అలా రాటుతేలాను... వరల్డ్ కప్ పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ వేదాంతం

తన జీవితంలో చాలా విషయాల్ని వైఫల్యాలు, ఎదురుదెబ్బల నుంచే నేర్చుకున్నానన్నాడు విరాట్.

news18-telugu
Updated: July 24, 2019, 12:57 PM IST
అలా రాటుతేలాను... వరల్డ్ కప్ పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ వేదాంతం
విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)
  • Share this:
వరల్డ్ కప్ 2019లో పరాజయం తర్వాత టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీకి వేదంతం అబ్బినట్లుంది. తాజాగా టీమిండియా వెస్టిండీస్ టూర్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్యూలో కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో చాలా విషయాల్ని వైఫల్యాలు, ఎదురుదెబ్బల నుంచే నేర్చుకున్నానన్నాడు. తనకు తగిలిన ఎదురుదెబ్బలు తనను విజయం వైపు ప్రేరేపించాయన్నాడు. ఒక వ్యక్తిగా తనను మెరుగుపర్చాయన్నాడు విరాట్. విజయం కంటే వైఫల్యాల ప్రాముఖ్యతను నాకు అర్థమయ్యేలా చేశాయన్నాడు.

‘మనం బాగా ఎదుగుతున్న సమయంలో అకస్మాత్తుగా మనతో జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని కుంగదీస్తాయి. ప్రతీ ఒకరు బాగా ఆడుతున్నా మనం ఆడలేకపోతాం. మనం ఏ తప్పు చేయలేదని మనకు తెలుస్తోంది. కానీ తోటి ఆటగాళ్లు మాత్రం మనల్ని మించిపోతారు. ఇలాంటి విషయాలు జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎలాంటి తప్పులు చేయకపోయినా.. ఒకొక్కసారి ఓడిపోవడం జరుగుతందని’ కోహ్లీ కామెంట్స్ చేశాడు. సాధారణంగా మనం పొరపాట్లు చేసినప్పుడు.. దాన్ని ఎత్తి చూపితే.. పెద్దగా పట్టించుకోమన్నాడు విరాట్. అయితే మనం ఒక మంచి ప్లేయర్ అయ్యాక ఏమైనా తప్పులు ఎత్తి చూపితే వాటిని తట్టుకోలేం. అలాంటివాటికోసం ఆలోచిస్తూ... వాటి తొందరగా నుంచి బయటపడలేమన్నాడు కోహ్లీ.

తాజాగా టీంలోకి వచ్చిన రిషబ్ పంత్, శుబ్మాన్ గిల్ ,శ్రేయాస్ అయ్యర్‌పై కూడా స్పందించాడు కోహ్లీ. వాళ్లంతా అద్భుతమైన ఆటగాళ్లు అన్నాడు. ఐపిఎల్ వంటి టోర్నమెంట్ల ద్వారా వారి సత్తా ఏంటో చూపించారన్నారు. ఐపీఎల్ వంటి టోర్నమెంట్ల వల్ల నైపుణ్యాలు అభివృద్ధి చెందాయన్నారు. వారి ఆటపై ఎంతో నమ్మకంతో ఉన్నారన్నారు. టీంలో ఉన్న వ్యక్తలు సంఖ్యను బట్టి మ్యాచ్ విన్నింగ్ సామర్ద్యాల్ని గతంలో కూడా ఎప్పుడు అంచనా వేయలేదన్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి క్రికెట్‌కు ఫార్మాట్ ఉండడం అంటే ఏంటన్న దానిపై స్పందించిన కోహ్లీ ఇది టెస్ట్ క్రికెట్‌కు “సరైనది” అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నాడు.

First published: July 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>