Telugu Titans Vs Gujarat Giants : మళ్లీ అవే తప్పులు .. అదే ఫలితం. ఓ వైపు రైడర్స్ సూపర్ రైడ్స్ తో సత్తా చాటుతుంటే.. డిఫెండర్లు మాత్రం పదే పదే తప్పులు చేసి భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ఫలితం.. మరో మ్యాచులో తెలుగు టైటాన్స్ ఓటమి పాలైంది. దీంతో.. ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ గెలుపు రుచి చూడటం కొంచెం కష్టంగానే ఉంది. ఈ మ్యాచుతో ఆరు ఓటములు, రెండు టైలతో ఆఖరి స్థానంలో నిలిచింది. తెలుగు టైటాన్స్ లో రజనీశ్ దలాల్ సూపర్ -10 తో సత్తా చాటాడు. కానీ.. గుజరాత్ జెయింట్స్ లో రాకేష్ షన్ గ్రోయా సింగిల్ హ్యాండ్ తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. రాకేశ్ 16 పాయింట్లతో సత్తా చాటాడు. ఆఖరికి గుజరాత్ జెయింట్స్ 40 - 22 పాయింట్లతో తెలుగు టైటాన్స్ పై విజయభేరి మోగించింది.
Telugu Titans Vs Gujarat Giants : మళ్లీ అవే తప్పులు .. అదే ఫలితం. మరోసారి రైడర్స్ సత్తా చాటుతుంటే.. డిఫెండర్లు మాత్రం మళ్లీ అవే తప్పులు రిపీట్ చేస్తున్నారు. అనవసరపు ట్యాకిల్స్ కు ముందుగానే ప్రయత్నించి మూల్యం చెల్లించుకుంటున్నారు. రజనీశ్ దలాల్ మాత్రం సూపర్ రైడ్ షో కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. గుజరాత్ జెయింట్స్ లో రాకేశ్ షన్ గ్రోయా సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే సూపర్ -10 తో దుమ్మురేపాడు. దీంతో.. ఫస్టాఫ్ ముగిసే సమయానికి 20-13 పాయింట్లతో గుజరాత్ జెయింట్స్ ఆధిక్యంలో ఉంది.
ప్రొ కబడ్డీ లీగ్ (PKL 8 Season) రోజు రోజుకి అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు దూరమైన లీగ్.. ఆ లోటును భర్తీ చేస్తూ అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ బెంగళూరు వేదికగా జరుగుతోంది. కరోనా నిబంధనల నడుమ జరుగుతున్న ఈ లీగ్ లో ప్రతి జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాడుతున్నాయ్. గెలుపు దక్కించుకోవడం కోసం తగ్గేదే లే అన్నట్టుగా తాడో పేడో తేల్చుకుంటున్నాయ్. కానీ, ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8 మాత్రం తెలుగు టైటాన్స్‌కు పెదగా కలిసి రావడం లేదు. ఇప్పటివరకు దాదాపు సగం టోర్నీ ముగియగా టైటాన్స్ ఇంకా ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. దీనికి తోడు మొదటి నుంచి కూడా టైటాన్స్‌ను దురదృష్టం వెంటాడుతుంది. ఓడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయానికి చేరువగా వచ్చి ఓడిపోవడం టైటాన్స్‌ను కలవరపరుస్తోంది. దీంతో ఈ సీజన్‌లో తొలి విజయం కోసం టైటాన్స్‌కు మరింత నిరీక్షణ తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఒక్క గెలుపు కోసం గుజరాత్ జెయింట్స్ తో అమీతుమీ(Telugu Titans Vs Gujarat Giants) తేల్చుకోనుంది తెలుగు టైటాన్స్.
ఇప్పటివరకు ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8లో తెలుగు టైటాన్స్ 7 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. ఏకంగా 5 మ్యాచ్‌ల్లో ఓడింది. రెండు మ్యాచ్‌లను టైగా ముగించింది. అయితే ఓడినా 4 మ్యాచ్‌లతోపాటు టైగా ముగిసిన రెండు మ్యాచ్‌ల్లో విజయవకాశాలు టైటాన్సే వైపే ఉన్నప్పటికీ చివర్లో తొందరపాటుతో చేసిన తప్పులతో టైటాన్స్ మూల్యం చెల్లించుకుంది. ఇప్పటివరకు విజయం అందని ద్రాక్షగా మారింది. దీంతో తెలుగు టైటాన్స్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున 12వ స్థానంలో ఉంది. టైటాన్స్ ఖాతాలో కేవలం 10 పాయింట్లు ఉన్నాయి.
2018 (ఆరో సీజన్)లో బెంగళూరు బుల్స్‌ని విజేతగా నిలిపిన రోహిత్ కుమార్‌ని జట్టులోకి తీసుకున్న తెలుగు టైటాన్స్.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. అయితే, ఈ సీజన్ లో రోహిత్ కుమార్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రైడింగ్ లో పూర్తిగా డిఫెన్స్ లోకి పోతున్నాడు. ఇప్పటివరుకు సరియైన రైడింగ్ పాయింట్లు ఈ సీజన్ లో సాధించలేదు.అలానే మెరుగైన డిఫెండర్లుగా కితాబులు అందుకున్న సందీప్, సురీందర్, అరుణ్‌ని జట్టులో కీ ప్లేయర్లు.
ప్రొ కబడ్డీ లీగ్ బాహుబలిగా పేరొందిన సిద్ధార్థ్ దేశాయ్ గత నాలుగు మ్యాచుల నుంచి జట్టుకు దూరయ్యాడు. కెప్టెన్ రోహిత్ కుమార్ ఫామ్ అందుకోవాల్సిన సమయం వచ్చింది. కీలక సమయాల్లో డిఫెన్స్ లో తప్పిదాలు చేసి మ్యాచ్ ను చేజార్చుకుంటోంది తెలుగు టైటాన్స్. ఈ తప్పులు సరిచేసుకుంటే.. తొలి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. యంగ్ రైడర్ అంకిత్ బెన్వాల్, రజనీశ్ దలాల్ తమ ఫామ్ ను కంటిన్యూ చేయాల్సి ఉంది.
మరోవైపు, గుజరాత్ జెయింట్స్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ తెలుగు టైటాన్స్ లానే ఉంది. అయితే, ఆడిన ఏడు మ్యాచుల్లో ఒకటి గెలిచి .. మరో నాలుగింటిలో ఓటమి పాలైంది. రెండు మ్యాచుల్ని టైగా ముగించింది. దీంతో, 15 పాయింట్లతో టేబుల్ లో 11 వ స్ధానంలో నిలిచింది. గుజరాత్ జెయింట్స్ లో రాకేశ్ కుమార్ నర్వాల్, అజయ్ కుమార్ వంటి స్ట్రాంగ్ రైడర్లు ఉన్నారు. వీరిద్దరూ ప్రదర్శనపైనే గుజరాత్ విజయం ఆధారపడి ఉంది. గిరీష్ ఎర్నాక్, రవీందర్ పహల్ వంటి స్ట్రాంగ్ డిఫెండర్లు కూడా గుజరాత్ సొంతం.
హెడ్ టు హెడ్ రికార్డులు :
హెడ్ టు హెడ్ రికార్డుల్లో తెలుగు టైటాన్స్ పై గుజరాత్ జెయింట్స్ బెస్ట్ ప్రదర్శన చేసింది. ఇరు జట్లు 4 సార్లు తలపడగా.. 3 సార్లు గుజరాత్ గెలవగా.. కేవలం ఒక మ్యాచులో మాత్రం టైటాన్స్ నెగ్గింది.
ఆడే ఏడుగురి ప్లేయర్ల అంచనా:
తెలుగు టైటాన్స్ : రోహిత్ కుమార్, రజనీశ్ దలాల్ , అంకిత్ బెన్వాల్, సి అరుణ్, రుతురాజ్ కొరవై, సందీప్ కొండల, సురీందర్ సింగ్
గుజరాత్ జెయింట్స్ : రాకేశ్ నర్వాల్ , రాకేశ్ , అజయ్ కుమార్ , పర్వేష్ , సునీల్ మాలిక్ , గిరీష్ ఎర్నాక్, రవీందర్ పహల్
పూర్తి స్క్వాడ్స్ :
తెలుగు టైటాన్స్ జట్టు:
రైడర్స్: అమిత్ చౌహాన్, అంకిత్ బేనివాల్, గల్లా రాజు, హ్యున్సూ పార్క్, రజినీశ్, రాకేశ్ గౌడ, రోహిత్ కుమార్, సిద్దార్థ్ దేశాయ్
డిఫెండర్స్: ఆకాశ్ దత్తు అర్సుల్, ఆకాశ్ చౌదరి, మనీశ్, ఆదర్శ్ టి, సి. అరుణ్, ప్రిన్స్ డి, రుతురాజ్ కొరవి, సురీందర్ సింగ్, ఎస్తురో అబే, సందీప్ కండోలా
గుజరాత్ జెయింట్స్:
రైడర్స్: అజయ్ కుమార్, హర్మన్‌జిత్ సింగ్, హర్షిత్ యాదవ్, మహేంద్ర రాజ్‌పుత్, మనీందర్ సింగ్, ప్రదీప్ కుమార్, రతన్ కే, సోను
డిఫెండర్స్: అంకిత్, రవీందర్ పహల్, పర్వేశ్ భైన్స్‌వల్, గిరీష్ మారుతి ఎర్నక్, సుమిత్, సొలేమాన్ పెహ్లేవాని, సునిల్ కుమార్
ఆల్‌రౌండర్: హదీ ఒష్తోరక్