Telugu Titans Vs UP Yoddha : మారని ఆటతీరు.. టైటాన్స్ కు మరో ఓటమి.. యూపీ సూపర్ విక్టరీ..

Telugu Titans Vs UP Yoddha : మళ్లీ అదే ఫలితం.. తెలుగు టైటాన్స్ మరో మ్యాచులో ఓటమి పాలైంది. సెకండాఫ్ ఆఖర్లో యూపీ యోధకు సరియైన పోటీ ఇచ్చింది తెలుగు టైటాన్స్. కానీ, కీలక సమయంలో తప్పిదాలు చేసి మ్యాచు ను చేజార్చుకుంది. దీంతో 39 - 33 పాయింట్లతో యూపీ యోధ మ్యాచును కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ కుమార్ వల్లే తెలుగు టైటాన్స్ ఓడిపోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు, రైడింగ్, ఇటు డిఫెన్స్ లో పూర్తి గా నిరాశపర్చాడు. ఇక, డుబ్కీ కింగ్ పరదీప్ నర్వాల్ ఆఖర్లో మ్యాజిక్ చేసి యూపీ యోధను గెలిపించాడు. ఈ మ్యాచులో సూపర్ -10 తో మెరిశాడు ఈ స్టార్ రైడర్.

  • News18 Telugu
  • | January 15, 2022, 21:47 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 4 MONTHS AGO

    AUTO-REFRESH

    Highlights

    21:48 (IST)
    21:44 (IST)

    మళ్లీ అదే ఫలితం.. తెలుగు టైటాన్స్ మరో మ్యాచులో ఓటమి పాలైంది. సెకండాఫ్ ఆఖర్లో యూపీ యోధకు సరియైన పోటీ ఇచ్చింది తెలుగు టైటాన్స్. కానీ, కీలక సమయంలో తప్పిదాలు చేసి మ్యాచు ను చేజార్చుకుంది.  దీంతో 39 - 33 పాయింట్లతో యూపీ యోధ మ్యాచును కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ కుమార్ వల్లే తెలుగు టైటాన్స్ ఓడిపోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు, రైడింగ్, ఇటు డిఫెన్స్ లో పూర్తి గా నిరాశపర్చాడు. ఇక, డుబ్కీ కింగ్ పరదీప్ నర్వాల్ ఆఖర్లో మ్యాజిక్ చేసి యూపీ యోధను గెలిపించాడు. ఈ మ్యాచులో సూపర్ -10 తో మెరిశాడు ఈ స్టార్ రైడర్.

    21:30 (IST)

    మ్యాచులో తెలుగు టైటాన్స్ కమ్ బ్యాక్ ఇస్తోంది. ప్రస్తుతం 28-26 పాయింట్లతో యూపీ యోధ ఆధిక్యంలో ఉంది. 

    21:27 (IST)
    21:22 (IST)

    ప్రస్తుతం 27-20 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది యూపీ యోధ. డిఫెన్స్ లో మళ్లీ అవే తప్పిదాలు చేస్తూ మ్యాచ్ పై పట్టు కోల్పోతుంది తెలుగు టైటాన్స్. 

    21:20 (IST)

    తెలుగు టైటాన్స్ లో రజనీశ్ దలాల్ మరోసారి అదరగొడుతున్నారు. 9 పాయింట్లతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఈ యంగ్ టాలెంటెడ్ రైడర్.  

    21:17 (IST)

    ప్రస్తుతం 21-16 పాయింట్ల తేడాతో యూపీ యోధ లీడింగ్ లో ఉంది. 

    21:8 (IST)
    21:6 (IST)

    ఫస్టాఫ్ లో రెండు జట్లు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డాయ్. అయితే, కీలక సమయంలో తెలుగు టైటాన్స్ డిఫెన్స్, రైడింగ్ లో తప్పిదాల వల్ల ఫస్టాఫ్ ముగిసే ఆధిక్యంలో ఉండే ఛాన్స్ ను కోల్పోయింది. దీంతో తొలి సగం ముగిసే సమయానికి యూపీ యోధ 19-14  పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. యూపీలో సురీందర్, పరదీప్ నర్వాల్ ఫర్వాలేదనిపిస్తున్నారు. తెలుగు టైటాన్స్ లో రజనీశ్ దలాల్ తన ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. 

