ఆ మ్యాచ్ గెలిచి 18 ఏళ్ళు.. చోక్కా విప్పి బదులు తీర్చుకున్న దాదా

నాట్‌వెస్ట్‌ ట్రోఫీ. అది గెలిచి నేటికి సరిగ్గా 18 ఏళ్లు అవుతుంది. పోరాడాలనే తపన.. బదులు తీర్చుకోవాలనే కసితో ఆడి అనుకున్నది సాధించింది ఇండియా. 146 పరుగులకు 5 వికెట్లు కొల్పోయి పీకల్లోతు కష్టాలలో పడిన భారత్‌ను యువరాజ్,కైఫ్ 121 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌ను గెలిపించారు.

Rekulapally Saichand
Updated: July 14, 2020, 1:40 PM IST
ఆ మ్యాచ్ గెలిచి 18 ఏళ్ళు.. చోక్కా విప్పి బదులు తీర్చుకున్న దాదా
గంగూలీ(File)
  • Share this:
ఆ మ్యాచ్ గెలిచి నేటికి 18 ఏళ్ళైంది. భారత్ ఎన్ని మ్యాచ్‌లు గెలిచినప్పటికి అభిమానులకు మాత్రం ఆ సిరీస్ ప్రత్యేకం. ప్రత్యర్థి ఇచ్చిన 326 పరుగుల టార్గెట్‌ను ఛేదించడానికి బరిలో దిగిన భారత్ తడబడింది. 24 ఓవర్లకే 146/5 వికెట్లు నష్టపపోయి కష్టాల్లో పడింది. అప్పటికే వరుసగా తొమ్మిది ఫైనళ్లలో ఓడింది. ఇది కూడా దాని ఖాతలోనే పడుతోంది అనుకున్నారు అందరూ. కానీ సీన్ రివర్స్ అయింది. ఇద్దరు యువ ఆటగాళ్ళ శక్తి మించి పోరాడారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.

ఊబిలో కురుకుపోయిన జట్టును పట్టుకొని పైకి లాగారు. 18 ఓవర్లకు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు. జట్టు గెలిచిందన్న గర్వంతో జట్టు సారథి చొక్కా విప్పి చేసిన హాంగమా ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన విజయోత్సవ వేడుకగా నిలిచింది. ఆ మ్యాచేంటో.. అది ఎక్కడ జరిగిందో గుర్తుందా?

అదే నాట్‌వెస్ట్‌ ట్రోఫీ. అది గెలిచి నేటికి సరిగ్గా 18 ఏళ్లు అవుతుంది. పోరాడాలనే తపన.. బదులు తీర్చుకోవాలనే కసితో ఆడి అనుకున్నది సాధించింది ఇండియా. 146 పరుగులకు 5 వికెట్లు కొల్పోయి పీకల్లోతు కష్టాలలో పడిన భారత్‌ను యువరాజ్,కైఫ్ 121 పరుగుల భాగస్వామ్యంతోభారత్‌ను గెలిపించారు. దీంతో గెలిచామన్నా సంతోషంతో లాడ్స్‌లో కూర్చొన్న గంగూలీ చోక్కా విప్పి గిరగిర తిప్పుతూ విజయదరహాసంతో ఉప్పోంగిపోయారు.
Published by: Rekulapally Saichand
First published: July 14, 2020, 1:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading