హోమ్ /వార్తలు /క్రీడలు /

Sania farewell: ఫేర్‌వెల్ కిస్‌.! ది లాస్ట్‌ డ్యాన్స్‌..! సానియా మీర్జా ఎమోషనల్

Sania farewell: ఫేర్‌వెల్ కిస్‌.! ది లాస్ట్‌ డ్యాన్స్‌..! సానియా మీర్జా ఎమోషనల్

సానియా-బోపన్న

సానియా-బోపన్న

Sania Mirza-Rohan Bopanna: భారత్‌ వెటరన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, హైదరాబాదీ సెన్సేషన్ సానియా మీర్జా తన చివరి గ్రాండ్‌స్లామ్‌ను గ్రాండ్‌గా ఫినిష్‌ చేసేందుకు రెడీ అయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 మిక్సిడ్‌ డబుల్స్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారత్‌ వెటరన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, హైదరాబాదీ సెన్సేషన్ సానియా మీర్జా తన చివరి గ్రాండ్‌స్లామ్‌ను గ్రాండ్‌గా ఫినిష్‌ చేసేందుకు రెడీ అయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్సిడ్‌ డబుల్స్‌ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. మరో వెటరన్ లేయర్ రోహాన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలో దిగుతున్న సానియా.. సెమీస్‌లో చెమటోడ్చి గెలిచింది. అఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో విజయం సానియా-బోపన్న జోడినే వరించింది. ఈ విజయంతో తన కెరీర్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ హైదరాబాదీ స్టార్‌.

పాయింట్‌ పాయింట్‌కి పోరాటం:

క్వార్టర్స్‌లో వాకోవర్ లక్‌తో సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సానియా-బోపన్న జోడి.. సెమీస్‌లో పాయింట్‌ పాయింట్‌కి పోరాడాల్సి వచ్చింది. బ్రిటన్‌కు చెందిన మూడో సీడ్ నీల్ సుపాస్కి, అమెరికాకు చెందిన డిసిరే క్రాజెక్‌ ధ్వయాన్ని ఓడించింది. పాయింట్‌కు పాయింట్‌కు చెమట చెందించిన ఈ రెండు జోడిలు ఆస్ట్రేలియాన్‌ ఓపెన్‌కు కొత్త కిక్‌ ఇచ్చాయి. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో సానియా-బోపన్న జోడీ 7-6 (7-5), 6-7 (5-7), 10-6 తేడాతో నీల్-క్రాజెక్‌ ద్వయాన్ని మట్టికరిపించింది. గంటా 52 నిమిషాల పాటు ఈ మ్యాచ్‌ జరిగిందంటే ఉత్కంఠ ఏ రేంజ్‌లో సాగిందో క్లియర్‌ కట్‌గా అర్థం చేసుకోవచ్చు. తొలి రెండు సెట్లు టై బ్రేకర్‌కు దారి తియ్యగా.. సానియా జోడి తొలి సెట్, నీల్‌-క్రాజెక్‌ జోడి రెండో సెట్ గెలుచుకున్నాయి. ఇక నిర్ణయాత్మక మూడో సెట్ అయితే సూపర్‌ టై బ్రేకర్‌కు దారి తీసింది. అయితే బ్యాక్‌హ్యాండ్‌, బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌లతో విరుచుకుపడడంతో చివరకు ఈ భారత్‌ వెటరన్‌ జోడినే విజయం వరించింది.ఈ మ్యాచ్‌లో సానియా జోడి నలుగు ఏస్‌లు సాధించింది. శనివారం జరగనున్న ఫైనల్‌లో బ్రెజిల్‌ జోడి స్టెఫాని- రఫెల్‌తో సానియా- బోపన్న తలపడనున్నారు.

సానియా ఎమోషనల్‌:

తన కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ ఆడుతున్న సానియా భావోద్వేగాలు టెన్నిస్‌ కోర్టులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదో అద్భుతమైన మ్యాచ్‌ అని... ఎంతో ఒత్తిడి ఎదుర్కొన్నామంటూ మ్యాచ్‌ తర్వాత మాట్లాడింది సానియా. తన చివరి గ్రాండ్‌స్లామ్‌లో బోపన్నతో ఆడడం ప్రత్యేకంగా ఉందని.. ఇప్పుడు తనకు 36 ఏళ్లు.. బోపన్నకు 42 ఏళ్లు... మేమింకా ఆడుతున్నామంటూ ఎమోషనల్‌ అయ్యింది సానియా. తాను సాధారణంగా ఏడ్చేదాన్ని కాదు అని.. అయితే ఇప్పుడు ఆ ఫిలింగ్‌ను ఆపుకుంటున్నానంటూ ఏడ్చినంత పని చేసింది సానియా. అటు ఫైనల్‌లో సానియా-బోపన్న జోడి గెలవాలని యావత్ భారత్‌ కోరుకుంటోంది. సానియా తన చివరి గ్రాండ్‌ స్లామ్‌ కెరీర్‌ను గ్రాండ్‌గా ముగించాలని ఆల్‌ ది బెస్ట్‌ చెబుతోంది.

First published:

Tags: Australia, Final key, Sania Mirza, Tennis

ఉత్తమ కథలు