    20:59 (IST)

    ఫస్టాఫ్ లో తెలుగు టైటాన్స్ ఆలౌట్ అయింది. దీంతో యూపీ యోధ 13-10 పాయింట్లతో లీడ్ లోకి వెళ్లింది.

    ప్రొ క‌బ‌డ్డీ లీగ్ (PKL 8 Season) రోజు రోజుకి అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. క‌రోనా కార‌ణంగా దాదాపు రెండేళ్ల‌పాటు దూర‌మైన లీగ్.. ఆ లోటును భ‌ర్తీ చేస్తూ అభిమానుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ బెంగళూరు వేదికగా జరుగుతోంది. కరోనా నిబంధనల నడుమ జరుగుతున్న ఈ లీగ్ లో ప్రతి జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాడుతున్నాయ్. గెలుపు దక్కించుకోవడం కోసం తగ్గేదే లే అన్నట్టుగా తాడో పేడో తేల్చుకుంటున్నాయ్. కానీ, ప్రొ క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 8 మాత్రం తెలుగు టైటాన్స్‌కు పెద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు స‌గం టోర్నీ ముగియ‌గా టైటాన్స్ ఇంకా ఒక్క విజ‌యం కూడా న‌మోదు చేయ‌లేక‌పోయింది. దీనికి తోడు మొద‌టి నుంచి కూడా టైటాన్స్‌ను దుర‌దృష్టం వెంటాడుతుంది. ఓడిన అన్ని మ్యాచ్‌ల్లో విజ‌యానికి చేరువ‌గా వ‌చ్చి ఓడిపోవడం టైటాన్స్‌ను క‌ల‌వ‌రప‌రుస్తోంది. దీంతో ఈ సీజ‌న్‌లో తొలి విజ‌యం కోసం టైటాన్స్‌కు మ‌రింత‌ నిరీక్ష‌ణ త‌ప్ప‌డం లేదు. ఈ నేపథ్యంలో ఒక్క గెలుపు కోసం యూపీ యోధా తో అమీతుమీ(Telugu Titans Vs UP Yoddha) తేల్చుకోనుంది తెలుగు టైటాన్స్.

    ఇప్ప‌టివ‌ర‌కు ప్రొ క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 8లో తెలుగు టైటాన్స్ 7 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో క‌నీసం ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్‌లో కూడా విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఏకంగా 5 మ్యాచ్‌ల్లో ఓడింది. రెండు మ్యాచ్‌ల‌ను టైగా ముగించింది. అయితే ఓడినా 4 మ్యాచ్‌ల‌తోపాటు టైగా ముగిసిన రెండు మ్యాచ్‌ల్లో విజ‌య‌వకాశాలు టైటాన్సే వైపే ఉన్న‌ప్ప‌టికీ చివ‌ర్లో తొంద‌ర‌పాటుతో చేసిన త‌ప్పుల‌తో టైటాన్స్ మూల్యం చెల్లించుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు విజ‌యం అంద‌ని ద్రాక్ష‌గా మారింది. దీంతో తెలుగు టైటాన్స్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఒక్క విజ‌యాన్ని కూడా న‌మోదు చేయ‌లేక‌పోయిన తెలుగు టైటాన్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగున 12వ స్థానంలో ఉంది. టైటాన్స్ ఖాతాలో కేవ‌లం 10 పాయింట్లు ఉన్నాయి.

    2018 (ఆరో సీజన్)లో బెంగళూరు బుల్స్‌ని విజేతగా నిలిపిన రోహిత్ కుమార్‌ని జట్టులోకి తీసుకున్న తెలుగు టైటాన్స్.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. అయితే, ఈ సీజన్ లో రోహిత్ కుమార్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రైడింగ్ లో పూర్తిగా డిఫెన్స్ లోకి పోతున్నాడు. ఇప్పటివరుకు సరియైన రైడింగ్ పాయింట్లు ఈ సీజన్ లో సాధించలేదు.అలానే మెరుగైన డిఫెండర్లుగా కితాబులు అందుకున్న సందీప్, సురీందర్, అరుణ్‌ని జట్టులో కీ ప్లేయర్లు.

