టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతోంది. తనదైన క్లాస్ బ్యాటింగ్ తో రికార్డులు కొల్లగొడుతోంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ బాల్ వుమెన్ కాంపిటీషన్ టోర్నీలో స్మృతి మంధాన దుమ్మురేపింది. సదరన్ బ్రేవ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంధాన 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులతో నాటౌట్‌గా నిలవడమేగాక ఒంటిచేత్తో జట్టును గెలిపించింది. మంధాన మెరుపులతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే సదరన్ బ్రేవ్ విజయాన్ని అందుకుంది. మంధాన బ్యాటింగ్ విషయాన్ని పరిశీలిస్తే.. మొదటి 25 బంతులకు 29 పరుగులు చేసిన స్మృతి ఆ తరువాతి 14 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 32 పరుగులు చేసింది. స్మృతి దెబ్బకి వెల్ష్ ఫైర్ బౌలర్ల దగ్గర సమాధానం లేకపోయింది. ఇప్పుడు మంధాన బ్యాటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.
వెల్ష్ ఫైర్ బ్యాటింగ్‌లో హెలీ మాథ్యూస్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జార్జియా హెనెస్సీ 23 నాటౌట్‌గా నిలిచింది. సదరన్ బౌలింగ్‌లో లారెన్ బెల్, వెల్లింగ్‌టన్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సదరన్ బ్రేవ్ వుమెన్ 84 బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకుంది. స్మృతి 61 నాటౌట్, స్టఫానీ టేలర్ 17 నాటౌట్‌గా నిలిచారు.
if chasing is a CLASSROOM then @mandhana_smriti is TOPPER in that
61*(39)#TheHundred pic.twitter.com/zZ4ZVy2h4P
— SaiKiran@9999 (@Kiran99995) July 27, 2021
All About Yesterday?
Smriti Mandhana Scored 61* (39)
Match Hero @mandhana_smriti #SmritiMandhana #TheHundred #ViratKohli pic.twitter.com/WT4Y9VTMok
— Saurabh18 (@Smritivirat18) July 28, 2021
ఇక, ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో స్మృతి మంధాన రాణించిన సంగతి తెలిసిందే. ఇక, తన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ హండ్రెడ్ లీగ్ లో చెలరేగుతోంది స్మృతి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, England, Smriti Mandhana, Sports