• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • TENDULKAR IDEA TO PROMOTE ME AS BATSMAN NOT GREG CHAPPELL IRFAN PATHAN

సచిన్ సలహాతోనే అలా బ్యాటింగ్ చేశా! : పఠాన్

సచిన్ సలహాతోనే అలా బ్యాటింగ్ చేశా! : పఠాన్

ఇర్ఫాన్ పఠాన్

  • Last Updated:
  • Share this:
తను టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ప్రమోట్‌ కావడానికి కారణం సచిన్‌ తెందూల్కర్‌ అని ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పష్టంచేశాడు. ఈ మార్పులో మాజీ కోచ్‌ గ్రేగ్‌ ఛాపెల్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తాజాగా ‘బియాండ్‌ ది ఫీల్డ్’ అనే కార్యక్రమంలో పాల్గోన్న పఠాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2005లో శ్రీలంక,భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సచిన్ సలహా మేరకు తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పైకి తీసుకువచ్చారని వివరించారు. అవిధంగా తను టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేశానని చెప్పాడు. అలాగే తన కేరీర్ అర్ధంతరంగా అగిపోవడానికి కారణం ఛాపెల్ కారణం కాదంటూ
పలు విషయాలను వెల్లడించారు. రు.

" నేను లోయర్ ఆర్డర్ నుంచి వన్‌డౌన్‌‌లో బ్యాటింగ్ చేయడానికి కారణం సచిన్‌.. అప్పటి కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడే. వారి సలహాతోనే 2005లో శ్రీలంక సిరీస్‌లో తొలి వన్డేలో టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగాను. అలాగే నా కేరీర్ మిగిసిపోడానికి ఛాపెల్‌ కారణం కాదు. కొందరు అతనిపై అనవసరంగా నిందలు వెస్తున్నారంటూ" తెలిపారు

జట్టు యాజమాన్యం తన పట్ల సరిగ్గా వ్యవహరించలేదనే విషయాన్ని పఠాన్ పలు ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. తనను కావాలనే వారు పక్కకు పెట్టారని ,న్యూజిలాండ్‌ పర్యటనకు తీసుకెళ్లినా తనను ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించకపోవడం తనను బాధపెట్టిందన్నారు. ఆ తర్వాత తను పూర్తిగా జట్టు నుంచి దూరం చేశరంటూ వాపోయారు.
First published:

అగ్ర కథనాలు