IND vs ENG Test : జూలై 1వ తేదీ నుంచి భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య రీషెడ్యూల్ టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో చివరి మ్యాచ్ కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ ను ఇప్పుడు నిర్వహించేలా ఇరు జట్ల బోర్డులు అంగీకారం తెలిపాయి. ఈ సిరీస్ లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్ ను భారత్ డ్రాగా ముగించినా చాలు ఇంగ్లండ్ గడ్డపై భారత్ కొత్త చరిత్రను లిఖించినట్లే అవుతుంది. అయితే టెస్టు మ్యాచ్ ఆరంభానికి ముందు భారత్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కరోనా బారిన పడ్డాడు. దాంతో అతడు జూలై 1న జరిగే టెస్టు మ్యాచ్ ఆడేది అనుమానంగానే ఉంది. దాంతో భారత్ ఇప్పుడు ఓపెనర్ల కోసం అన్వేషిస్తోంది.
శుబ్ మన్ గిల్ కు జోడీగా ఉన్న ఓపెనింగ్ స్థానం కోసం రేసులు ఇద్దరు తెలుగు ప్లేయర్లు ఉన్నారు. ఒకరు హనుమ విహారి కాగా మరొకరు శ్రీకర్ భరత్. వార్మప్ మ్యాచ్ లో శ్రీకర్ భరత్ రెండు ఇన్నింగ్స్ లలోనూ అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో 70 పరుగులతో నాటౌట్ గా నిలిచిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో 43 పరుగులు చేశాడు. ఒక విహారీ మాత్రం ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులు మాత్రమే చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇంగ్లండ్ లాంటి చోట భారత్ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది. వికెట్ కీపర్ గా పంత్ స్థానం ఖాయం. ఇక మిగిలింది ఐదు స్థానాలు. వీటిలో గిల్, కోహ్లీ, పుజారా, శ్రేయస్ అయ్యర్ స్థానాలు దాదాపుగా ఖాయం. రోహిత్ కరోనా బారిన పడటంతో అతడి స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. గతంలో విహారి ఓపెనింగ్ కూడా చేశాడు. రంజీల్లో విహారీ మూడో స్థానంలో ఆడతాడు. అయితే వార్మప్ మ్యాచ్ లో విహారీ పెద్దగా రాణించలేదు.
’సీనియర్లకే మొదటి ప్రాధాన్యత‘ అనే నియమాన్ని టీమిండియా ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది. ఆ రకంగా చూస్తే భారత్ ఓపెనర్ గా విహారికి అవకాశం ఇవ్వొచ్చు. అదే జరిగితే టీమిండియా తరఫున బరిలోకి దిగాలన్న శ్రీకర్ భరత్ మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఒక వేళ మ్యాచ్ లో భారత్ ముగ్గురు సీమర్లు ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగితే మాత్రం అటు భరత్.. ఇటు విహారి ఇద్దరు కూడా తుది జట్టులో ఆడే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Hanuma vihari, Hardik Pandya, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India, Virat kohli