ మాల్స్‌లో ఎక్కువగా బౌలింగ్ ఎరేనాలు కనపడుతుంటాయి. పాశ్చాత్య దేశాల్లో బౌలింగ్ కోసం ప్రత్యేకమైన క్లబ్స్ ఉన్నాయి. పూర్వ కాలంలో ఈజిప్టులో ఈ క్రీడను ఎక్కువగా ఆడేవారు. సియోల్‌లో జరిగిన సమ్మర్ ఒలంపిక్స్‌లో బౌలింగ్‌ను తాత్కాలికంగా ప్రవేశ పెట్టారు. కానీ కేవలం 20 దేశాలకు చెందిన క్రీడాకారులే ఆడటంతో ఆ తర్వాత బౌలింగ్‌ను విశ్వక్రీడల జాబితా నుంచి తొలగించారు.

First published:

Tags: Cricket, Olympics, Tokyo Olympics

ఉత్తమ కథలు