    ప్రొ కబడ్డీ లీగ్ బాహుబలిగా పేరొందిన సిద్ధార్థ్ దేశాయ్‌ గాయంతో.. గత ఐదు మ్యాచుల నుంచి జట్టుకు దూరయ్యాడు. కెప్టెన్ రోహిత్ కుమార్ ఫామ్ అందుకోవాల్సిన సమయం వచ్చింది. కీలక సమయాల్లో డిఫెన్స్ లో తప్పిదాలు చేసి మ్యాచ్ ను చేజార్చుకుంటోంది తెలుగు టైటాన్స్. ఈ తప్పులు సరిచేసుకుంటే.. తొలి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. యంగ్ రైడర్ అంకిత్ బెన్వాల్, రజనీశ్ దలాల్ తమ ఫామ్ ను కంటిన్యూ చేయాల్సి ఉంది.

    మరోవైపు, యూపీ యోధ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి.. నాలుగింట్లో ఓడిపోయింది. మరో మూడు మ్యాచులు డ్రా అయ్యాయ్. దీంతో, 23 పాయింట్లతో పాయింట్ల టేబుల్ లో ఏడో స్థానంలో ఉంది. యూపీలో పరదీప్ నర్వాల్ వంటి స్టార్ రైడర్ ఉన్నాడు. అయితే, ఈ సీజన్ లో డుబ్కీ కింగ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. మరో రైడర్ సురీందర్ గిల్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. అయితే, డిఫెన్స్ లో యూపీ యోధ స్ట్రాంగ్ గా కన్పిస్తోంది. నితేష్ కుమార్, సుమిత్ సంగ్వాన్ వంటి స్ట్రాంగ్ డిఫెండర్లు యూపీ యోధ సొంతం.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    హెడ్ టు హెడ్ రికార్డుల్లో తెలుగు టైటాన్స్ పై యూపీ యోధ బెస్ట్ ప్రదర్శన చేసింది. ఇరు జట్లు 8 సార్లు తలపడగా.. 4సార్లు గుజరాత్ గెలవగా.. కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే టైటాన్స్ నెగ్గింది. మరో రెండు మ్యాచులు టై అయ్యాయ్.

    ఆడే ఏడుగురి ప్లేయర్ల అంచనా:

    తెలుగు టైటాన్స్ : రజనీశ్ దలాల్ , అంకిత్ బెన్వాల్, ఆదర్శ్ టి, సి అరుణ్, మహ్మద్ సిహాస్, ఆకాష్ చౌదరి, సురీందర్ సింగ్

    యూపీ యోధ : పరదీప్ నర్వాల్, సురీందర్ గిల్, శ్రీకాంత్ జాదవ్, శుభమ్ కుమార్ బలియాన్, అసు సింగ్, సుమిత్ సంగ్వాన్, నితేష్ కుమార్

    పూర్తి స్క్వాడ్స్ :

    తెలుగు టైటాన్స్ జట్టు:

    రైడర్స్: అమిత్ చౌహాన్, అంకిత్ బేనివాల్, గల్లా రాజు, హ్యున్సూ పార్క్, రజినీశ్, రాకేశ్ గౌడ, రోహిత్ కుమార్, సిద్దార్థ్ దేశాయ్

    డిఫెండర్స్: ఆకాశ్ దత్తు అర్సుల్, ఆకాశ్ చౌదరి, మనీశ్, ఆదర్శ్ టి, సి. అరుణ్, ప్రిన్స్ డి, రుతురాజ్ కొరవి, సురీందర్ సింగ్, ఎస్తురో అబే, సందీప్ కండోలా

    యూపీ యోధ:

    రైడర్స్: అంకిత్, గుల్వీర్ సింగ్, జేమ్స్ నమాబా కమ్వేటి, మొహమ్మద్ తఘి, ప్రదీప్ నర్వాల్, సాహిల్, శ్రీకాంత్ జాదవ్, సురీందర్ గిల్,

    డిఫెండర్ : ఆషు సింగ్, ఆశిష్ నగార్, నితేశ్ కుమార్, గౌరవ్ కుమార్, సుమిత్

    ఆల్ రౌండర్స్: గుర్దీప్, నితిన్ పన్వార్