హోమ్ /వార్తలు /క్రీడలు /

Roger Federer Retirement : టెన్నిస్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. ఆటకు వీడ్కోలు పలికిన స్విస్ సూపర్ స్టార్ ఫెడరర్

Roger Federer Retirement : టెన్నిస్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. ఆటకు వీడ్కోలు పలికిన స్విస్ సూపర్ స్టార్ ఫెడరర్

PC : TWITTER/ATP Tour

PC : TWITTER/ATP Tour

Roger Federer Retirement : టెన్నిస్ (Tennis) అభిమానులకు భారీ షాకింగ్ న్యూస్.. టెన్నిస్ దిగ్గజం స్విస్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్ (Roger Federer) టెన్నిస్ కు వీడ్కోలు పలికాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Roger Federer Retirement : టెన్నిస్ (Tennis) అభిమానులకు భారీ షాకింగ్ న్యూస్.. టెన్నిస్ దిగ్గజం స్విస్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్ (Roger Federer) టెన్నిస్ కు వీడ్కోలు పలికాడు. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెడరర్..  వచ్చే వారం ఆరంభమయ్యే లేవర్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ (Rod Laver Cup) తన కెరీర్ లో చివరి టెన్నిస్ టోర్నమెంట్ అంటూ ఫెడరర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నాడు. ఫెడరర్ కు ప్రస్తుతం 41 ఏళ్లు. చివరిసారిగా ఫెడరర్ గతేడాది జరిగిన వింబుల్డన్ ()లో పాల్గొన్నాడు. క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న అతడు అక్కడ హ్యుబర్ట్ హర్కాజ్ చేతిలో ఓడిపోయాడు. గత కొంతకాలంగా ఫెడరర్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పటికే రెండు సార్లు సర్జరీ కూడా చేయించుకున్నాడు. అయితే వయో భారం అతడి ఆటపై ప్రభావం చూపింది.

రికార్డుల కింగ్

1998 ఏళ్ల వయసులో ప్రొఫెషినల్ టెన్నిస్ కెరీర్ ను ఆరంభించిన ఫెడరర్.. తొలి గ్రాండ్ స్లామ్ ను 21 ఏళ్ల వయసులో 2003లో గెలుచుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన వింబుల్డన్ కోటాలో తన జెండా ఎగరవేశాడు. ఇక అక్కడి నుంచి ఫెడరర్ కెరీర్ దూసుకువెళ్లింది. అప్పటి వరకు నంబర్ వన్ గా ఉన్న పీట్ సంప్రాస్ ను వెనక్కి నెట్టి నయా నంబర్ వన్ గా అవతరించాడు. చూస్తుండగానే 14వ గ్రాండ్ స్లామ్ ను సాధించి.. పీట్ సంప్రాస్ అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేశాడు. కొంత విరామం తర్వాత 15వ టైటిల్ నెగ్గి పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన ప్లేయర్ గా అవతరించాడు. అంతేకాకుండా 2018 వింబుల్డన్ ను నెగ్గి 20వ టైటిల్ నెగ్గిన తొలి పురుషు ప్లేయర్ గా నిలిచాడు. ప్రస్తుతం నాదల్ 22 టైటిల్స్ తో తొలి స్థానంలో ఉండగా.. నొవాక్ జొకోవిచ్ 21 టైటిల్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఫెడరర్ మూడో స్థానంలో ఉన్నాడు.

ఫెడరర్ 310 వారాల పాటు నంబర్ వన్ ర్యాంకులో ఉండటం విశేషం.  ఇందులో వరుసగా 237 వారాల పాటు ఫెడరర్ నంబర్ వన్ గా ఉండటం విశేషం. 2004 నుంచి 2008 మధ్య ఫెడరర్ ఈ రికార్డును నెలకొల్పాడు. ఇది ఇప్పటికీ రికార్డుగానే ఉండటం విశేషం. ఫెడరర్ వింబుల్డన్ ను అత్యధికంగా 8 సార్లు నెగ్గాడు. వింబుల్డన్ ను అత్యధిక సార్లు నెగ్గిన ప్లేయర్ గా ఫెడరర్ ఉండటం విశేషం. ఓవరాల్ గా ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ను 6 సార్లు, ఫ్రెంచ్ ఓపెన్ ను 1సారి, వింబుల్డన్ ను 8 సార్లు, యూఎస్ ఓపెన్ ఐదు సార్లు (టోటల్ 20) గెలుచుకున్నాడు.

First published:

Tags: Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Serena Williams, Tennis

ఉత్తమ కథలు