AB de Villiers : ఏబీ డివిలియర్స్ పై సంచలన ఆరోపణలు..నల్లజాతి క్రికెటర్ అవ్వడంతో అలా చేశడంటూ..

ఏబీ డివిలియర్స్ - గ్రేమ్ స్మిత్ - తమి సోలెకిలే

AB de Villiers : క్రికెట్‌.. ఒక జెంటిల్‌మెన్‌ గేమ్ అని ప్రతి క్రికెటర్‌, అభిమాని గొప్పగా ఫీలవుతుంటారు. ఇందుకు తగ్గట్లే విభిన్న దేశాల క్రికెటర్లు.. రంగు, మతం, జాతి అనే తేడా లేకుండా ఈ క్రీడలో మమేకమై పోటీపడుతుంటారు.

  • Share this:
    క్రికెట్‌.. ఒక జెంటిల్‌మెన్‌ గేమ్ అని ప్రతి క్రికెటర్‌, అభిమాని గొప్పగా ఫీలవుతుంటారు. ఇందుకు తగ్గట్లే విభిన్న దేశాల క్రికెటర్లు.. రంగు, మతం, జాతి అనే తేడా లేకుండా ఈ క్రీడలో మమేకమై పోటీపడుతుంటారు. ఇక ఐపీఎల్​ లాంటి లీగ్​ల్లో అయితే ఒకే డ్రెస్సింగ్​రూమ్​ను​ పంచుకుంటారు. అయితే ఇలాంటి ఆటలోనూ జాత్యాంహంకార ధోరణి ఉందని ఎన్నో ఘటనలు నిరూపించాయ్. ఇక, దక్షిణాఫ్రికా క్రికెట్ లో జాతి వివక్ష కొత్తేమీ కాదు. ఇప్పటికే జాత్యాహంకారం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధానికి గురైంది సౌతాఫ్రికా టీమ్. ఇక, లేటెస్ట్ గా మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్ లో సంచలనం రేపుతున్నాయ్. ఇక సఫారీ జట్టులో గ్రేట్ లెజెండరీ క్రికెటర్లుగా గుర్తింపు దక్కించుకున్న ఏబీ డివిల్లియర్స్, గ్రేమ్ స్మిత్‌లపై ఈసారి జాతివివక్ష ఆరోపణలు రావడం విశేషం. సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో సూపర్ గా ఆడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ తమి సోలెకిలే, 2011 నుంచి 15 వరకూ నేషనల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. అయితే ఈ ఐదేళ్ల కాలంలో కేవలం బ్యాకప్ ప్లేయర్‌గానే ఉన్న తమి సోలెకిలే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.160 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన తమి సోలెకిలే, మూడంటే మూడే అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. అయితే అప్పుడు సౌతాఫ్రికా జట్టు కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్ లేకపోయి ఉంటే, తాను మరిన్ని మ్యాచులు ఆడేవాడినని కామెంట్ చేశాడు తమి సోలెకిలే.

    " మిస్టర్ గ్రేమ్ స్మిత్, ఎప్పుడూ నన్ను తన టీమ్‌లో ఉండాలని కోరుకోలేదు..." అంటూ ఇద్దరు నేషనల్ సెలక్షన్ కన్వేనర్స్ ఆండ్రూ హడ్సన్, లిండా జోండిలతో కలిసి న్యాయస్థానం ముందు ఈ ఆరోపణలు చేశాడు తమి సోలేకిలే. వెస్టర్న్ ప్రోవెన్స్ అండర్13 తరుపున ఆడిన సమయంలో జట్టులోని తెల్లజాతీయులందరూ సుఖంగా బెడ్‌రమ్‌లో పడుకుంటే, తాను, తనతో పాటు ఉన్న నల్లజాతీయులు కిచెన్‌లో పడుకున్నామని తెలియచేశాడు తమి. " 2013లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తనకు చోటు ఉంటుందని సెలక్టర్ హడ్సన్ చెప్పాడు, నేను ఎంతో సంతోషించాడు. ఆ సమయంలో మార్క్ బ్రౌచర్ కంటి గాయంతో బాధపడుతున్నాడు."

    ఏబీ డివిలియర్స్ పై సంచలన ఆరోపణలు చేసిన తమి సోలెకిలే


    " అయితే ఆ సమయంలో కూడా నాకు అవకాశం రాలేదు. ఎందుకంటే బ్రౌచర్ ఉన్నప్పుడు వికెట్ కీపింగ్ చేయని ఏబీ డివిల్లియర్స్, నాకు టీమ్‌లో చోటు దక్కకూడదనే ఉద్దేశంతో వికెట్ కీపింగ్ చేయడానికి రెడీ అయ్యాడుగ్రేమ్ స్మిత్ చాలా గొప్ప కెప్టెన్. కానీ నా దృష్టిలో మాత్రం అతనికి సౌతాఫ్రికా క్రికెట్ అసోసియేషన్, అతని టీమ్‌‌మేట్స్ చాలా అధికారాలు ఇచ్చారు.అతను ఎప్పుడూ నాతో చనువుగా మాట్లాడింది లేదు, నాతోనే కాదు, నాలాంటి నల్ల జాతీయులతో కూడా. అతనితో నాకు ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవు. అండర్19 టీమ్‌లో ఉన్నప్పుడు నేను అతనికి కెప్టెన్‌ని, కొన్ని సమయాల్లో అతనికి ప్రత్యర్థిగా కూడా ఆడాను. అందుకే నన్ను ఇంతగా ద్వేషించడానికి కారణం ఏంటా? అని చాలాసార్లు ఆలోచించాను. నేను తన జట్టులో ఉండడం ఇష్టం లేదని గ్రేమ్ స్మిత్, తనతో చెప్పినట్టు సెలక్టర్లు కూడా నాతో అన్నారు... ప్రతీ టూర్‌కి వెళ్లిన సమయంలో ఇదే జరిగేది. నేను నాకు ఛాన్స్ వస్తుందని, ఆఖరి మ్యాచ్ దాకా ఎదురుచూస్తూ ఉండేవాడిని. కాని ఎప్పుడూ ఆ అవకాశం వచ్చేది కాదు. 2012లో ఇంగ్లాండ్‌ టూర్‌కి ఎంపికయ్యాను. ఆ తర్వాతి ఏడాది ఆస్ట్రేలియా టూర్‌లో... ఇలా నా కెరీర్ మొత్తం ఎదురుచూపులే మిగిలాయ్" అంటూ సంచలన ఆరోపణలు చేశాడు తమీ సోలెకిలే.

    ఈ ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయ్. ఎంతో సౌమ్యుడిగా ఉండే..ఏబీ డివిలియర్స్ లో ఇంత విద్వేషం దాగి ఉందా అని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. గ్రేమ్ స్మిత్ లాంటి గొప్ప కెప్టెన్.. ఓ ప్లేయర్ పై ఇలా కక్ష సాధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: