హోమ్ /వార్తలు /క్రీడలు /

Maria Sharapova : మగబిడ్డకు జన్మనిచ్చిన టెన్నిస్ క్వీన్ మరియా షరపోవా.. రివార్డింగ్ గిఫ్ట్ అంటూ..

Maria Sharapova : మగబిడ్డకు జన్మనిచ్చిన టెన్నిస్ క్వీన్ మరియా షరపోవా.. రివార్డింగ్ గిఫ్ట్ అంటూ..

కొడుకు, భర్తతో షరపోవా

కొడుకు, భర్తతో షరపోవా

మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా (Maria Sharapova) మగబిడ్డకు జన్మనిచ్చింది. కాబోయే భర్త, బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త అలెగ్జాండర్‌ గిల్కెస్‌తో తనకు కొడుకు జన్మించినట్లు ప్రకటించింది.

ఆడటం మానేసి చాలా ఏళ్లయింది.. కానీ ఆమె పట్ల ప్రపంచానికి ఉన్న అభిమానం మాత్రం తరగనిది! మాజీ క్రీడాకారిణి ఎవర్ గ్రీన్ టెన్నిస్ క్వీన్ మరియా షరపోవా (Maria Sharapova) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించింది. తొలికాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రెండు నెలల కిందట 35వ పుట్టినరోజున ప్రెగ్నెన్సీ ప్రకటన చేసిన ఆమె ఇవాళ కొడుకు, కాబోయే భర్తతో దిగిన ఫొటోను షేర్ చేసింది..

ప్రపంచ నంబర్ వన్ మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా మగబిడ్డకు జన్మనిచ్చింది. కాబోయే భర్త, బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త అలెగ్జాండర్‌ గిల్కెస్‌తో తనకు కొడుకు జన్మించినట్లు ప్రకటించింది. చిన్నారి థియోడర్ ఫొటోతో సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది.

TRS vs BJP : తిరిగి టీఆర్ఎస్‌లోకి ఈటల రాజేందర్? -కేటీఆర్ స్పందన -కేసీఆర్ మరో రికార్డు!


రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో షరపోవా ప్రెగ్నెన్సీ ప్రకటన చేసింది. శుక్రవారం జన్మించిన కొడుక్కి థియోడర్ అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. ‘మా చిన్న కుటుంబానికి రివార్డింగ్ గిఫ్ట్’ అంటూ షరపోవా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.


India Population : అత్యధిక జనాభా గల దేశంగా భారత్.. కొద్ది రోజుల్లోనే చైనాను దాటేస్తున్నాం..


హోలాజిక్ డబ్ల్యూటీఏ టూర్‌లో 36 కెరీర్ సింగిల్స్ టైటిల్స్‌తో కూడిన కెరీర్‌తో షరపోవా 2020 ఫిబ్రవరిలో ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యింది. కెరీర్‌లో గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేసిన క్రీడాకారిణి షరపోవా. షరపోవా రెండుసార్లు రోలాండ్ గారోస్ ఛాంపియన్. ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్,యూఎస్ ఓపెన్ గెలిచింది.

Published by:Madhu Kota
First published:

Tags: Russia, Tennis

ఉత్తమ కథలు