THE RE EVOLUTION OF TEAM INDIA CRICKETER RAVICHANDRAN ASHWIN THE WHITE BALL BOWLER JNK
Ravichandran Ashwin: రీఎంట్రీలో అదరగొడుతున్న రవిచంద్రన్ అశ్విన్.. అతడి విజయానికి కారణం ఏంటి?
రవిచంద్రన్ అశ్విన్ రీఎంట్రీ అదుర్స్ (PC: BCCI)
టీమిండియా సీనియర్ స్పిన్నర్, టెస్ట్ బౌలింగ్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ వైట్ బాల్ క్రికెట్ (white ball cricket)లోనూ శక్తివంతమైన బౌలర్ కావడం ఖాయమేనని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బౌలింగ్ లో అత్యంత అనుభవం కలిగిన అశ్విన్ అర్థ దశాబ్దకాలంలో ఇండియన్ క్రికెట్లో సంచలనాలు నెలకొల్పాడు.
టీమ్ ఇండియా (Team India) సీనియర్ స్పిన్నర్, టెస్ట్ బౌలింగ్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) వైట్ బాల్ క్రికెట్ (white ball cricket)లోనూ శక్తివంతమైన బౌలర్ కావడం ఖాయమేనని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బౌలింగ్ లో అత్యంత అనుభవం కలిగిన అశ్విన్ అర్థ దశాబ్దకాలంలో ఇండియన్ క్రికెట్లో సంచలనాలు నెలకొల్పాడు. అయితే ఐపీఎల్లో(IPL) అతను శాశ్వతంగా స్థానం కోల్పోయినట్లు అందరూ భావించారు. ఈ నేపథ్యంలోనే టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా టీ20 మాజీ సారథి విరాట్ కోహ్లీని (Virat Kohli) అశ్విన్ మళ్లీ కంబ్యాక్ ఇస్తారా అని అడిగితే.. లేదన్నట్లు కోహ్లీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో 4 ఏళ్ల పాటు వన్డే క్రికెట్‌కు దూరమైన తర్వాత అశ్విన్ కి టీ20 డోర్లు కూడా మూసుకున్నాయి.
అయితే కోహ్లీ వ్యాఖ్యలు చేసిన ఎనిమిది నెలల తర్వాత రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చే మార్గం సుగమం అయ్యింది. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వేలికి గాయం కావడంతో.. అతని స్థానాన్ని అశ్విన్ భర్తీ చేశాడు. జైపూర్‌లో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 2/23తో అద్భుతంగా రాణించి తన సత్తా చాటాడు అశ్విన్. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా, రోహిత్ శర్మ టీ20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాక కీలక ఆటగాళ్ల విషయంలో మార్పులు వస్తున్నాయి. ద్రవిడ్ రాకతో ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో సందడి వాతావరణం నెలకొన్నట్లు అశ్విన్ ఇటీవల టీ20 గెలుపు తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆటగాళ్లు కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యేలా చేసేందుకు డ్రెస్సింగ్ రూమ్ లో వారితో మాట్లాడాల్సిన అవసరం ఉందని రోహిత్, ద్రవిడ్ చెప్పుకొచ్చారు. అశ్విన్ మాటలతో అవి వాస్తవమని తేలింది. అప్పట్లో రోహిత్ శర్మ.. అశ్విన్ ని టీ20 వరల్డ్ కప్ టీంలో తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్నుంచి అశ్విన్ అంతగా నిరాశ చెందలేదు. టాలెంటెడ్ బౌలర్ అశ్విన్ మిడిల్ ఓవర్ వికెట్లు తీయడంలో దిట్ట. ఫుల్‌టైం టీ20 కెప్టెన్ పగ్గాలు చేపట్టాక ఇదే విషయాన్ని రోహిత్ శర్మ ప్రస్తావించాడు. 2017 లోనే పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి వైదొలగిన అశ్విన్ ఆ తర్వాత ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లలో ఉత్తమ వైట్ బాల్ బౌలర్ గా అతను పేరు తెచ్చుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో ఉత్తమ బౌలర్ గా రాణించాడు.
భారత క్రికెటర్ అక్షర్ పటేల్ అశ్విన్ అసమానమైన ప్రతిభను బాగా పొగిడాడు. అశ్విన్ కు ఉన్న నైపుణ్యాల్లో సగం నైపుణ్యాలున్న తాను క్రికెట్లో రాణించగలనని అన్నాడు. బ్యాట్స్మెన్లను ఎదుర్కొనేందుకు విభిన్న ప్లాన్స్ అశ్విన్ వద్ద ఉంటాయన్నాడు. టీ20లో అద్భుతమైన బౌలింగ్ తో బ్యాట్స్మెన్లను అటాక్ చేసే ఆస్కారం ఉండదని కానీ అందుకుగాను మనమే మార్గాలను వెతుక్కొని బంతులు వేయాలని అశ్విన్ లేటెస్ట్ టీ20 గేమ్ ముగిసిన అనంతరం చెప్పాడు. "లైన్ అండ్ లెంగ్త్ మీరు చాలా వరకు మిస్ కాలేరు. మీరు టీ20 గేమ్‌లో ముందుగా బౌలింగ్ చేస్తున్నప్పుడు సరైన పేస్‌ని గుర్తించడం ఎల్లప్పుడూ సవాలుగా ఉంటుంది. నేను పవర్‌ప్లే లోపల నా మొదటి ఓవర్‌ని బౌల్ చేసాను. కాబట్టి గేమ్‌లో తర్వాత బౌల్ చేసిన దానికంటే పేస్ మార్పు చాలా తక్కువగా ఉండాలి. ఆ వేగాన్ని గుర్తించడానికి నాకు కొంచెం సమయం పట్టింది. నేను బౌల్ చేసిన మొదటి రెండు ఓవర్లలో ఒకటి లేదా రెండుసార్లు నా స్పీడ్ తగ్గించాను. ఆపై బంతిని స్లో చేస్తే ఈ పిచ్‌లో బౌలింగ్ అనుకూలంగా ఉంటుందని నేను గ్రహించాను." అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
న్యూ స్కిల్స్ పెంపొందించుకోవడానికి తాను ప్రతిరోజూ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తానని అశ్విన్ ఎప్పుడూ చెబుతుంటాడు. అతను తనను తాను లాబరేటరీలో ఓ సైంటిస్ట్ గా భావిస్తుంటాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా తాను ఎదగడానికి అశ్విన్ ఎంతగానో సహాయం చేసాడని చెబుతాడు. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న అశ్విన్ క్రికెట్ నుంచి వైదొలగే ముందు తన సత్తా చాటే వెళ్తాడని.. ఆ దృఢనిశ్చయంతోనే అశ్విన్ వున్నాడని తెలుస్తోంది.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.