హోమ్ /వార్తలు /క్రీడలు /

PV Sindhu : సింధు ఖేల్ ఖతం.. ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత చేతిలో ఘోర పరాభవం

PV Sindhu : సింధు ఖేల్ ఖతం.. ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత చేతిలో ఘోర పరాభవం

పీవీ సింధు (ఫైల్ ఫోటో)

పీవీ సింధు (ఫైల్ ఫోటో)

PV Sindhu : టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన తర్వాత నుంచి తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుంది. పెద్ద పెద్ద టోర్నీల్లో ప్రత్యర్థుల ముందు నిలబడలేక ఇంటి దారి పడుతోంది.

PV Sindhu : టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన తర్వాత నుంచి తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుంది. పెద్ద పెద్ద టోర్నీల్లో ప్రత్యర్థుల ముందు నిలబడలేక ఇంటి దారి పడుతోంది. తాజాగా మరో ప్రతిష్టాత్మక టోర్నీలోనూ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. బ్యాంకాక్ వేదికగా జరుగుతోన్న థాయ్ లాండ్ ఓపెన్ లో పీవీ సింధు ప్రస్థానం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ లో సింధు 17-21, 16-21తో టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత చెన్ యూ ఫీ (చైనా) ప్లే యర్ చేతిలో వరుస గేముల్లో ఓడింది.

ఆరంభంలో పీవీ సింధు ప్రత్యర్థికి గట్టిపోటీ ఇచ్చింది. ఇరువురు కూడా పాయింట్ల కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. దాంతో మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. అయితే కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన చెన్ తొలి గేమ్ ను 21-17తో సొంతం చేసుకుని.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో గేమ్ లోనూ తెలుగు తేజం సింధు తడబడింది. కీలక సమయాల్లో అనవసర తప్పిదాలు చేసి పాయింట్లను కోల్పోవలసి వచ్చింది. అదే సమయంలో చెన్ కూడా మంచి ఆటతీరును కనబరిచింది. పీవీ సింధు లోపాలను కనిపెట్టిన ఆమె అందుకు తగిన విధంగా షాట్స్ ఆడుతూ పాయింట్లను సాధించగలిగింది. కోర్టులో చెన్ పీవీ సింధు కంటే కూడా వేగంగా కదిలింది. మరోవైపు సింధు మాత్రం తన పవర్ గేమ్ నే నమ్ముకుంది. స్మాష్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా తన గేమ్ ను కొనసాగించింది. అయితే చెన్ డిఫెన్స్ ముందు సింధు ఆటలు సాగలేవు. ఈ క్రమంలో రెండో గేమ్ ను కూడా సొంతం చేసుకున్న ఆమె థాయ్ లాండ్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టింది.

థాయ్ లాండ్ ఓఫెన్ లో పీవీ సింధు మినహా మిగిలిన భారత షట్లర్ల ప్రయాణం ఎప్పుడో ముగిసిపోయింది. అయితే సింధు ఆడుతున్న ఆటను చూస్తే తప్పకుండా స్వర్ణం నెగ్గుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆమె గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత చేతిలో కంగుతిని టోర్నీ నుంచి తప్పుకుంది.

First published:

Tags: Badminton, IPL, IPL 2022, Pv sindhu, Thailand

ఉత్తమ కథలు