Virat Kohli : కోహ్లీ జీవితంలోని ఈ సీక్రెట్స్ తెలుసా? కోహ్లీ నకిలీ పేరు ఏంటో చెప్పిన అనుష్క శర్మ..!

విరాట్ కోహ్లీ లైఫ్‌లోని ఈ సీక్రెట్ మీకు తెలుసా?

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జీవితంలో జరిగిన కొన్ని సీక్రెట్ బయటపెట్టింది అనుష్క శర్మ. అవి ఇంత వరకు ఎవరికీ తెలియనివే.. అతడు నకిలీ పేరు కూడా ఉపయోగించాడని అనుష్క చెప్పుకొచ్చింది.

  • Share this:
    టీమ్ ఇండియా (Team India) కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ఉంటాడో తెలిసిందే. అవసరం అయితే ప్రత్యర్థి జట్టును మాటలతో కంగారు పెట్టిస్తుంటాడు. ఒకప్పుడు మైదానం బయట కూడా చాలా దూకుడుగా ఉండేవాడు. ఎవరినీ లెక్క చేయకుండా చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడు. చివరకు జర్నలిస్టుల మీద కూడా దాడికి దిగిన సందర్భాలు ఉన్నాయి. 2015 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగింది. పెర్త్‌లో ఒక ట్రైనింగ్ సెషన్ ముగించుకొని తిరిగి హోటల్ రూమ్‌కి వెళ్తుండగా కోహ్లీకి ఒక జర్నలిస్ట్ (Journalist)కనపడ్డాడు. వెంటనే అతడిని పట్టుకొని తీవ్ర పదజాలంతో (Abusive Language) తిట్టడం మొదలు పెట్టాడు. ఆ జర్నలిస్టుకు అసలు కోహ్లీ ఎందుకు తిడుతున్నాడో కూడా అర్థం కాలేదు. ఇది ఆ సమయంలో పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత విషయం కోహ్లీ ఎందుకు తిట్టాడో అనే విషయం అర్థమైంది. అనుష్క శర్మను టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శనాత్మక కథనం ఒకటి ఆస్ట్రేలియా పత్రికలో ప్రచురించారు. ఆ కథనం రాసిన జర్నలిస్టు అతడే అనుకొని కోహ్లీ విరుచుకొని పడ్డాడు. అయితే తర్వాత ఆ కథనంతో తాను తిట్టిన జర్నలిస్టుకు సంబంధం లేని తేలింది. విషయం తెలుసుకున్న కోహ్లీ సదరు జర్నలిస్టుకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దు మణిగింది. అయితే 2015 వరల్డ్ కప్ సమయంలో ఈ విషయంపై పెద్ద దుమారమే చెలరేగింది. అప్పటికి కోహ్లీ టీమ్ ఇండియాకు కెప్టెన్ కాలేదు.

    విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చాలా కాలం ప్రేమలో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే కోహ్లీకి అనుష్క కంటే ముందే మరో ఇద్దరితో రిలేషన్ ఉన్నట్లు మీడియాలో పలు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ నటి తమన్నా భాటియాతో విరాట్ కోహ్లీ ప్రేమలో ఉన్నట్లు ఆ మధ్య వార్తలు హల్ చల్ చేశాయి. వీరిద్దరూ కలసి కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టిందని రూమర్లు వచ్చాయి. కానీ ఈ వార్తలను ఇద్దరూ ఖండించారు. అయితే బ్రెజీలియన్ మోడల్ ఇజబెల్లేతో మాత్రం విరాట్ కొన్నాళ్లు ప్రేమాయణం నడిపాడు. ఒక పార్టీలో కలుసుకున్న వీరిద్దరూ కొన్నాళ్లు డేటింగ్ చేశారు. అంతే కాకుండా కోహ్లీ ఒక కాగితంపై స్పానిష్‌లో 'టి యామో' అని రాసి ఇచ్చాడు. దానికి ఐ లవ్ యూ అని అర్థం. అయితే వీరి ప్రేమాయణం ఎంతో కాలం సాగలేదు.

    అనుష్క, విరాట్ 2017 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. ఎవరికీ చెప్పకుండా సడన్‌గా ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వారి ప్రేమను ఎంత సీక్రెట్‌గా నడిపించారో.. అంతే సీక్రెట్‌గా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటలీలో జరిగిన పెళ్లికి కేవలం 42 మందిని మాత్రమే ఆహ్వానించారు. వారి పెళ్లి గురించి బయట తెలియకూడదని ఫేక్ పేర్లతో హోటల్ బుకింగ్, కేటరింగ్ వారితో మాట్లాడటం వంటివి చేశారట. టీమ్ ఇండియా క్రికెటర్లు, బంధువులు, స్నేహితులను కూడా పెళ్లికి ఆహ్వానించలేదు. అయితే ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత మాత్రం ఢిల్లీ, ముంబైలో రెండు భారీ రిసెప్షన్లు ఏర్పాటు చేశారు. కాగా, తమ సీక్రెట్ పేర్లను గురించి అనుష్క వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అప్పట్లో కోహ్లీ రాహుల్ అనే పేరుతో ఇటలీలో రూమ్స్ బుక్ చేశాడట. ఇండియాలో జరిగిన రిసెప్షన్ సమయంలో కేటరింగ్ వారితో మాట్లాడేటప్పుడు కూడా రాహుల్ పేరుతోనే వ్యవహరించాడు.
    Published by:John Naveen Kora
    First published: