శుక్రవారం నుంచి ఎడ్జబాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ (England) తో ప్రారంభం కాబోయే ఐదో టెస్టు కోసం టీమిండియా (Team India) సై అంటోంది. కరోనా నుంచి కోలుకోకపోవడంతో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తప్పుకున్నాడు. అతడి స్థానంలో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) భారత జట్టును నడిపించనున్నాడు. బీసీసీఐ (BCCI) ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది. ఇక, ఇంగ్లండ్ తో జరగబోయే టీ20 సిరీస్, వన్డే సిరీస్ లకు కూడా భారత జట్టులను ప్రకటించింది బీసీసీఐ. ఫస్ట్ టీ20కి దాదాపు ఐర్లాండ్ తో ఆడిన జట్టునే కంటిన్యూ చేసింది. అయితే.. రెండు, మూడు టీ20లకు జట్టులో భారీ మార్పులు చేశారు. ఐదో టెస్ట్ ఆడిన ఆటగాళ్లకి విశ్రాంతి ఇచ్చి.. ఈ రెండు టీ20లకు ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఇక, 17 మందితో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. ఇక, రోహిత్ కు తిరిగి సారథ్య బాధ్యతల్ని అప్పగించారు సెలెక్టర్లు.
రెండు, మూడు టీ20 లకు రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, వెంకటేష్ అయ్యర్, అర్షదీప్ లపై వేటు వేశారు. దీంతో, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలకు మరోసారి నిరాశే ఎదురైంది. వీరి స్థానాల్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బమ్రాలు తిరిగి జట్టులోకి రానున్నారు. వీరందరూ ఇంగ్లండ్ తో ఐదో టెస్ట్ తలపడనున్నారు. అందుకే.. ఫస్ట్ టీ20కి విశ్రాంతి కల్పించారు.
ఇక, వన్డే జట్టులోకి కూడా మార్పులు చేశారు సెలెక్టర్లు. చాలా రోజుల తర్వాత శిఖర్ ధావన్ తిరిగి వన్డే జట్టులో చోటు సంపాదించుకున్నాడు. మహ్మద్ షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ లకు వన్డే జట్టులో చోటు దక్కింది. 7,9,10 తేదీల్లో టీ20లు జరగనున్నాయ్. 12,14,17 తేదీల్లో వన్డేలు జరగనున్నాయ్.
NEWS ???? - #TeamIndia’s squad for T20I & ODI series against England announced.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.