• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • THE WIN ALSO SAW NEW ZEALAND CLINCH THEIR 1ST BILATERAL ODI SERIES AGAINST INDIA IN SIX YEARS MK

India vs Newzealand: రెండో వన్డేలో ఓటమితో భారత్ సాధించిన చెత్త రికార్డు ఇదే...

India vs Newzealand: రెండో వన్డేలో ఓటమితో భారత్ సాధించిన చెత్త రికార్డు ఇదే...

IND vs NZ

ఈ మ్యాచ్‌లో పరాజయం పాలవడం ద్వారా భారత జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇప్పటి వరకూ 423 వన్డేల్లో ఓటమి పాలై అత్యధిక వన్డేల్లో ఓడిన జట్టుగా రికార్డులకెక్కింది.

  • Share this:
    కివీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో పరాజయం పాలవడం ద్వారా భారత జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇప్పటి వరకూ 423 వన్డేల్లో ఓటమి పాలై అత్యధిక వన్డేల్లో ఓడిన జట్టుగా రికార్డులకెక్కింది. 421 వన్డేల్లో ఓటమితో శ్రీలంక రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ (413), వెస్టిండీస్ (378), న్యూజిలాండ్ (373) ఆ తర్వాతి స్థానాల్లో నిలబడ్డాయి. ఇదిలా ఉంటే (India vs New Zealand) న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా వన్డేల్లో మాత్రం చేతులెత్తేసింది. తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా రెండో వన్డేలోనూ ఓటమి పాలై సిరీస్ చేజార్చుకుంది. ఓపెనర్లు వైఫల్యంతో పాటు మిడిలార్డర్ రాణించకపోవడంతో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదించకుండా తడబడి 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. దీంతో (India vs New Zealand) టీమిండియాపై న్యూజిలాండ్ జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ జట్టు 2-0 ఆధిక్యంతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. రవీంద్ర జడేజా (55), శ్రేయాస్ అయ్యర్ (52) హాఫ్ సెంచరీలతో రాణించి ఒంటరి పోరు చేసినప్పటికీ పార్ట్‌నర్‌షిప్స్ బిల్డ్ కాకపోవడంతో టీమిండియా ఓటమి పాలైంది. అయితే చివర్లో నవదీప్ సైనీ(45) మెరుపులు మెరిపించినప్పటికీ ఓటమి తప్పలేదు. ఇదిలా ఉంటే టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను గప్టిల్‌-నికోలస్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. న్యూజిలాండ్‌ జట్టులో మార్టిన్‌ గప్టిల్‌(79), నికోలస్‌(41), రాస్‌ టేలర్‌(73)లు రాణించగా, బ్లండెల్‌(22), జెమీసన్‌(25)లు రాణించడంతో కివీస్ గౌరవ ప్రదమైన స్కోరుసాధించింది. అయితే టీమిండియా బౌలర్లు పరిమితంగా పరుగులు ఇవ్వడంతో కివీస్‌ను మూడొందల మార్కును చేరకుండా నియంత్రించింది. దీంతో న్యూజిలాండ్‌ 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

    తొమ్మిదో వికెట్‌కు టేలర్‌-జెమీసన్‌లు అజేయంగా 76 పరుగులు జత చేయడంతో కివీస్‌ గౌరవ ప్రదమైన లక్ష్యాన్ని భారత్‌ ముందుంచింది. టీమిండియా బౌలర్లలో చహల్‌ మూడు వికెట్లు సాధించగా, శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజాకు వికెట్‌ దక్కింది.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు