Home /News /sports /

THE SELECTORS HAVE ANNOUNCED THE TEAM INDIA SQUAD AND THE NEW CAPTAIN FOR THE ODI SERIES AGAINST SOUTH AFRICA PRV

Team india captain: కోహ్లీ కాదు.. రోహిత్​ కాదు.. టీమిండియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్​..  18 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలక్టర్లు

టీం ఇండియా

టీం ఇండియా

భారత్​ క్రికెట్​ సీనియర్ జట్టులో మరో కొత్త కెప్టెన్​ వచ్చాడు. కోహ్లీ, రోహిత్​ శర్మల మధ్య ఇన్నాళ్లుగా కెప్టెన్​ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల రోహిత్​ శర్మను టీ20, వన్డేలకు కెప్టెన్​ చేశారు సెలక్టర్లు. అయితే అనూహ్య పరిస్థితులు ఎదురవడంతో కొత్త కెప్టెన్​ వచ్చాడు.

ఇంకా చదవండి ...
    భారత​ క్రికెట్​ జట్టు (Team India)లో మరో కొత్త కెప్టెన్ (New captain)​ వచ్చాడు. కోహ్లీ, రోహిత్​ శర్మల మధ్య ఇన్నాళ్లుగా కెప్టెన్​ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.  ఇటీవల రోహిత్​ శర్మ (Rohit Sharma)ను టీ20, వన్డేలకు కెప్టెన్​ చేశారు సెలక్టర్లు. అయితే అనూహ్య పరిస్థితులు ఎదురవడంతో కొత్త కెప్టెన్​ వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul) భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.  రోహిత్ శర్మకు  గాయం కావడంతో (Injury) సిరీస్​కు అందుబాటులో లేడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. శుక్రవారం 18 మందితో కూడిన భారత జట్టు (Team India)ను సెలక్టర్లు ప్రకటించారు.

    రోహిత్​ ఫిట్​గా ఉండటం అవసరం..

    ఇంతకుముందు దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు కూడా రోహిత్ అందుబాటులో లేడు. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను టెస్టుల్లో వైస్​ కెప్టెన్​ (Vise captain)గా నియమించారు. గాయం నుంచి కోలుకోవడానికి రోహిత్ చికిత్స పొందుతున్నాడని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ (Chief Selector Chetan Sharma) శుక్రవారం వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలియజేశాడు. ప్రపంచకప్ (World Cup)​ కోసం రోహిత్​ ఫిట్​గా ఉండటం అవసరం అని చేతన్​ శర్మ తెలిపాడు.

    18 మంది సభ్యులతో కూడిన జట్టులో సీనియర్ ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్,  రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్ వంటివారు కూడా ఉన్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్‌లు జట్టులో ఉన్నారు.



    జట్టులోకి అశ్విన్​..

    రవిచంద్రన్ అశ్విన్ చాలా కాలం తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. స్పిన్​ విభాగంలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లు అతనితో ఉన్నారు. జట్టుకు వైస్ కెప్టెన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించిన జస్ప్రీత్ బుమ్రా పేస్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ మరియు మహమ్మద్ సిరాజ్ పేస్​ బాధ్యతలు పంచుకోనున్నారు. కాగా, ఈ సిరీస్‌లో మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.



    భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్​), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్​ కీపర్), ఇషాన్ కిషన్, చాహల్, ఆర్ అశ్విన్, డబ్ల్యూ సుందర్, బుమ్రా (వైస్​ కెప్టెన్​), భువనేశ్వర్ , దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, సిరాజ్
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Cricket, India vs South Africa, KL Rahul, Team india

    తదుపరి వార్తలు