Home /News /sports /

TENNIS ACE SANIA MIRZA CONDUCTS MASTERCLASS ON FITNESS AND YOGA FOR 8 LAKH STUDENTS AT LEAD POWERED SCHOOLS JNK

Sania Mirza: 8 లక్షల మంది విద్యార్థులకు ఫిట్‌నెస్ పాఠాలు చెప్పిన సానియా మీర్జా.. 'లీడ్' ఆధ్వర్యంలో ఓకేసారి కార్యక్రమం

8 లక్షల మంది విద్యార్థులకు  ఒకేసారి ఫిట్‌నెస్ అండ్ యోగా పాఠాలు చెప్పిన సానియా మీర్జా

8 లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి ఫిట్‌నెస్ అండ్ యోగా పాఠాలు చెప్పిన సానియా మీర్జా

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఓకే రోజు దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్ష మంది విద్యార్థులతో వర్చువల్ విధానంలో మాట్లాడారు. విద్యార్థులక చదువుతో పాటు శారీరిక, మానసిక ధృఢత్వం అవసరం అని ఆమె పేర్కొన్నారు.

    ఇండియన్ టెన్నిస్ (Indian Tennis Star) స్టార్ సానియా మీర్జా (Sania Mirza) ఒకేసారి 8 లక్షల మంది స్కూల్ విద్యార్థులకు (Students) ఫిట్‌నెస్ పాఠాలు (Fitness Class) చెప్పి రికార్డు సృష్టించింది. ఎడ్‌టెక్ (EdTech)లో లీడ్ సంస్థ (Lead) కే-12  (K-12)సెగ్మెంట్ (1 నుంచి 12 తరగతుల వరకు) అగ్రగామిగా ఉన్న సంస్థ. ఈ సంస్థలో దేశవ్యాప్తంగా చదువుకుంటున్న విద్యార్థులకు ఒక రోజు ఫిట్‌నెస్ తరగతులను నిర్వహించారు. భారత స్టార్ అథ్లెట్ సానియా మీర్జా ఆరోగ్య పరిరక్షణ, దేహధారుడ్యం, యోగాకు సంబంధించిన విషయాలను విద్యార్థులకు వివరించారు. మన జీవితంలో వచ్చే చిన్నపాటి శారీరిక, మానసిక కష్టాలను ఎదుర్కోవడానికి వ్యాయామం ఎంత ముఖ్యమో వివరించారు. మాస్టర్‌క్లాస్‌తో కలసి లీడ్ సంస్థ విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలను మొదలు పెట్టింది. ముఖ్యంగా విద్యార్థులకు అన్ని రంగాల్లో అవగాహన కల్పించి వారిని అభివృద్ది పథంలో నడిపించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగానే గతంలో విద్యార్థులకు 'సృజనాత్మక రచన'లో కూడా శిక్షణ ఇప్పించింది. ఆ కార్యక్రమానికి ప్రముఖ రచయిత 'చేతన్ భగత్' నేతృత్వం వహించారు.

    మాస్టర్‌క్లాస్ ఇదే స్పూర్తితో 'ఫిట్‌నెస్ అండ్ యోగా' కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రయత్నించింది. సానియా మీర్జా చేసిన కార్యక్రమం ద్వారా విద్యార్థుల మనసులో దాగున్న విషయాలను తెలుసుకోవడంతో పాటు వారి కలలను సాకారం చేసుకునే దిశలో స్పూర్తిని తీసుకొని రావడం ముఖ్యం' అని మాస్టర్‌క్లాస్ తెలిపింది.

    టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విద్యార్థులతోనే కాకుండా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడింది. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలలో తల్లుల పాత్ర ఎంత ముఖ్యమో కూడా వివరించింది. ఈ కరోనా పాండమిక్ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను గురించి ఆమె వివరించింది.

    '' మనం కనిన కలలకు అడ్డుగా ఈ ఏడాది ఆటంకాలు ఏర్పడ్డాయి. నిజానికి ఇలాంటి మహమ్మారి మన జీవితంలో రాకూడదు. కానీ వచ్చింది కాబట్టి మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఫిట్‌నెస్ అండ్ యోగా అనేది పిల్లల జీవితంలో కూడా భాగస్వామ్యం కావల్సిన అవసరం ఉన్నది. మానసికంగా, శారీరికంగా తగిన విధంగా ఎదగడానికి ఇదే సరైన సమయం. ఆరోగ్యకరమైన శరీరం, మనసు వల్ల ప్రతీ ఒక్కరు ఎదగడానికి దోహదపడుతున్నది. ఇలాంటి వాతావరణం విద్యార్థులకు ఏర్పరవలసి ఉన్నది'' అని సానియా మీర్జా చెప్పింది.

    లీడ్ కో-ఫౌండర్, సీఈవో సుమీత్ మెహతా మాట్లాడుతూ.. 'మాస్టర్‌క్లాస్ సంస్థ ప్రపంచ స్థాయి విద్యావిధానాన్ని చిన్న పట్టణాకు అందించడానికి ప్రయత్నిస్తున్నది. ప్రతీ చిన్నారికి సరైన విద్యను వారి తల్లిదండ్రులకు అనుకూలమైన ఖర్చులో అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. చేతన్ భగత్, సానియా మీర్జా వంటి సెలెబ్రిటీలతో నేరుగా ఇంటరాక్ట్ అవడానికి ఇంత తక్కువ ఖర్చుతో ఏ పాఠశాల విద్యార్థులకు అకాశం వస్తుంది. లీడ్ మాత్రమే ఇలాంటి అవకాశాలను అందరికీ అందిస్తున్నది. మేము చిన్న పట్టణాలలో ఉండే విద్యార్థులలో కూడా టాలెంటెడ్ స్టుడెంట్స్ ఉన్నారని నమ్మి మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టాము.' అని ఆయన అన్నారు.

    లీడ్ ఆధ్వర్యంలోని 'మాస్టర్‌క్లాస్' విద్యార్థులకు అనేకమైన విషయాల్లో శిక్షణ ఇస్తున్నది. సెలెబ్రిటీలతో క్లాసులు నిర్వహిస్తూ వారిని వివిధ కార్యక్రమాల వైపు నడిపిస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Sania Mirza, Tennis, Yoga

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు