Telugu Titans Vs Bengal Warriors : మళ్లీ చేతులేత్తేసిన టైటాన్స్.. బెంగాల్ వారియర్స్ దే విక్టరీ..

ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ గెలుపు రుచి చూడటం కొంచెం కష్టంగానే ఉంది. ఈ మ్యాచ్ లో లాస్ట్ రెండు నిమిషాల వరుకు సూపర్ గా ఆడిన టైటాన్స్.. ఆఖర్లో కీలక తప్పిదాలు చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో.. మరో మ్యాచులో ఓడిపోయింది. రజనీశ్ దలాల్ (సూపర్ 10) వన్ మ్యాన్ షో మాత్రమే తెలుగు టైటాన్స్ కు ప్లస్ పాయింట్. ఆఖరికి 28-27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ తెలుగు టైటాన్స్ పై సూపర్ విక్టరీ కొట్టింది. బెంగాల్ కెప్టెన్ మణిందర్ సింగ్ కూడా సూపర్ 10 తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

  • News18 Telugu
  • | January 17, 2022, 21:42 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 4 MONTHS AGO

    AUTO-REFRESH

    Highlights

    21:43 (IST)
    21:41 (IST)

    ఈ సీజన్ లో తెలుగు టైటాన్స్ గెలుపు రుచి చూడటం కొంచెం కష్టంగానే ఉంది. ఈ మ్యాచ్ లో లాస్ట్ రెండు నిమిషాల వరుకు సూపర్ గా ఆడిన టైటాన్స్.. ఆఖర్లో కీలక తప్పిదాలు చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో.. మరో మ్యాచులో ఓడిపోయింది. రజనీశ్ దలాల్ (సూపర్ 10) వన్ మ్యాన్ షో మాత్రమే తెలుగు టైటాన్స్ కు ప్లస్ పాయింట్. ఆఖరికి  28-27 పాయింట్ల  తేడాతో బెంగాల్ వారియర్స్ తెలుగు టైటాన్స్ పై సూపర్ విక్టరీ కొట్టింది. బెంగాల్ కెప్టెన్ మణిందర్ సింగ్ కూడా సూపర్ 10 తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

    21:28 (IST)

    ప్రస్తుతం పాయింట్ కోసం రెండు జట్లు నువ్వా - నేనా అనే విధంగా రెండు జట్లు పోరాడుతున్నాయ్. ప్రస్తుతం 23-22 పాయింట్లతో తెలుగు టైటాన్స్ ఆధిక్యంలో ఉంది. 

    21:17 (IST)

    ప్రస్తుతం పాయింట్ కోసం రెండు జట్లు నువ్వా - నేనా అనే విధంగా రెండు జట్లు పోరాడుతున్నాయ్. ప్రస్తుతం 21-19 పాయింట్లతో తెలుగు టైటాన్స్ ఆధిక్యంలో ఉంది. 

    21:11 (IST)
    21:10 (IST)

    ఎప్పుడు తప్పులు చేసే తెలుగు టైటాన్స్  డిఫెండర్లు అదరగొడుతున్నారు. ప్రస్తుతం 19-15 పాయింట్లతో ఆదిక్యంలో నిలిచింది తెలుగు టైటాన్స్. 

    21:1 (IST)
    20:54 (IST)

    తెలుగు టైటాన్స్ ప్రస్తుతం లీడ్ లోకి వచ్చింది. ప్రస్తుతం 11-9 పాయింట్లతో ఆధిక్యంలో ఉంది టైటాన్స్. 

    20:49 (IST)

    ప్రతి పాయింట్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయ్. ప్రస్తుతం 7-7 పాయింట్లతో ఇరు జట్లు సమంగా నిలిచాయ్. 

    20:47 (IST)

    తెలుగు టైటాన్స్ ఆధిక్యంలోకి వచ్చింది. రజనీశ్ దలాల్ మరోసారి అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 6-5 తో ఆధిక్యంలో నిలిచింది తెలుగు టైటాన్స్. 

    ప్రొ క‌బ‌డ్డీ లీగ్ (PKL 8 Season) రోజు రోజుకి అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. క‌రోనా కార‌ణంగా దాదాపు రెండేళ్ల‌పాటు దూర‌మైన లీగ్.. ఆ లోటును భ‌ర్తీ చేస్తూ అభిమానుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ బెంగళూరు వేదికగా జరుగుతోంది. కరోనా నిబంధనల నడుమ జరుగుతున్న ఈ లీగ్ లో ప్రతి జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాడుతున్నాయ్. గెలుపు దక్కించుకోవడం కోసం తగ్గేదే లే అన్నట్టుగా తాడో పేడో తేల్చుకుంటున్నాయ్. కానీ, ప్రొ క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 8 మాత్రం తెలుగు టైటాన్స్‌కు పెద‌గా క‌లిసి రావ‌డం లేదు. దాదాపు ఈ సీజన్ ఆఖరి స్టేజి వరకు చేరగా.. టైటాన్స్ ఇంకా ఒక్క విజ‌యం కూడా న‌మోదు చేయ‌లేక‌పోయింది. దీనికి తోడు మొద‌టి నుంచి కూడా టైటాన్స్‌ను దుర‌దృష్టం వెంటాడుతుంది. ఓడిన అన్ని మ్యాచ్‌ల్లో విజ‌యానికి చేరువ‌గా వ‌చ్చి ఓడిపోవడం టైటాన్స్‌ను క‌ల‌వ‌రప‌రుస్తోంది. దీంతో ఈ సీజ‌న్‌లో తొలి విజ‌యం కోసం టైటాన్స్‌కు మ‌రింత‌ నిరీక్ష‌ణ త‌ప్ప‌డం లేదు. ఈ నేపథ్యంలో ఒక్క గెలుపు కోసం బెంగాల్ వారియర్స్ తో అమీతుమీ(Telugu Titans Vs Bengal Warriors) తేల్చుకోనుంది తెలుగు టైటాన్స్.

    ఇప్ప‌టివ‌ర‌కు ప్రొ క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 8లో తెలుగు టైటాన్స్ 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో క‌నీసం ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్‌లో కూడా విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఏకంగా 7మ్యాచ్‌ల్లో ఓడింది. రెండు మ్యాచ్‌ల‌ను టైగా ముగించింది. అయితే ఓడిన 6 మ్యాచ్‌ల‌తోపాటు టైగా ముగిసిన రెండు మ్యాచ్‌ల్లో విజ‌య‌వకాశాలు టైటాన్సే వైపే ఉన్న‌ప్ప‌టికీ చివ‌ర్లో తొంద‌ర‌పాటుతో చేసిన త‌ప్పుల‌తో టైటాన్స్ మూల్యం చెల్లించుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు విజ‌యం అంద‌ని ద్రాక్ష‌గా మారింది. దీంతో తెలుగు టైటాన్స్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒక్క విజ‌యాన్ని కూడా న‌మోదు చేయ‌లేక‌పోయిన తెలుగు టైటాన్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగున 12వ స్థానంలో ఉంది. టైటాన్స్ ఖాతాలో కేవ‌లం 11 పాయింట్లు ఉన్నాయి.

    2018 (ఆరో సీజన్)లో బెంగళూరు బుల్స్‌ని విజేతగా నిలిపిన రోహిత్ కుమార్‌ని జట్టులోకి తీసుకున్న తెలుగు టైటాన్స్.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. అయితే, ఈ సీజన్ లో రోహిత్ కుమార్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రైడింగ్ లో పూర్తిగా డిఫెన్స్ లోకి పోతున్నాడు. ఇప్పటివరకు సరియైన రైడింగ్ పాయింట్లు ఈ సీజన్ లో సాధించలేదు.అలానే మెరుగైన డిఫెండర్లుగా కితాబులు అందుకున్న సందీప్, సురీందర్, అరుణ్‌ని జట్టులో కీ ప్లేయర్లు. కానీ, వీళ్లు కూడా స్థాయికు తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నారు.

    ప్రొ కబడ్డీ లీగ్ బాహుబలిగా పేరొందిన సిద్ధార్థ్ దేశాయ్‌ గాయంతో.. జట్టుకు దూరయ్యాడు. కెప్టెన్ రోహిత్ కుమార్ ఫామ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కీలక సమయాల్లో డిఫెన్స్ లో తప్పిదాలు చేసి మ్యాచ్ ను చేజార్చుకుంటోంది తెలుగు టైటాన్స్. ఈ తప్పులు సరిచేసుకుంటే.. తొలి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. యంగ్ రైడర్ అంకిత్ బెన్వాల్, రజనీశ్ దలాల్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ ఇద్దరూ తప్ప మిగతా వారు అంతగా రాణించడం లేదు.

    మరోవైపు, బెంగాల్ వారియర్స్ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఆడిన 10 మ్యాచుల్లో 4 మాత్రమే గెలిచి.. ఐదింట్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ మాత్రమే డ్రా అయింది. దీంతో, 25 పాయింట్లతో పాయింట్ల టేబుల్ లో ఎనిమిదో స్థానంలో ఉంది. బెంగాల్ వారియర్స్ లో మణిందర్ సింగ్ కీ రైడర్. ఈ సీజన్ లో మణిందర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దర్శన్, అమిత్ నర్వాల్, అబ్జోర్ మిగానీ వంటి స్ట్రాంగ్ డిఫెండర్లు బెంగాల్ సొంతం

    హెడ్ టు హెడ్ రికార్డులు :

    హెడ్ టు హెడ్ రికార్డుల్లో తెలుగు టైటాన్స్ పై బెంగాల్ వారియర్స్ కు తిరుగులేని రికార్డు ఉంది. ఇరు జట్లు 16 సార్లు తలపడగా.. 9 సార్లు బెంగాల్ వారియర్స్ గెలవగా.. కేవలం 3 మ్యాచుల్లో మాత్రమే టైటాన్స్ నెగ్గింది. మరో 4 మ్యాచులు టై అయ్యాయ్.

    ఆడే ఏడుగురి ప్లేయర్ల అంచనా:

    తెలుగు టైటాన్స్ : రోహిత్ కుమార్, రజనీశ్ దలాల్ , అంకిత్ బెన్వాల్, ప్రిన్స్ డి , సురీందర్ సింగ్, సందీప్ ఖండోలా, ఆకాశ్ చౌదరి

    బెంగాల్ వారియర్స్ : మణిందర్ సింగ్, ఆకాశ్ పికల్‌ముండే, మహ్మద్ నబీభక్ష్, అమిత్ నర్వాల్, దర్శన్ జె, రణ్ సింగ్ రాణియా, అబ్జోర్ మిగానీ.

    పూర్తి స్క్వాడ్స్ :

    తెలుగు టైటాన్స్ జట్టు:

    రైడర్స్: అమిత్ చౌహాన్, అంకిత్ బేనివాల్, గల్లా రాజు, హ్యున్సూ పార్క్, రజినీశ్, రాకేశ్ గౌడ, రోహిత్ కుమార్, సిద్దార్థ్ దేశాయ్

    డిఫెండర్స్: ఆకాశ్ దత్తు అర్సుల్, ఆకాశ్ చౌదరి, మనీశ్, ఆదర్శ్ టి, సి. అరుణ్, ప్రిన్స్ డి, రుతురాజ్ కొరవి, సురీందర్ సింగ్, ఎస్తురో అబే, సందీప్ కండోలా

    బెంగాల్ వారియర్స్ :

    రైడర్స్: ఆకాశ్ పికల్‌ముండే, మనీందర్ సింగ్. రవీంద్ర కుమావత్, రిషాంక్ దేవడిగ, సుకేశ్ హెడ్జ్, సుమిత్ సింగ్,

    డిఫెండర్: దర్శన్ జే, విజిన్ తంగదురయ్, వినోద్ కుమార్, అమిత్ , ప్రవీణ్, సచిన్ విట్టల, అబ్జోర్ మొహజెర్మిగాని, రింకు నర్వాల్, రోహిత్ బన్నే

    ఆల్‌రౌండర్ : ఇస్మాయిల్ నబీబక్ష్, మనోజ్ గౌడ, రోహిత్