హోమ్ /వార్తలు /క్రీడలు /

Olympics: ఒలింపిక్స్‌లో వారిద్దరే రెండు పతకాలు సాధించారు.. కానీ ఒకరు పాతాళంలో.. మరొకరు శిఖరంపై

Olympics: ఒలింపిక్స్‌లో వారిద్దరే రెండు పతకాలు సాధించారు.. కానీ ఒకరు పాతాళంలో.. మరొకరు శిఖరంపై

ఇద్దరు అథ్లెట్లలో ఎంత తేడా.. చర్చనీయాంశంగా సింధు, సుశీల్ ఘనతలు

ఇద్దరు అథ్లెట్లలో ఎంత తేడా.. చర్చనీయాంశంగా సింధు, సుశీల్ ఘనతలు

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ఇద్దరు భారత అథ్లెట్ల జీవితాల్లో ఎంత తేడా ఉన్నదో చూడండి. ఒకరు జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే.. మరొకరు దేశ ప్రజల మన్ననలను అందుకుంటున్నారు.

  భారత ఒలింపిక్ చరిత్రలో (Olympics) వరుసగా రెండు సార్లు పతకం సాధించింది... వ్యక్తిగత ఖాతాలో రెండు సార్లు పతకాలు తమ ఖాతాలో వేసుకున్న అథ్లెట్లు ఇద్దరు మాత్రమే. కానీ వారిద్దరి జీవితాలు నేడు భిన్న పార్శాల్లో కనిపిస్తున్నాయి. ఒకరు అథఃపాతాళంలో కూరుకొని పోతే.. మరొకరు శిఖరంపై నిలబడ్డారు. వాళ్లు భారత క్రీడాకారులు సుశీల్ కుమార్ (susheel Kumar) మరియు పీవీ సింధు (PV Sindhu). 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన రెజ్లర్ సుశీల్ కుమార్ దేశంలోని యువ క్రీడాకారులకు స్పూర్తిగా నిలిచాడు. ఎంతో మంది భావి రెజ్లర్లకు స్పూర్తిగా నిలిచాడు. సుశీల్ కుమార్‌కు ఒక్కసారిగా వచ్చిపడిన స్టార్‌డమ్ అతడికి ఊపిరి ఆడనివ్వలేదు. రెజ్లింగ్ కెరీర్‌ను చక్కగా తీర్చిదిద్దుకోవల్సిన వ్యక్తి పక్కదారి పట్టాడు. చెడు వ్యసనాలకు బానిసై.. చెడు సావాసాల కారణంగా డ్రగ్స్‌కు కూడా అలవాటు పడ్డాడు. అనేక అక్రమ వ్యాపారాలు చేస్తూ డబ్బు వ్యామోహంలో మునిగిపోయాడు. చివరకు తనను స్పూర్తిగా తీసుకొని రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టిన తన శిష్యుడి హత్య కేసులో నిందితుడిగా జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. నిన్న మొన్నటి వరకు చత్రాసాల్ స్టేడియంలో ఎంతో మందికి రెజ్లింగ్‌లో శిక్షణ ఇచ్చిన అతడిని.. ఇప్పుడు పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. కనీసం అతడి గురించి మంచిగా మాట్లాడుకునే వాళ్లు కూడా లేకుండా పోయారు.

  ఇక తాజాగా రెండు పతకాలు సాధించిన పీవీ సింధును అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకంతో దేశ కీర్తి ప్రతిష్టలను చాటిన పీవీ సింధు అక్కడితో ఆగిపోలేదు. ప్రతీ టోర్నీ కోసం కష్టపడుతూ విజయం కోసం తపించింది. రియో తర్వాత ప్రపంచ చాంపియన్ షిప్స్ గెలిచింది. అంతే కాకుండా టోక్యో ఒలింపిక్స్ కోసం నిరంతరం శ్రమించింది. కరోనా కష్ట కాలంలో కూడా తన ప్రాక్టీస్ ఆపకుండా లండన్ వెళ్లి అక్కడ సాదన చేసింది. ప్రతీ విజయం తర్వాత మరింతగా కష్టపడింది. రియో ఒలింపిక్స్ రజతంతోనే ఆగిపోకుండా.. టోక్యో కోసం మరింత సాధన చేసింది. స్వర్ణం తేవాలని కలలు కన్నా.. కాంస్యంతో సరిపెట్టుకున్నది. కానీ రాబోయే పారీస్ ఒలింపిక్స్ కోసం మరింతగా శ్రమిస్తానని చెబుతున్నది. అప్పుడు కూడా దేశానికి బ్యాడ్మింటన్‌లో ప్రాతినిథ్యం వహిస్తానని అంటున్నది.

  ఇద్దరు క్రీడాకారులు ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన వాళ్లే. ఒకరు ముందే పతకాలు సాధించి రికార్డు సృష్టిస్తే.. ఆ రికార్డును సమం చేసిన అథ్లెట్ మరొకరు. సింధు కాంస్య పతకం గెలిచిన రోజు సుశీల్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చార్జి షీటులోకి ఎక్కడం చూస్తే.. ఇద్దరి జీవితాల్లో ఎంత వ్యత్యాసం ఉందో కనిపిస్తున్నది. అందుకే విజయంతో తలకు గర్వం ఎక్కింతే అది మనలను పాతాళంలోకి నెట్టేస్తుంది.

  Published by:John Kora
  First published:

  Tags: Olympics, Pv sindhu, Susheel kumar, Tokyo Olympics

  ఉత్తమ కథలు