Telugu Titans Vs U Mumba : మరోసారి చేతులేత్తేసిన టైటాన్స్.. యూ ముంబా సూపర్ విక్టరీ..

Telugu Titans Vs U Mumba : ఈ సీజన్ లో మరోసారి నిరాశపర్చింది తెలుగు టైటాన్స్. ఈ సారి డిఫెడింగ్ లో సత్తా చాటినా.. తెలుగు టైటాన్స్ రైడర్స్ మాత్రం నిరాశపర్చారు. అదే విధంగా కీలక సమయాల్లో వ్యూహత్మక పొరపాట్లు చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. ఫామ్ లో ఉన్న ఆదర్శ్ ని ఈ మ్యాచ్ లో సరిగ్గా వాడుకోలేదు. మరోవైపు.. యు ముంబాలో అభిషేక్ వర్మ రైడింగ్ లో అదరగొడితే.. కెప్టెన్ ఫజల్ అత్రాచలి డిఫెన్స్ లో రెచ్చిపోయాడు. రైడింగ్ లో అభిషేక్ సూపర్ -10తో ఆకట్టుకుంటే.. ఫజల్ సూపర్ హై ఫైవ్ తో దుమ్మురేపాడు. అభిషేక్ వర్మ 15 పాయింట్లతో తెలుగు టైటాన్స్ పై ఆధిపత్యం చెలాయించాడు. తెలుగు టైటాన్స్ లో ఆదర్శ్ టి ఒక్కడే రాణించాడు. సూపర్ 10 తో సత్తా చాటాడు ఆదర్శ్ టి. రజనీశ్ దలాల్ ఈ మ్యాచులో ఔట్ ఆఫ్ ఫామ్ లో కన్పించాడు. ఫలితంగా.. 42-35 పాయింట్ల తేడాతో ఈ మ్యాచును కైవసం చేసుకుంది యూ ముంబా.

  • News18 Telugu
  • | January 22, 2022, 21:52 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED A YEAR AGO

    AUTO-REFRESH

    Highlights

    21:54 (IST)
    21:50 (IST)

    ఈ సీజన్ లో మరోసారి నిరాశపర్చింది తెలుగు టైటాన్స్. ఈ సారి డిఫెడింగ్ లో సత్తా చాటినా.. తెలుగు టైటాన్స్ రైడర్స్ మాత్రం నిరాశపర్చారు. అదే విధంగా కీలక సమయాల్లో వ్యూహత్మక పొరపాట్లు చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. ఫామ్ లో ఉన్న ఆదర్శ్ ని ఈ మ్యాచ్ లో సరిగ్గా వాడుకోలేదు. మరోవైపు.. యు ముంబాలో అభిషేక్ వర్మ రైడింగ్ లో అదరగొడితే.. కెప్టెన్ ఫజల్ అత్రాచలి డిఫెన్స్ లో రెచ్చిపోయాడు. రైడింగ్ లో అభిషేక్ సూపర్ -10తో ఆకట్టుకుంటే.. ఫజల్ సూపర్ హై ఫైవ్ తో దుమ్మురేపాడు. అభిషేక్ వర్మ 15 పాయింట్లతో తెలుగు టైటాన్స్ పై ఆధిపత్యం చెలాయించాడు. తెలుగు టైటాన్స్ లో ఆదర్శ్ టి ఒక్కడే రాణించాడు. సూపర్ 10 తో సత్తా చాటాడు ఆదర్శ్ టి. రజనీశ్ దలాల్ ఈ మ్యాచులో ఔట్ ఆఫ్ ఫామ్ లో కన్పించాడు. ఫలితంగా.. 42-35  పాయింట్ల తేడాతో ఈ మ్యాచును కైవసం చేసుకుంది యూ ముంబా.

    21:41 (IST)

    ప్రస్తుతం 35-29 పాయింట్లతో ఆధిక్యంలో ఉంది యూ ముంబా.  

    21:32 (IST)
    21:29 (IST)

    ప్రస్తుతం 31-24 పాయింట్లతో ఆధిక్యంలో ఉంది యూ ముంబా.  

    21:25 (IST)

    ప్రస్తుతం 28-21 పాయింట్లతో ఆధిక్యంలో ఉంది యూ ముంబా. 

    21:20 (IST)

    ప్రస్తుతం 27-19 పాయింట్లతో లీడింగ్ లో ఉంది యూ ముంబా.  యూ ముంబా రైడర్ అభిషేక్ సింగ్ 8 పాయింట్లతో సత్తా చాటుతున్నాడు. 

    21:17 (IST)
    21:9 (IST)

     ప్రతి పాయింట్ కోసం రెండు జట్లు పోరాడుతున్నాయ్. అయితే, అటు రైడింగ్, ఇటు డిఫెన్స్ లో అదరగొడుతున్నారు యు ముంబా ఆటగాళ్లు. ఫస్టాఫ్ ఆఖర్లో తెలుగు టైటాన్స్ కొంచెం పోరాట పటిమను చూపించింది. ముఖ్యంగా ఆదర్శ్ టి.. ఒంటి చేత్తో ఆఖర్లో సూపర్ రైడ్ చేశాడు. దీంతో .. యూ ముంబా ఆధిక్యాన్ని తగ్గించింది తెలుగు టైటాన్స్. ఫస్టాఫ్ ముగిసే సమయానికి  17-23   పాయింట్ల తేడాతో ఆధిక్యంలో నిలిచింది ముంబై. 

    21:5 (IST)

    10-20 పాయింట్లతో లీడింగ్ లో కొనసాగుతోంది యూ ముంబా

    ప్రొ క‌బ‌డ్డీ లీగ్ (PKL 8 Season) రోజు రోజుకి అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. క‌రోనా కార‌ణంగా దాదాపు రెండేళ్ల‌పాటు దూర‌మైన లీగ్.. ఆ లోటును భ‌ర్తీ చేస్తూ అభిమానుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ బెంగళూరు వేదికగా జరుగుతోంది. కరోనా నిబంధనల నడుమ జరుగుతున్న ఈ లీగ్ లో ప్రతి జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాడుతున్నాయ్. గెలుపు దక్కించుకోవడం కోసం తగ్గేదే లే అన్నట్టుగా తాడో పేడో తేల్చుకుంటున్నాయ్. కానీ, ప్రొ క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 8 మాత్రం తెలుగు టైటాన్స్‌కు పెద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ దరిద్రం ప్రొకబడ్డీ లీగ్ టీమ్ తెలుగు టైటాన్స్‌కు పట్టుకున్నట్లుంది. సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో ఓడటం.. గెలిచిన మ్యాచ్‌లో ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ రేపడం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కు అలవాటు. సూపర్ ఓవర్‌కే సూపర్ ఓవర్ ఆడిన ఘనత కూడా ఆ జట్టుదే. ప్రొకబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. తెలుగు టైటాన్స్ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో దాదాపు అన్నీ ఇలా ఉత్కంఠగా ముగిసినవే. అయితే, ఈ సీజన్ లో గత మ్యాచులో తెలుగు టైటాన్స్ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు లీగ్‌లో టైటాన్స్ తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది.

    ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడిన‌ప్ప‌టికీ టైటాన్స్ జ‌ట్టు ఒక్క విజయాన్ని కూడా న‌మోదు చేయ‌లేక‌పోయింది. దీంతో తెలుగు టైటాన్స్ అభిమానులు తీవ్ర నిరాశ‌లో మునిగిపోయారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం జైపూర్ పింక్ పాంథ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టైటాన్స్ గెలిచి అభిమానులు ఊపిరి పీల్చుకునేలా చేసింది. అంతేకాకుండా ఈ సీజ‌న్‌లో తెలుగు టైటాన్స్ విజ‌యాల ఖాతా తెరిచింది. జైపూర్ పింక్ పాంథ‌ర్స్‌తో మ్యాచ్‌లో చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో విజ‌యం సాధించింది. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    ఇప్ప‌టివ‌ర‌కు ప్రొ క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 8లో తెలుగు టైటాన్స్ 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో కేవలం ఒక మ్యాచులో మాత్రమే గెలిచింది. ఏకంగా 8 మ్యాచ్‌ల్లో ఓడింది. రెండు మ్యాచ్‌ల‌ను టైగా ముగించింది. ప్రస్తుతం 17 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున నిలిచింది. గత మ్యాచులో గెలిచిన జోష్ ను మరోసారి కంటిన్యూ చేయాలని టైటాన్స్ భావిస్తోంది. దీంతో.. తెలుగు టైటాన్స్ .. యు ముంబా (Telugu Titans Vs U Mumba)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్ లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండో సారి. గత మ్యాచులో యు ముంబా 48-38 పాయింట్లతో తెలుగు టైటాన్స్ చిత్తు చేసింది. దీంతో, తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్ గెలిచి లెక్కసరిచేయాలని భావిస్తోంది.

    2018 (ఆరో సీజన్)లో బెంగళూరు బుల్స్‌ని విజేతగా నిలిపిన రోహిత్ కుమార్‌ని జట్టులోకి తీసుకున్న తెలుగు టైటాన్స్.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. అయితే, ఈ సీజన్ లో రోహిత్ కుమార్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రైడింగ్ లో పూర్తిగా డిఫెన్స్ లోకి పోతున్నాడు. అందుకే అతన్ని గత మ్యాచులో పక్కన పెట్టారు. అలానే మెరుగైన డిఫెండర్లుగా కితాబులు అందుకున్న సందీప్, సురీందర్, అరుణ్‌ని జట్టులో కీ ప్లేయర్లు. కానీ, వీళ్లు కూడా స్థాయికు తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నారు.

    ప్రొ కబడ్డీ లీగ్ బాహుబలిగా పేరొందిన సిద్ధార్థ్ దేశాయ్‌ గాయంతో.. జట్టుకు దూరయ్యాడు. కెప్టెన్ రోహిత్ కుమార్ ఫామ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కీలక సమయాల్లో డిఫెన్స్ లో తప్పిదాలు చేసి మ్యాచ్ ను చేజార్చుకుంటోంది తెలుగు టైటాన్స్. ఈ తప్పులు సరిచేసుకుంటే.. తొలి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. యంగ్ రైడర్ అంకిత్ బెన్వాల్, రజనీశ్ దలాల్ మంచి ఫామ్ లో ఉన్నారు. గత మ్యాచులో ఆదర్శ్ టి మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో.. మరోసారి ఈ ముగ్గురు రాణిస్తేనే తెలుగు టైటాన్స్ కు మరో విజయాన్ని దక్కించుకుంటోంది.

    మరోవైపు, యు ముంబా కూడా ఈ సీజన్ లో ఓ మోస్తరు ప్రదర్శన మాత్రమే చేసింది. ఆడిన 11 మ్యాచుల్లో మూడు గెలిచి.. మూడింటిలో ఓడిపోయింది. మరో ఐదు మ్యాచులు టైగా ముగిశాయ్. దీంతో, 31 పాయింట్లతో టేబుల్ లో తొమ్మిది స్ధానంలో నిలిచింది. యు ముంబాలో వి అజీత్ తన రైడ్స్ తో ప్రత్యర్ధుల్ని బెంబెలేత్తిస్తున్నాడు. అభిషేక్ సింగ్, మోహెషేన్ కూడా కీ ప్లేయర్లు. ఇక, డిఫెన్స్ లో యు ముంబా పటిష్టంగా ఉంది. కెప్టెన్ ఫజల్ అత్రాచలి, రింకులతో చాలా బలంగా ఉంది.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    హెడ్ టు హెడ్ రికార్డుల్లో తెలుగు టైటాన్స్ పై యు ముంబా బెస్ట్ ప్రదర్శన చేసింది. ఇరు జట్లు 13 సార్లు తలపడగా.. 7 సార్లు యు ముంబా గెలవగా.. కేవలం నాలుగు మ్యాచుల్లో తెలుగు టైటాన్స్ నెగ్గింది. మరో రెండు మ్యాచులు టై గా ముగిశాయ్.

    ఆడే ఏడుగురి ప్లేయర్ల అంచనా:

    తెలుగు టైటాన్స్ : రజనీశ్ దలాల్ , అంకిత్ బెన్వాల్, ఆదర్శ్ టి, ప్రిన్స్ డి , సురీందర్ సింగ్, సందీప్ ఖండోలా, ఆకాశ్ చౌదరి

    యు ముంబా : అభిషేక్ సింగ్ , వి అజిత్ , మోహషన్ మగ్ సుదులు , హరేందర్ కుమార్ , సునీల్ , ఫజల్ అత్రాచలి, రింకు

    పూర్తి స్క్వాడ్స్ :

    తెలుగు టైటాన్స్ జట్టు:

    రైడర్స్: అమిత్ చౌహాన్, అంకిత్ బేనివాల్, గల్లా రాజు, హ్యున్సూ పార్క్, రజినీశ్, రాకేశ్ గౌడ, రోహిత్ కుమార్, సిద్దార్థ్ దేశాయ్

    డిఫెండర్స్: ఆకాశ్ దత్తు అర్సుల్, ఆకాశ్ చౌదరి, మనీశ్, ఆదర్శ్ టి, సి. అరుణ్, ప్రిన్స్ డి, రుతురాజ్ కొరవి, సురీందర్ సింగ్, ఎస్తురో అబే, సందీప్ కండోలా

    యూ ముంబా:

    రైడర్స్: అభిషేక్ సింగ్, జషన్ దీప్ సింగ్, నవ్‌నీత్, రాహుల్ రాణా, అజిత్ కుమార్

    డిఫెండర్స్: హరీందర్ కుమార్, ఫజల్ అత్రాచలి, సునిల్ సిద్ధ్‌గవలి, రింకు హెచ్ సీ

    ఆల్ రౌండర్స్: అజింక్య కాప్రే, ఆశిష్ కుమార్, మోహ్‌సెన్ మగ్సోదులు, పంకజ్