Telugu Titans Vs Jaipur Pink Panthers : హమ్మయ్య.. ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ గెలిచారోచ్..

Telugu Titans Vs Jaipur Pink Panthers : హమ్మయ్య తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ కిదే తొలి విజయం. ఈ మ్యాచ్ లో ఆదర్శ్ టి అద్భుతంగా రాణించాడు. సెకండాఫ్ లో ఆదర్శ్ టి సింగిల్ హ్యాండెడ్ గా పోరాడాడు. 9 పాయింట్లతో దుమ్మురేపాడు ఆదర్శ్ టి. దీంతో 35-34 తేడాతో ఎట్టకేలకు గెలుపు రుచిని చూసింది టైటాన్స్. జైపూర్ పింక్ పాంథర్స్ లో అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లతో సత్తా చాటాడు.

  • News18 Telugu
  • | January 19, 2022, 21:50 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 4 MONTHS AGO

    AUTO-REFRESH

    Highlights

    21:46 (IST)

    హమ్మయ్య తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ కిదే తొలి విజయం. ఈ మ్యాచ్ లో ఆదర్శ్ టి అద్భుతంగా రాణించాడు. సెకండాఫ్ లో ఆదర్శ్ టి సింగిల్ హ్యాండెడ్ గా పోరాడాడు.  9 పాయింట్లతో దుమ్మురేపాడు ఆదర్శ్ టి. దీంతో 35-34 తేడాతో ఎట్టకేలకు గెలుపు రుచిని చూసింది టైటాన్స్.  జైపూర్ పింక్ పాంథర్స్ లో అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లతో సత్తా చాటాడు.

    21:33 (IST)

    ప్రతి పాయింట్ కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయ్. ప్రస్తుతం 28-27 తో ఒక పాయింట్ ఆధిక్యంలో ఉంది జైపూర్. 

    21:24 (IST)

    ప్రతి పాయింట్ కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయ్. ప్రస్తుతం 25-24 తో ఒక పాయింట్ ఆధిక్యంలో ఉంది జైపూర్. 

    21:16 (IST)

    ప్రస్తుతం 24-20 తో మళ్లీ లీడ్ లోకి వచ్చింది జైపూర్ పింక్ పాంథర్స్. 

    21:11 (IST)

    సెకండాఫ్ ప్రారంభమైన ఒక నిమిషంలోనే తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. ఈ మ్యాచులో జైపూర్ ని ఫస్ట్ టైం ఆలౌట్ చేసింది. దీంతో 20-20 తో స్కోరును సమం చేసింది.

    21:5 (IST)
    21:3 (IST)

    మళ్లీ అదే ఆట.. మళ్లీ అవే పొరపాట్లు.. ఫలితం ఫస్టాఫ్ ముగిసే సమయానికి భారీ లీడ్ లో నిలిచింది జైపూర్ పింక్ పాంథర్స్. అటు రైడింగ్.. ఇటు డిఫెడింగ్ రెండు విభాగాల్లో నిరాశపర్చింది తెలుగు టైటాన్స్. దీంతో.. ఫస్టాఫ్ లోనే ఆలౌట్ అయింది. ఫస్టాఫ్ ముగిసే సమయానికి 20-13  స్కోరుతో భారీ లీడ్ లో ఉంది జైపూర్ పింక్ పాంథర్స్.

    20:57 (IST)

    ఫస్టాఫ్ లో తెలుగు టైటాన్స్ ఆలౌట్ అయింది. దీంతో 16-8 స్కోరుతో భారీ ఆధిక్యంలో నిలిచింది జైపూర్ పింక్ పాంథర్స్. 

    20:53 (IST)

    జైపూర్ దూకుడుగా ఆడుతోంది. ప్రస్తుతం 11-5 పాయింట్లతో లీడింగ్ లో ఉంది పింక్ పాంథర్స్. 

    20:51 (IST)

    ప్రస్తుతం 8-5 పాయింట్లతో జైపూర్ ఆధిక్యంలో ఉంది. సూపర్ ఫామ్ లో ఉన్న రజనీశ్ దలాల్ ను కట్టడి చేస్తూ తెలుగు టైటాన్స్ పై ఒత్తిడి పెంచుతున్నారు పింక్ పాంథర్స్. 

    ప్రొ క‌బ‌డ్డీ లీగ్ (PKL 8 Season) రోజు రోజుకి అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. క‌రోనా కార‌ణంగా దాదాపు రెండేళ్ల‌పాటు దూర‌మైన లీగ్.. ఆ లోటును భ‌ర్తీ చేస్తూ అభిమానుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ బెంగళూరు వేదికగా జరుగుతోంది. కరోనా నిబంధనల నడుమ జరుగుతున్న ఈ లీగ్ లో ప్రతి జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాడుతున్నాయ్. గెలుపు దక్కించుకోవడం కోసం తగ్గేదే లే అన్నట్టుగా తాడో పేడో తేల్చుకుంటున్నాయ్. కానీ, ప్రొ క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 8 మాత్రం తెలుగు టైటాన్స్‌కు పెద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ దరిద్రం ప్రొకబడ్డీ లీగ్ టీమ్ తెలుగు టైటాన్స్‌కు పట్టుకున్నట్లుంది. సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో ఓడటం.. గెలిచిన మ్యాచ్‌లో ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ రేపడం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కు అలవాటు. సూపర్ ఓవర్‌కే సూపర్ ఓవర్ ఆడిన ఘనత కూడా ఆ జట్టుదే.

    ప్రొకబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. తెలుగు టైటాన్స్ ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో దాదాపు అన్నీ ఇలా ఉత్కంఠగా ముగిసినవే. ఇందులో రెండు మ్యాచ్‌లు టై అవ్వగా.. మరో 8 మ్యాచ్‌ల్లో ఓటమే ఎదురైంది. ఒక్క విజయం కూడా నమోదు చేయని తెలుగు టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జైపూర్ పింక్ పాంథర్స్ తో అమీతుమీ (Telugu Titans Vs Jaipur Pink Panthers) తేల్చుకోనుంది తెలుగు టైటాన్స్.

    ఇప్ప‌టివ‌ర‌కు ప్రొ క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 8లో తెలుగు టైటాన్స్ 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో క‌నీసం ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్‌లో కూడా విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఏకంగా 8 మ్యాచ్‌ల్లో ఓడింది. రెండు మ్యాచ్‌ల‌ను టైగా ముగించింది. అన్ని మ్యాచుల్లో దాదాపు విజ‌య‌వకాశాలు టైటాన్సే వైపే ఉన్న‌ప్ప‌టికీ చివ‌ర్లో తొంద‌ర‌పాటుతో చేసిన త‌ప్పుల‌తో టైటాన్స్ మూల్యం చెల్లించుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు విజ‌యం అంద‌ని ద్రాక్ష‌గా మారింది. దీంతో తెలుగు టైటాన్స్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒక్క విజ‌యాన్ని కూడా న‌మోదు చేయ‌లేక‌పోయిన తెలుగు టైటాన్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగున 12వ స్థానంలో ఉంది. టైటాన్స్ ఖాతాలో కేవ‌లం 12 పాయింట్లు ఉన్నాయి.

    2018 (ఆరో సీజన్)లో బెంగళూరు బుల్స్‌ని విజేతగా నిలిపిన రోహిత్ కుమార్‌ని జట్టులోకి తీసుకున్న తెలుగు టైటాన్స్.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. అయితే, ఈ సీజన్ లో రోహిత్ కుమార్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రైడింగ్ లో పూర్తిగా డిఫెన్స్ లోకి పోతున్నాడు. అందుకే అతన్ని గత మ్యాచులో పక్కన పెట్టారు. అలానే మెరుగైన డిఫెండర్లుగా కితాబులు అందుకున్న సందీప్, సురీందర్, అరుణ్‌ని జట్టులో కీ ప్లేయర్లు. కానీ, వీళ్లు కూడా స్థాయికు తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నారు.

    ప్రొ కబడ్డీ లీగ్ బాహుబలిగా పేరొందిన సిద్ధార్థ్ దేశాయ్‌ గాయంతో.. జట్టుకు దూరయ్యాడు. కెప్టెన్ రోహిత్ కుమార్ ఫామ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కీలక సమయాల్లో డిఫెన్స్ లో తప్పిదాలు చేసి మ్యాచ్ ను చేజార్చుకుంటోంది తెలుగు టైటాన్స్. ఈ తప్పులు సరిచేసుకుంటే.. తొలి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. యంగ్ రైడర్ అంకిత్ బెన్వాల్, రజనీశ్ దలాల్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ ఇద్దరూ తప్ప మిగతా వారు అంతగా రాణించడం లేదు.

    మరోవైపు, జైపూర్ పింక్ పాంథర్స్ ఈ సీజన్ లో మంచి ప్రదర్శన చేసింది. ఆడిన 10 మ్యాచుల్లో ఐదింట్లో గెలిచి.. నాలుగు ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా ముగించింది. ప్రస్తుతం 31 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. దీపక్ నివాస్ హుడా లాంటి టాప్ ప్లేయర్ పింక్ పాంథర్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. దీపక్ తో పాటు అమిత్ నగర్, సందీప్ దుల్, నితిన్ రావల్ కీ ప్లేయర్లు.

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    హెడ్ టు హెడ్ రికార్డుల్లో జైపూర్ పింక్ పాంథర్స్ పై తెలుగు టైటాన్స్ కు మెరుగైన రికార్డు ఉంది. ఇరు జట్లు 13 సార్లు తలపడగా.. 7 సార్లు తెలుగు టైటాన్స్ గెలవగా.. 5 మ్యాచుల్లో పింక్ పాంథర్స్ నెగ్గింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. టైటాన్స్ తమ మెరుగైన రికార్డు కంటిన్యూ చేస్తే ఈ సీజన్ లో తొలి విజయం సాధించవచ్చు.

    ఆడే ఏడుగురి ప్లేయర్ల అంచనా:

    తెలుగు టైటాన్స్ : రజనీశ్ దలాల్ , అంకిత్ బెన్వాల్, రాజు గల్ల, ప్రిన్స్ డి , సురీందర్ సింగ్, సందీప్ ఖండోలా, ఆకాశ్ చౌదరి

    జైపూర్ పింక్ పాంథర్స్ : దీపక్ నివాస్ హుడా, అర్జున్ దేశ్వాల్, అమిత్ నగర్, శాహుల్ కుమార్, సందీప్ దుల్, నితిన్ రావల్, అమిత్

    పూర్తి స్క్వాడ్స్ :

    తెలుగు టైటాన్స్ జట్టు:

    రైడర్స్: అమిత్ చౌహాన్, అంకిత్ బేనివాల్, గల్లా రాజు, హ్యున్సూ పార్క్, రజినీశ్, రాకేశ్ గౌడ, రోహిత్ కుమార్, సిద్దార్థ్ దేశాయ్

    డిఫెండర్స్: ఆకాశ్ దత్తు అర్సుల్, ఆకాశ్ చౌదరి, మనీశ్, ఆదర్శ్ టి, సి. అరుణ్, ప్రిన్స్ డి, రుతురాజ్ కొరవి, సురీందర్ సింగ్, ఎస్తురో అబే, సందీప్ కండోలా

    జైపూర్ పింక్ పాంథర్స్:

    రైడర్స్: అమిన్ నొస్రతి, అమిర్ హొస్సేన్ మలేకి, అర్జున్ దేశ్వాల్, అశోక్, నవీన్, సునిల్ గులియా, అమిత్ నగార్

    డిఫెండర్స్: పవన్ టీఆర్, అమిత్ హుడా, ఎలవరసన్ ఏ, సందీప్ ధుల్, షౌల్ కుమార్, అమిత్ ఖర్బ్, ధర్మరాజ్ చేరలతన్, విశాల్ లాథర్

    ఆల్‌రౌండర్స్: దీపక్ హుడా, నితిన్ రావల్, సచిన్ నర్వాల్