THERE ARE NO SERVANTS AT VIRAT KOHLIS HOME FORMER CRICKETER SARANDEEP SINGH TALKED ABOUT THE INDIAN SKIPPERS DIFFERENT CHARACTER OFF THE FIELD SRD
Virat Kohli : కోహ్లీ ఇంట్లో పని వాళ్లుండరు...విరాట్ ప్రవర్తనపై మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు
విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ
Virat Kohli : విరాట్ కోహ్లీ..క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. ఇక మైదానంలో కోహ్లీ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ దూకుడు చూసిన చాలా మంది.. విరాట్ కు కోపం ఎక్కువ అని..ఎవరి మాట వినని వ్యక్తిగా అంచనా వేస్తుంటారు.
విరాట్ కోహ్లీ..క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. ఇక మైదానంలో కోహ్లీ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ దూకుడు చూసిన చాలా మంది.. విరాట్ కు కోపం ఎక్కువ అని..ఎవరి మాట వినని వ్యక్తిగా అంచనా వేస్తుంటారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కూడా కోహ్లీపై విమర్శలు చేస్తుంటారు. అయితే లేటెస్ట్ గా టీమిండియా మాజీ క్రికెటర్, సెలక్టర్ శరణ్ దీప్ సింగ్ కోహ్లీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పాడు. కోహ్లీ బయట ఎంతో వినయంగా ఉంటాడని తెలిపాడు. శరణ్‌దీప్ మాట్లాడుతూ.. " మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోహ్లిని చూస్తే.. ఎంతో దూకుడుగా కనిపిస్తాడు. కానీ ఆఫ్‌ఫీల్డ్‌లో కోహ్లి ఎంతో వినయంగా ఉంటాడు. తను మంచి శ్రోత. సెలక్షన్ మీటింగ్స్‌లో చాలా శ్రద్ధగా అందరూ చెప్పేది వింటాడు. గంటన్నర పాటు జరిగే ఈ సమావేశంలో కోహ్లి అందరూ చెప్పేది శ్రద్ధగా విని.. ఆ తర్వాత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు" అన్నాడు
"ఇక ఇంట్లో కోహ్లి ప్రవర్తనని చూసిన వారు అస్సలు నమ్మలేరు. అతడి ఇంట్లో పని వాళ్లు ఉండరు. కోహ్లి ఇంటికి భోజనానికి వెళ్తే అతడు, అతని భార్య దగ్గరుండి అతిథులకు భోజనం వడ్డిస్తారు. మనతో పాటే కూర్చుని మాట్లాడతాడు. మనతో కలిసి డిన్నర్‌కి బయటకు వస్తాడు. మిగతా ఆటగాళ్లు అందరూ కోహ్లిని ఎంతో గౌరవిస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కోహ్లిది" అని చెప్పుకొచ్చాడు.
ఇక, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో చాలారోజులు ప్రేమాయణం నడిపిన విరాట్ కోహ్లీ.. 2017 చివర్లో ఆమెని వివాహం చేసుకున్నాడు. వీరికి ఈ ఏడాది జనవరిలో కూతురు వామిక పుట్టింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. అహ్మదాబాద్‌లో ఉన్నాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా బుధవారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్ట్ లో ఇరు జట్లు పింక్ బాల్ తో తలపడనున్నాయ్. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఈ మ్యాచ్ లో గెలిచిన వారికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆడే అవకాశాలు మరింత మెరుగవుతాయ్.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.