Home /News /sports /

TENNIS STAR SANIA MIRZA SHARES GLIMPSES OF HER DAILY LIFE IN INSTAGRAM VIDEO GOES VIRAL SRD

Sania Mirza : జిమ్..టెన్నిస్.. ఫోటోషూట్... సానియా మీర్జా జీవితంలో ఒక రోజు..వైరల్ వీడియో

సానియా మీర్జా (ఫైల్)

సానియా మీర్జా (ఫైల్)

Sania Mirza : భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంటే తెలియనివారుండరు. సానియా మీర్జా తన టెన్నిస్‌ ఆటతోనే కాకుండా.. అందంతోనూ ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకుంది.

    భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంటే తెలియనివారుండరు. సానియా మీర్జా తన టెన్నిస్‌ ఆటతోనే కాకుండా.. అందంతోనూ ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకుంది. ఇండియాలో టెన్నిస్ అంతలా పాపులర్ కావడానికి ఓ కారణం సానియా మీర్జా. సానియా మీర్జా ప్రపంచస్థాయి అగ్ర టెన్నిస్ క్రీడాకారిణిలని ధీటుగా ఎదుర్కొంది. క్రీడాకారిణిగా ఎంతో పేరు ప్రతిష్టలు సొంతం చేసుకున్న సానియా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలిచింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ సానియా సొంతం. సానియా.. తన ఆటతో దేశాన్ని గర్వపడేలా చేసినందుకు.. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్‌తో సత్కరించింది. అంతేకాకుండా సానియాను ప్రతిష్టాత్మక అవార్డు రాజీవ్ ఖేల్ రత్న కూడా వరించింది. సానియా కెరీర్‌లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర స‌ృష్టించింది. ఎప్పటికప్పుడూ తన ఫోటోలను, తనకు సంబంధించిన విషయాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది సానియా. లేటెస్ట్ గా సానియా మీర్జా షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

    సానియా మీర్జా తన జీవితంలో ఒక రోజును టీజర్ రూపంలో ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. " నా జీవితంలో ఒక రోజు అంటూ" ఈ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ వీడియోలో సానియా రోజు వారి దినచర్యను మనం గమనించవచ్చు. జిమ్, టెన్నిస్, ఫోటోషూట్, ఇంటర్వ్యూ ఇలా ఒక రోజులో తను చేసే యాక్టివీటిస్ ను షేర్ చేసింది సానియా. ఇప్పుడు ఈ వీడియోకు తెగ లైకుల వర్షం కురస్తోంది. పోస్ట్ చేసిన మూడు గంటల్లోనే 38 వేల మందికి పైగాఈ వీడియోను లైక్ చేశారు.








    View this post on Instagram






    A post shared by Sania Mirza (@mirzasaniar)





    ఇక పాకిస్థానీ క్రికెటర్ సోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సానియా ఓ బిడ్డకు తల్లైంది. ప్రస్తుతం తన బిడ్డ ఆలనాపాలనా చూస్తోన్న సానియా మరోవైపు తన టెన్నిస్ అకాడమీని కూడా పర్యవేక్షిస్తోంది. ఇటీవలే కరోనా బారిన పడిన సానియా.. ఆ వైరస్ ను జయించింది. కరోనా ఎఫెక్ట్ తర్వాత తిరిగి టెన్నిస్ లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది సానియా మీర్జా.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Instagram, Sania Mirza, Tennis

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు