Tokyo Olympics : భారత అథ్లెట్లకు క్యాష్ ప్రైజ్ ప్రకటించిన IOC..గోల్డ్ మెడలిస్ట్ కి భారీ మొత్తం..

Photo Credit : Twitter

Tokyo Olympics :కరోనా దెబ్బకు ఒక ఏడాది వాయిదా పడ్డా, మరోసారి మహమ్మారి సవాళ్లు విసురుతున్నా.. అటు నిర్వాహకులు, ఇటు క్రీడాకారులు విశ్వ క్రీడా సంబరాన్ని విజయవంతం చేయడానికి పట్టుబట్టి ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టారు. 200కు పైగా దేశాలు.. 11 వేల మందికి పైగా అథ్లెట్లు.. 60 వేలకు పైగా నిర్వాహక సిబ్బంది మెగా క్రీడల కోసం సిద్ధమయ్యారు.

  • Share this:
    విశ్వక్రీడలు టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. నిజానికి గతేడాది జరగాల్సిన ఈ క్రీడల కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు నేడు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అత్యంత సాదాసీదాగా 1000 మంది అతిథుల సమక్షంలో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం మొదలైంది. జపాన్ చక్రవర్తి నరహిటో క్రీడలను ప్రారంభించారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని హాకీ పురుషుల జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా బాక్సర్ మేరీకోమ్ త్రివర్ణ పతకాన్ని చేబూని నడిపించారు. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు జపాన్ పతాకం స్టేడియంలోకి ప్రవేశించింది. చారిత్రక నేపథ్యం కలిగిన గ్రీస్ బృందంతో పరేడ్ మొదలైంది. ఐవోసీ శరణార్థి ఒలింపిక్ జట్టును స్టేడియంలోకి ఆహ్వానించారు. ఈ జట్టుకు ఆహ్వానం పలకడం ఒలింపిక్ చరిత్రలో ఇది రెండోసారి. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ సందర్భంగా పాలస్తీనియన్ గన్‌మెన్ చేతిలో హత్యకు గురైన ఇజ్రాయెల్ ఒలింపిక్ జట్టును ఈ సందర్భంగా గుర్తు చేసుకుని మౌనం పాటించారు. ఇజ్రాయెల్ జట్టును స్మరించుకోవడం ఒలింపిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి.

    ఇక, ఈ విషయాల్ని పక్కన పెడితే.. ఒలింపిక్స్ లో సత్తా చాటి పతకాలు సాధించే అథ్లెట్లకు క్యాష్ ప్రైజ్ ప్రకటించింది ఇండియన్ ఒలింపిక్ సంఘం. గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్ కు రూ. 75 లక్షల ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ నగదు తో పాటు మరో 25 లక్షల రూపాయల్ని వివిధ క్రీడల స్పోర్ట్స్ ఫెడరేషన్ లకు అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే, సిల్వర్ మెడల్ సాధిస్తే రూ. 40 లక్షలు, కాంస్య పతకం సాధిస్తే 25 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా దేశం తరఫున పాల్గొన్న ప్రతి అథ్లెట్ కి లక్ష రూపాయలు ఇవ్వనుంది.
    ఫస్ట్ టైం.. ఇండియన్ ఒలింపిక్ సంఘం ఈ నజరానా అందించనున్నట్లు తెలిపారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా. అలాగే, ప్రతి అథ్లెట్ 50 యూఎస్ డాలర్లను రోజు వారీ పాకెట్ మనీగా అందించనున్నట్లు తెలిపింది. ఇక, కరోనా దెబ్బకు ఒక ఏడాది వాయిదా పడ్డా, మరోసారి మహమ్మారి సవాళ్లు విసురుతున్నా.. అటు నిర్వాహకులు, ఇటు క్రీడాకారులు విశ్వ క్రీడా సంబరాన్ని విజయవంతం చేయడానికి పట్టుబట్టి ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టారు. 200కు పైగా దేశాలు.. 11 వేల మందికి పైగా అథ్లెట్లు.. 60 వేలకు పైగా నిర్వాహక సిబ్బంది మెగా క్రీడల కోసం సిద్ధమయ్యారు. ఇక వచ్చే రెండు వారాలు వందల కోట్ల మంది అభిమానులకు పండగే. క్షణ క్షణం ఉత్కంఠకు గురవుతూ.. భావోద్వేగాల్లో మునిగి తేలడం గ్యారెంటీ.
    Published by:Sridhar Reddy
    First published: