ఆమె ఆడటం మానేసి చాలా ఏళ్లయింది. కానీ ఆమె పట్ల ప్రపంచానికి ఉన్న అభిమానం మాత్రం తరగనిది. మాజీ క్రీడాకారిణి ఎవర్ గ్రీన్ టెన్నిస్ క్వీన్ మారియా షరపోవా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించింది. తాను తల్లి కాబోతున్నట్లు సంతోషంగా చెప్పుకుంది. సరిగ్గా 35వ పుట్టినరోజునాడే ఆమె ప్రకటన చేయడం గమనార్హం..
రష్యా మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, కోర్టులో లేకున్నా టెన్నిస్ క్వీన్ గా మన్ననలందుకునే మారియా షరపోవా తన అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. త్వరలోనే తాను తల్లికాబోతున్నట్లు తెలిపారు.‘అమూల్యమైన సరికొత్త ఆరంభాలు!!’ అంటూ తాను గర్భవతినన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారామె.
బేబీ బంప్ తో బీచ్‌లో నిల్చుని ఉన్న ఫొటోను షేర్ చేసిన మారియా షరపోవా.. తల్లి కాబోతున్న అనుభూతులను పదిలం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వివాదాస్పద మలుపులతో టెన్నిస్ కెరీర్ ముగించిన మారియా.. బ్రిటిష్ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గీక్స్ తో కలుసుంటోంది. వీరికి 2018లోనే ఎంగేజ్మెంట్ అయినట్లు ఆలస్యంగా వెల్లడైంది. అలెగ్జాండర్ బ్రిటన్ రాజకుటుంబానికి దగ్గరి బంధువు.
కాగా తన కెరీర్లో ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన షరపోవా.. 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ‘మరో ఉన్నత శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యాను. విభిన్నమైన మైదానంలో పోటీపడబోతున్నాను. టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నా’అంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక షరపోవా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్‌తో ఆమె రిలేషన్షిప్లో ఉన్నారు. ఇక వీరిద్దరు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.