Home /News /sports /

Viral Video : వావ్ వాటే క్యాచ్.. "జాంటీ రోడ్స్, రవీంద్ర జడేజాను మించిపోయావ్"

Viral Video : వావ్ వాటే క్యాచ్.. "జాంటీ రోడ్స్, రవీంద్ర జడేజాను మించిపోయావ్"

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : క్రికెట్ అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాసాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంటాయి.

ఇంకా చదవండి ...
  క్రికెట్ అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాసాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంటాయి. ఇక, ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ లీగ్ లో కూడా కొన్ని అద్భుత విన్యాసాలు అభిమానుల్ని కట్టిపడేస్తున్నాయ్. ఈ మధ్యన అయితే క్రికెటర్లకు మేము కూడా ఏమాత్రం తీసిపోమని అభిమానులు సైతం నిరూపిస్తున్నారు. ఊహించని రీతిలో క్యాచులు పడుతున్నారు. తాజాగా హండ్రెడ్‌ టోర్నీలో ఓ అభిమాని పట్టిన సూపర్ క్యాచ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్‌ టోర్నీ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఇప్పటికే లియామ్‌ లివింగ్‌స్టోన్‌ సిక్సర్ల హోరుతో బర్మింగ్‌హమ్‌ ఫోనిక్స్‌ ఫైనల్‌కు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. లివింగ్‌స్టోన్‌ (40 బంతుల్లో 90; 3 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే, ఈ మ్యాచ్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లివింగ్‌స్టన్‌ కొట్టిన ఒక భారీ సిక్స్‌ను మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు స్టన్నింగ్ క్యాచ్‌గా అందుకున్నాడు. బంతి స్టాండ్స్‌లోకి రావడంతో ఆ వ్యక్తి లేచి దానిని అందుకునే ప్రయత్నంలో సీటు నుంచి పక్కకు పడిపోయాడు. అయినా పట్టువిడవకుండా డైవ్‌ చేస్తూ బంతిని అందుకున్నాడు.

  వెనక వరుసలోని సీటు నుంచి ముందు వరుసలోని సీటుకు పడిపోతూ ఆ అభిమాని పట్టిన క్యాచుకు అక్కడి ఫాన్స్ ఫిదా అయ్యారు. కామెంటేటర్లు సైతం ఆ అభిమాని సాహసానికి వావ్ అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రపంచాన్ని జయించానన్నట్లుగా అతను ఇచ్చిన హావభావాలు సూపర్‌గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. " జాంటీ రోడ్స్, రవీంద్ర జడేజాను మించిపోయావ్" , " వావ్ ఫెంటాస్టిక్ క్యాచ్" అంటూ తెగపొగిడేస్తున్నారు ఫ్యాన్స్‌.

  ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్‌ ఛార్జర్స్ మోస్తరు స్కోర్ చేసింది. జట్టుకు ఓపెనర్లు క్రిస్ లిన్ (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కోహ్లర్ (44 బంతుల్లో 71; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) శుభారంభాన్ని అందించారు. వీరు మినహా జట్టు సభ్యులంతా విఫలం కావడంతో సూపర్ ఛార్జర్స్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. డేవిడ్ విల్లి, జోర్డాన్ థాంప్సన్, డేన్ విలాస్, జె సింప్సన్ పూర్తిగా విఫలమయ్యారు.


  ఆ తర్వాత 144 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఫీనిక్స్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్ విల్ స్మీడ్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అయితే అప్పుడే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లియామ్‌ లివింగ్‌స్టోన్ వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి న్యూజిలాండ్ యువ ఓపెనర్ ఫిన్ అలెన్‌ (26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి 51 బంతుల్లో 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఫీనిక్స్ జట్టు కేవలం 74 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. లివింగ్‌స్టోన్, టామ్ అబెల్ నాటౌట్‌గా నిలిచారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, England, Sports, Viral Video

  తదుపరి వార్తలు