క్రీడలు

  • associate partner

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్-13 వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇదే..

తమ రాష్ట్రాల్లో ఐపీఎల్ నిర్వహించబోమని ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సూచన మేరకు ఐపీఎల్-2020ని వాయిదా వేసింది.

news18-telugu
Updated: March 13, 2020, 3:19 PM IST
కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్-13 వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనావైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతోంది. అన్ని రంగాలూ కుదేలవుతున్నాయి. విశ్వవ్యాప్తంగా అన్ని మెగా ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి. దేశాధినేతలు, రాజకీయ నేతలకు సైతం కరోనా సోకడంతో అన్ని కార్యక్రమాలూ రద్దవుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో పొట్టి క్రికెట్ పండగ ఐపీఎల్ సైతం వాయిదా పడింది. తమ రాష్ట్రాల్లో ఐపీఎల్ నిర్వహించబోమని ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సూచన మేరకు ఐపీఎల్-2020ని వాయిదా వేసింది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లు కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15న ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ ఏప్రిల్ 15న రాత్రి 8 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే అవకాశముంది. పూర్తిస్థాయి కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనుంది బీసీసీఐ.


కరోనా వైరస్ నేపథ్యంలో విదేశీయులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దౌత్య, ఉద్యోగ వీసాలు మినహా అన్ని టూరిస్ట్ వీసాలను రద్దు చేసింది. దాంతో ఐపీఎల్‌లో ఆడే విదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు మొదలయ్యాయి. వాళ్లు భారత్‌కు వచ్చే పరిస్థితి లేదు. అదే జరిగితే ఐపీఎల్ ప్రాంచైజీలు తీవ్రంగా నష్టపోతాయి. దీనికి తోడు మనదేశంలో కరోనా వైరస్ రోజుకు రోజుకూ విజృంభిస్తుండడం.. క్రికెట్ స్టేడియాలకు వేలాది మంది ప్రేక్షకులు తరలివచ్చే అవకాశం ఉండడంతో.. కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే అన్ని అంశాలన పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఐపీఎల్‌ను వాయిదా వేసింది బీసీసీఐ.
Published by: Shiva Kumar Addula
First published: March 13, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading