TENNIS STAR SERENA WILLIAMS HAS SPOKEN OUT IN SUPPORT OF HER SELFLESS FRIEND MEGHAN MARKLE SRD
Serena Williams : ఆ బాధ నేను అనుభవించా..వర్ణవివక్షపై మేఘన్ కు అండగా సెరెనా విలియమ్స్..
Meghan Markle - Serena Williams
Serena Williams : రాజకుటుంబం నుంచి విడిపోయిన తర్వాత ప్రిన్స్ హ్యారీ దంపతులు తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. అమెరికాలోని పాపులర్ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ఈ దంపతులు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
రాజకుటుంబం నుంచి విడిపోయిన తర్వాత ప్రిన్స్ హ్యారీ దంపతులు తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. అమెరికాలోని పాపులర్ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ఈ దంపతులు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన క్యారక్టర్‌పై మీడియా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని మండిపడి మేఘన్ మార్కెల్.. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మేఘన్ మార్కెల్ మాట్లాడుతూ రాజకుటుంబం తనపై నిందలు వేసిందని, ఒక దశలో చచ్చిపోదామనుకున్నానన్నారు. ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకుని.. బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డానన్నారు. డిప్రెషన్లో ఉంటే కుటుంబంలో ఎవరూ తనకు సాయం చేయలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అలాగే, బ్రిటిష్ రాజకుటుంబంలో వర్ణ వివక్ష ఉన్నదంటూ సంచలన ఆరోపణలు చేసింది మేఘన్. మేఘన మార్కెల్‌కు స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ మద్దతుగా నిలిచారు. తన నిస్వార్థ స్నేహితురాలకి ఈ విషయంలో తాను పూర్తి మద్దతు తెలుపుతున్నానని సెరెనా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో స్పష్టం చేశారు.
తన కెరీర్లోనూ ఎన్నోసార్లు వర్ణ వివక్షను ఎదుర్కొన్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. మేఘన మార్కెల్‌కు అండగా నిలబడ్డారు. "మేఘన మార్కెల్.. నిస్వార్థ స్నేహితురాలు. సానుభూతి, కరుణ ఉన్న ఆమె జీవన విధానం అందరికి ఆదర్శం. "నిజంగా గొప్పది" అంటే అర్ధం ఏమిటో ప్రతిరోజూ ఆమె నాకు బోధిస్తుంది. మేఘన మాటలు ఆమె అనుభవించిన నొప్పి మరియు క్రూరత్వాన్ని వివరిస్తాయి. లింగ వివక్ష, వర్ణ వివక్ష ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలుసు. శరీర రంగు ఆధారంగా మహిళలను తక్కువ చేసి అణిచేయడానికి చూస్తారు. మన పిల్లలకు మాత్రం ఈ పరిస్థితి ఉండకూడదు" అని సెరెనా పేర్కొన్నారు.
బ్రిటన్ రాణి ఎలిజబిత్ 2 మనవడు అయిన ప్రిన్స్ హ్యారీ.. 2018, మే 19న బ్రిటన్ విండ్సోర్ క్యాస్టిల్లో అధికారికంగా అమెరికా నటి మేఘన్ మర్కెల్‌ను వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి కుమారుడు ఆర్చీ పుట్టాడు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా గతేడాది హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. వారు ఆ తర్వాత మేఘన్ స్వస్థలం కాలిఫోర్నియా వెళ్లిపోయారు. ఇక ఈ ఏడాది వేసవిలో మేఘన్ అమ్మాయికి జన్మనివ్వబోతున్నారు. మొత్తానికి, ఓఫ్రా విన్ఫ్రే చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది.